Jabardasth Naresh : ఛీ ఛీ దరిద్రం.. దొండకాయను చూపించిన నరేష్.. తలదించుకున్న ఇంద్రజ

Authored By aruna | The Telugu News | Updated on : 8 August 2022, 2:20 pm

Jabardasth Naresh : బుల్లితెరపై ప్రస్తుతం డబుల్ మీనింగ్ డైలాగ్స్‌దే రాజ్యమేలుతోన్న సంగతి తెలిసిందే. అది జబర్దస్త్ షో అయినా.. శ్రీదేవీ డ్రామా కంపెనీ అయినా.. చివరకు పాటలు, ఆటల షో అయినా సరే డబుల్ మీనింగ్స్ ఉండాల్సిందే. ఢీ షో, సింగింగ్ షో ఇలా ఏదైనా సరే అందులో కామెడీ ఉండాల్సిందే.. అందులోనూ పిచ్చి కామెంట్లు ఉండాల్సిందే. ఇక తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఓ గ్యాంగ్ రెచ్చిపోయింది. తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీలో నా కొడుకు అంటూ ఓ ఈవెంట్ చేశారు. కృష్ణ భగవాన్ ఈ ఎపిసోడ్‌కు గెస్టుగా వచ్చాడు. ఇక తన తప్పిపోయిన కొడుకుని తిరిగి పట్టుకునే థీమ్ అంటూ నానా హంగామా చేశారు. తన కొడుక్కి పచ్చి మిర్చి తినే అలవాటుందని అందరితో తినిపించేశారు. పోటీల్లో అందరూ ఓడిపోతారు. మిర్చి తినడంతో వారి కడుపులు మండిపోతాయి. ఇక ఆతరువాత మరో టెస్ట్ పెడతాడు.

Jabardasth Naresh : షోలో రెచ్చిపోయిన నరేష్

ఒక రూపాయిని పది రూపాయలు చేసే బిజినెస్ తెలివి ఉందని కృష్ణ భగవాన్ చెప్పడంతో.. మరో స్కిట్ వేస్తారు. ఇందులో ఒక్కొక్కొరు ఒక్కో వ్యాపారం చేస్తుంటారు. ఆది మూలికలు, ఇమాన్యుయేల్ పీచు మీఠాయిలు.. రాం ప్రసాద్ కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. ఇక కొనడానికి వచ్చిన నరేష్ తన పరువు తానే తీసుకున్నాడు. దొండకాయ ఏంటి ఇంతే ఉంది అంటూ డబుల్ మీనింగ్‌లో అంటాడు.

Jabardasth Naresh Fun in SRidevi Drama Company

Jabardasth Naresh Fun in SRidevi Drama Company

Jabardasth Naresh : తలదించుకున్న ఇంద్రజ..

ఎక్కడో చూసినట్టుగా ఉంది కదా? అని రాం ప్రసాద్ ఇంకా రెచ్చగొడతాడు. ఇదంతా వినలేక ఇంద్రజ-Indraja సిగ్గుతో తలదించుకుంటుంది. ఈ ఛండాలాన్ని చూస్తూ అక్కడి వారంతా కూడా పగలబడినవ్వుతుంటారు. మొత్తానికి వీరంతా హద్దులు దాటుతున్నట్టు కనిపిస్తోంది.

Advertisement

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp