Jabardasth Faima : ఫైమాకి మల్లెమాల వారి కంటే బిగ్ బాస్ వారు ఎక్కువ పారితోషికం ఇస్తారా?
Jabardasth Faima ; జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫైమా మంచి గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే. మొదట ఆమె పటాస్ కార్యక్రమంలో పాల్గొంది. ఆ సమయంలో మల్లెమాల వారి దృష్టిని ఆకర్షించింది.. దాంతో జబర్దస్త్ అవకాశాన్ని సొంతం చేస్తుంది. తద్వారా జబర్దస్త్ లో ఒక స్టార్ గా మారిపోయింది. అందరికీ అభిమాన కమెడియన్ గా ఆమె పేరు దక్కించుకుంది. జబర్దస్త్ లో ఒక స్థాయి కమెడియన్ నుండి టాప్ స్థాయి కమెడియన్ గా ఆమె నిలిచింది. ప్రస్తుతం ఆమెకు ఒక స్టార్ ఇమేజ్ ఉంది. ఇలాంటి సమయంలో ఆమె జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేసి స్టార్ మా లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొంటుంది. ఆమె జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేసింది.
ఫైమా జబర్దస్త్ కార్యక్రమాన్ని కచ్చితంగా వదలదు అంటూ అంతా భావించారు.. కానీ జబర్దస్త్ వీడి బిగ్ బాస్ కార్యక్రమంలో ఎంట్రీ ఇచ్చింది. స్టార్ మా బిగ్ బాస్ నిర్వాహకులు అత్యధిక పారితోషకమును ఆమెకు ఆఫర్ చేయడం వల్లే జబర్దస్త్ నుండి బయటకు వచ్చినట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో నటించినందుకు గాను ఆమెకు రోజుకి లక్షన్నర రూపాయల వారితోషికం లభించేదట. వారంలో పది రోజుల కంటే ఎక్కువగా షూటింగ్ ఉండదు. బయట ఈవెంట్లు ఇతరత్రా వెళ్లినా కూడా వారంలో 15 రోజులకు మించి ఆమెకు వర్క్ ఉండదు.

Jabardasth Faima now in bigg boss season 6 and her remuneration
అందుకే బిగ్ బాస్ ద్వారా ఎక్కువ సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఫైమా వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ షో లో పాల్గొన్నందుకు ఫైమాకి వారంకి రెండున్నర లక్షల పారితోషికం ఇస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫైమా కి అనుకూలంగా విపరీతంగా ట్రెండు నడుస్తోంది. కనుక ఆమె ఫైనల్ వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఆమె ఫైనల్ వరకు వెళ్తే భారీ మొత్తంలోనే ఆమె సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కనుక ఆమె అభిమానులను ప్రసన్నం చేసుకుని ఓట్లు ఎలా పొందాలో ఆలోచిస్తే బెటర్ అని సన్నిహితులు అభిప్రాయం చేస్తున్నారు.