Jabardasth Faima : పంపించకుంటే చచ్చిపోతా.. వామ్మో వాళ్లని బ్లాక్ మెయిల్ చేసి ఇక్కడకు వచ్చిన ఫైమా.. మ్యాటర్ తెలిస్తే దేవుడా అంటారు..!
Jabardasth Faima : జబర్దస్త్ లేడీ కమెడియన్స్ లో ఇప్పుడిప్పుడే క్రేజ్ తెచ్చుకుంటున్న కమెడియన్ ఫైమా. ముందు పటాస్ లో స్టాండప్ కామెడీ చేస్తూ వచ్చిన ఆమె ఆ తర్వాత జబర్దస్త్ లో ఛాన్స్ దక్కించుకుంది. ఇక జబర్దస్త్ క్రేజ్ తోనే అమ్మడు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 లో కూడా సత్తా చాటుతుంది. బిగ్ బాస్ లో ఆమె తన మీద పెట్టుకున్న అంచనాలకు తగినట్టుగానే ఆట ఆడుతుంది.
అంతేనా హౌస్ మెట్స్ కి మంచి పోటీ కూడా ఇస్తూ వస్తుంది. అయితే పటాస్ టు బిగ్ బాస్ వయా జబర్దస్త్ ఫైమా కెరియర్ విషయాలను లోతుగా చూస్తే.. ఆమె ఒక పేద కుటుంబం నుంచి వచ్చింది. కట్టెలకు వెళ్లి వాటిని అమ్మి వచ్చిన డబ్బులతోనే వాళ్ల అమ్మ ఫైమా వాళ్లని సాధిందట. ఇక పటాస్ ఛాన్స్ రాగానే టీవీల్లో.. సినిమాల్లోకి వద్దని తన ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదట.

Jabardasth Faima Blackmail them to Enter Into Industry Bigg Boss
అయితే ఫైమా మాత్రం తను వెళ్తానని గట్టిగా చెప్పిందట. మీరు నన్ను పంపించకపోతే చచ్చిపోతానని బెదిరించిందట. అలా బెదిరించి మరీ వచ్చిన ఫైమా జబర్దస్త్ లో సూపర్ ఎంటర్టైన్ చేసింది.. ఇప్పుడు బిగ్ బాస్ లో టాప్ 5లో నిలిచేలా తన గేం ఆడుతుంది. ఇన్ని కష్టాలు పడ్డ ఫైమాని బిగ్ బాస్ లో గెలిపించాలని చూస్తున్నారు ఆడియన్స్.