Hyper Aadi : మిలియన్ ల నుండి లక్షలకు పడిపోయిన హైపర్ ఆది.. ముందు ముందు ఏం చూడాలో
Hyper Aadi : ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో దశాబ్ద కాలం పూర్తి చేసుకోబోతోంది. మరి కొన్ని నెలల్లో ఈ షో ప్రారంభం అయ్యి పది సంవత్సరాలు పూర్తి అవుతుంది అంటే ఎవరు నమ్మలేకుండా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఈ షో ఆకట్టుకుంటూనే ఉంది. అద్భుతమైన కామెడీ షో గా పేరు దక్కించుకుంది. ఈటీవీ కి రికార్డు స్థాయి రేటింగ్ ను సంపాదించిపెట్టింది అనడంలో సందేహం లేదు. ఈటీవీ కి మల్లెమాల వారికి జబర్దస్త్ ఓరేంజ్ గుర్తింపుని తెచ్చిపెట్టింది.ఇక గత కొంత కాలంగా జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ షో లను తన భుజాలపై వేసుకుని మరీ మోస్తున్నాడు హైపర్ ఆది.
అతడి స్కిట్లు కొంత కాలం ముందు వరకు యూట్యూబ్ లో మిలియన్ ల కొద్ది వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి.కానీ ఈ మధ్య కాలంలో ఆది కామెడీ స్కిట్లు అంతగా వెళ్లడం లేదు. ఒకటి రెండు తప్ప ఏ ఒక్కటి కూడా మిలియన్ ల కొద్ది వ్యూస్ ను సొంతం చేసుకోలేక పోతున్నాయి. చాలా వరకు లక్షల్లోనే ఆయన స్కిట్స్ కు సంబంధించిన వ్యూస్ వస్తున్నాయి.ఆదిలో మొదట కనిపించిన ఫైర్ లేదు అంటున్నారు. అతడి నుండి ఓ రేంజ్ కామెడీ ఆశిస్తున్న ప్రేక్షకులకు నిరాశ తప్పడం లేదు. ఆది నుండి మంచి కామెడీ అని కాకుండా కింద పడే స్థాయి పంచ్ ల కోసం ప్రేక్షకులు ఆశిస్తారు.

jabardasth Hyper Aadi comedy going low these days
కానీ ప్రేక్షకులు ఆశిస్తున్న స్థాయిలో మాత్రం ఆయన నుండి ఈ మధ్య కాలం లో పంచ్ లు రావడం లేదు.ఆయన వేసే పంచ్ ల కంటే జడ్జి లు వేసే పంచ్ లు బాగుంటున్నాయి. అప్పుడప్పుడు మాత్రమే ఆది ఆకట్టుకుంటున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. గత వారం ఆయన చేసిన స్కిట్ కి వచ్చిన వ్యూస్ ఆయన స్థాయిలో దారుణంగా పడిపోయిందని చెప్పకనే చెబుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే హైపర్ ఆది టీమ్ ను కూడా తప్పిస్తారేమో అంటూ బుల్లి తెర వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరో వైపు సుడిగాలి సుధీర్ టీం జోరు కొనసాగుతూ వస్తోంది.