Jabardasth Varsha : మగాడు అంటూ అవమానించిన ఇమాన్యుయేల్.. కంటతడితో షో నుంచి వెళ్లిపోయిన వర్ష
Jabardasth Varsha : జబర్దస్త్ వేదికపై వర్ష ఇమాన్యుయేల్ ట్రాక్ బాగానే వర్కవుట్ అయింది. అది కాస్త అతిగా మారడంతో ప్రేక్షకులు తిప్పి కొట్టేశారు. దీంతో కొన్ని రోజులు ఈ ట్రాక్‌కు పుల్ స్టాప్ పెట్టేశారు. మళ్లీ కొన్ని రోజుల తరువాత యథాప్రకారంగా ట్రాక్ నడిపించారు. కానీ అతి చేయడం ఆపేశారు. ఈ ఇద్దరూ కూడా సపరేట్ ట్రాక్‌తో స్కిట్లు చేస్తూ వచ్చారు. లవర్లు, మొగుడు పెళ్లాళ్లా నటించడం లేదు.
పెళ్లి స్కిట్ అంటూ ఆ మధ్య చేసిన ఓ ప్రోగ్రాంతో మొదటికే మోసం వచ్చింది. నీ చిత్రం చూసి అనే పాట బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో వర్ష, ఇమాన్యుయేల్ చేసింది అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఎక్కువగా లవ్ స్కిట్లు వేయడం లేదు. బుల్లెట్ భాస్కర్ టీంలో ఈ ఇద్దరూ పని చేస్తున్నారు. అయితే తాజాగా హోళీ ఈవెంట్‌లో వర్షకు ఘోరమైన అవమానం జరిగింది.మామూలుగా వర్షను అందరూ లేడీ గెటప్పులా ఉన్నావ్,

Jabardasth Emannuel Humilates Varsha In Holi 2022 Event
Jabardasth Varsha : వెళ్లిపోయిన వర్ష..
మగాడే అంటూ సెటైర్లు వేస్తుంటారు. ఈ ఈవెంట్లోనూ ఆది, ఇమాన్యుయేల్‌లు సెటైర్లు వేస్తుంటారు. ఇమాన్యుయేల్ అన్న మాటలకు వర్ష కంటతడి పెట్టేసింది. ప్రతీసారి మగాడు అంటే ఎలా ఉంటుందని షో నుంచి వెళ్లిపోయింది. సారీ చెప్పురా అని రాం ప్రసాద్ బతిమిలాడాడు. నేను ఎందుకు చెప్పాలి అంటూ రివర్స్ అయ్యాడు. మొత్తానికి ఇది నిజమా? టీఆర్పీ కోసమా? అనేది చూడాలి.
