Jabardasth Kirrak RP : అతిపెద్ద డేంజర్ లో జబర్దస్త్ కిరాక్ RP చేపల పులుసు వ్యాపారం..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jabardasth Kirrak RP : అతిపెద్ద డేంజర్ లో జబర్దస్త్ కిరాక్ RP చేపల పులుసు వ్యాపారం..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :9 February 2023,10:00 pm

Jabardasth Kirrak RP : బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో అయిన జబర్దస్త్ ద్వారా ఫుల్ పాపులర్ అయ్యాడు కిరాక్ ఆర్పీ. ఆ షో నుంచి బయటికి వచ్చాక తను వ్యాపార రంగంలోకి దిగాడు. అతను స్టార్ట్ చేసిన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బిజినెస్ బాగా సక్సెస్ అయింది. కొన్ని నెలల క్రితం కూకట్ పల్లిలో ఏర్పాటు చేసిన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ కు ఆర్పీ 40 లక్షలు ఇన్వెస్ట్ చేసి మరి పెద్ద ఎత్తున ప్రారంభించారు. కొన్ని రోజుల్లోనే పెట్టుబడి తిరిగి వచ్చేసిందని లాభాలు మొదలయ్యాయి అంటూ స్వయంగా వెల్లడించారు. కిరాక్ ఆర్పీ చేపల పులుసు వ్యాపారం బాగా డిమాండ్ పెరగడం

Jabardasth Kirrak RP fish business in danger

Jabardasth Kirrak RP fish business in danger

తో అదనంగా సిబ్బందిని కూడా నియమించుకున్నాడు. మణికొండ తో పాటు హైదరాబాదులో పలుచోట్ల బ్రాంచెస్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నానని చెప్పాడు. ఈ క్రమంలోనే కిరాక్ ఆర్పీ వ్యాపారం బాగా సాగుతున్న సమయంలో కొందరు కుట్రలు చేస్తున్నారట. కొందరు పెయిడ్ బ్యాచ్ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బాగోలేదంటూ దుష్ప్రచారం మొదలుపెట్టారట. ఆ విషయాన్ని కిరాక్ ఆర్పీ ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఒకసారి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు తిన్నవారు ఇంకో పదిమందిని తీసుకొస్తున్నారు. కస్టమర్స్ స్వయంగా సన్నిహితులకు చెప్పి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నారు.

Jabardasth Kirrak RP fish business in danger

Jabardasth Kirrak RP fish business in danger

పులుసు రుచిగా లేకపోతే మళ్లీ రారు కదా. ఒక పెయిడ్ బ్యాచ్ తయారై సోషల్ మీడియాలో నా వ్యాపారంపై చెడు ప్రచారం చేస్తున్నారు. వాళ్లు ఎన్ని చేసినా నా వ్యాపారానికి ఏమీ కాదు. వాళ్ళు చేసే దుష్ప్రచారం వలన నా వ్యాపారానికి మరింత పబ్లిసిటీ పెరుగుతుంది అని కిరాక్ ఆర్పి విశ్వాసం వ్యక్తం చేశారు. జబర్దస్త్ షో తో ఫేమస్ అయిన కిరాక్ ఆర్పీ జబర్దస్త్ వదిలేశాక ఓ మూవీ ని స్టార్ట్ చేశారు అది అనుకోని కారణాల వలన మధ్యలోనే ఆగిపోయింది. దీంతో కిరాక్ ఆర్పీ సొంత వ్యాపారం చేసి సక్సెస్ అయ్యాడు. ఈ వ్యాపారంతో పదిమందికి పని దొరికేలా చేశారు.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది