jabardasth new anchor soumya rao and mallemala interesting update
Sowmya Rao : జబర్దస్త్ ప్రారంభం నుండి యాంకర్ గా కొనసాగుతూ వస్తున్న అనసూయ ఆ మధ్య తప్పుకున్న విషయం తెల్సిందే. జబర్దస్త్ కార్యక్రమం యొక్క కొత్త యాంకర్ గా సౌమ్యా రావ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. అనసూయ సినిమాల్లో నటిస్తున్న కారణంగా బిజీగా ఉన్నాను. జబర్దస్త్ కి డేట్లు ఇవ్వలేక పోతున్నాను అంటూ అనసూయ తప్పుకున్న విషయం తెల్సిందే. ఆ సమయంలో రష్మీ గౌతమ్ ను యాంకర్ గా రెండు షో లకు జబర్దస్త్ నిర్వాహకులు చేయించారు. కన్నడ బ్యూటీ సౌమ్యా రావును రంగంలోకి దించిన మల్లెమాల వారు అనుకున్నట్లుగానే సక్సెస్ అయ్యారు.
నాలుగు వారాలకు సౌమ్యా రావును మొదట యాంకర్ గా ఒప్పందం చేసుకున్న మల్లెమాల వారు ఆ ఒప్పందంను కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. మరో నాలుగు వారాల పాటు పొడగించారట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అందరితో చేయించుకున్నట్లుగానే సంవత్సరానికి గాను ఆమెతో ఒప్పందం చేయించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయట. కేవలం జబర్దస్త్ లో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు మల్లెమాల వారు నిర్వహించే కార్యక్రమాలకు కూడా ఆమె రావాల్సి ఉంటుందని ఆ ఒప్పందం లో క్లీయర్ గా మెన్షన్ చేస్తారని కూడా సమాచారం అందుతోంది.
jabardasth new anchor soumya rao and mallemala interesting update
కన్నడకు చెందిన సౌమ్యా రావు చాలా సీరియల్స్ లో నటించింది. తన మాటలతో మరియు యాక్టివ్ బాడీలాంగ్వేజ్ తో ఈ అమ్మడు భలే ఉందే అనిపించుకుంది. ప్రతి ఒక్కరితో కూడా ప్రశంసలు దక్కించుకుంటుంది. ఆది వల్ల ఈమెకు మరింతగా పాపులారిటీ దక్కింది అనేది ఇండస్ట్రీ వర్గాల మాట. ఇప్పుడు జబర్దస్త్ నుండి ఆది వెళ్లి పోయాడు. అయినా కూడా ఆమె కు మంచి పేరు రావడంతో కంటిన్యూ అవుతుంది. మొదటి షెడ్యూల్ పేమెంట్ తో పోల్చితే సౌమ్యా రావు యొక్క పారితోషికం ఇప్పుడు రెట్టింపు అయ్యింది అని కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి జబర్దస్త్ యొక్క పర్మినెంట్ కొత్త యాంకర్ సౌమ్యా రావు అంటూ బుల్లి తెర వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.