Jabardasth : జబర్దస్త్‌లో ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కమెడియన్ ఎవరో తెలుసా?
Jabardasth : జబర్దస్త్ పదేళ్ల ప్రస్థానంలో గతంలో ఎప్పుడు లేనంత దారుణమైన రేటింగ్ ను ఇప్పుడు నమోదు చేస్తోంది. గత కొన్నాళ్లుగా జబర్దస్త్ రేటింగ్ చాలా తక్కువగానే ఉంటుంది. అయినా కూడా మల్లెమాల వారు గతంలో మాదిరిగా షో ను నడిపించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అత్యధికంగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే వారిని మరియు ఎక్కువగా క్రేజ్ ఉన్న వారిని తప్పిస్తూ ఉంది. ఇటీవలే హైపర్ ఆదిని మల్లెమాల వారు కాదనుకున్నారు. తక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే […]
Jabardasth : జబర్దస్త్ పదేళ్ల ప్రస్థానంలో గతంలో ఎప్పుడు లేనంత దారుణమైన రేటింగ్ ను ఇప్పుడు నమోదు చేస్తోంది. గత కొన్నాళ్లుగా జబర్దస్త్ రేటింగ్ చాలా తక్కువగానే ఉంటుంది. అయినా కూడా మల్లెమాల వారు గతంలో మాదిరిగా షో ను నడిపించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అత్యధికంగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే వారిని మరియు ఎక్కువగా క్రేజ్ ఉన్న వారిని తప్పిస్తూ ఉంది. ఇటీవలే హైపర్ ఆదిని మల్లెమాల వారు కాదనుకున్నారు. తక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే వారిని రంగంలోకి దించుతున్నారు.
ప్రస్తుతం జబర్దస్త్ మరియు ఎక్స్‌ట్రా జబర్దస్త్ కార్యక్రమాల్లో అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న వారు ఎవరు అనే విషయం ప్రస్థావనకు వస్తే కచ్చితంగా గెటప్ శ్రీను పేరు వినిపిస్తుంది. గెటప్ శ్రీను మరియు రామ్ ప్రసాద్ లు ఒక టీమ్ లో ఉన్నారు. ఇద్దరు టీమ్ లీడర్స్ గా కొనసాగుతున్నాయి. అయినా కూడా ఇద్దరి లో గెటప్ శ్రీను కు ఎక్కువ రెమ్యూనరేషన్ అందుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. రామ్ ప్రసాద్ నటుడిగా మరియు రచయితగా కూడా పారితోషికం లభిస్తూ ఉంటుందట.
గెటప్ శ్రీను సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా జబర్దస్త్ కార్యక్రమానికి సమయం కేటాయిస్తూ ఉన్నాడు. అందుకే ఈ షో లోని ఆయన యొక్క స్కిట్స్ కు మంచి స్పందన వస్తుంది. ఎపిసోడ్ మొత్తం లో కూడా రామ్ ప్రసాద్ మరియు గెటప్ శ్రీను యొక్క ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటారు కనుక ఆ స్థాయిలోనే వీరిద్దరు కామెడీ ని పండిస్తూ ఉంటారు. ఇక జబర్దస్త్ లో రాఘవ మరియు సద్దాం లు కాస్త ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారని సమాచారం అందుతోంది.