Ys Jagan : ఇది 2023. ఇంకో సంవత్సరంనరలో ఏపీలో ఎన్నికలు రానున్నాయి. దాని కోసం ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి. అందులో భాగంగా టీడీపీ నేత నారా లోకేశ్ కూడా పాదయాత్రకు సిద్ధం అవుతున్నాడు. ఈనెల 27 నుంచే చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పాదయాత్రను ప్రారంభించాలని నారా లోకేశ్ డిసైడ్ అయ్యారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్ర పేరుతో బస్సు యాత్రను నిర్వహించనున్నారు. అయితే.. రెండు ప్రధాన పార్టీలు ఎన్నికల వేళ ఇలా యాత్రలను ప్రారంభిస్తే అది ఖచ్చితంగా వైసీపీ పార్టీకి మైనస్ అవుతుంది.
దీంతో తాజాగా ఏపీలో రోడ్లపై ర్యాలీలు, సమావేశాలు, సభలను నిర్వహించకుండా వాటిని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే.. నేషనల్ హైవేల మీద కానీ.. రాష్ట్ర రహదారుల మీద కానీ, మున్సిపల్, పంచాయితీరాజ్ రోడ్ల మీద కానీ ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. అయితే.. ఇటీవల కందుకూరు, గుంటూరులో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. ఏ పార్టీ కూడా తాజా నిషేధం వల్ల ఏ రోడ్డుపై కూడా సభ పెట్టే అవకాశం ఉండదు. నిజానికి.. రోడ్ల మీద షోలు చేయడం వల్ల.. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
నిర్వహణ లోపాల వల్ల కూడా ప్రజల ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే.. ఏపీ వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నామని ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. పోలీసులు ప్రత్యేక పర్మిషన్ ఇస్తే సభలు నిర్వహించుకోవచ్చు. సభకు ముందే పోలీసులను సంప్రదించి పర్మిషన్ తీసుకోవాలి. సభకు ఎంత మంది వస్తున్నారు. సభ ఉద్దేశం అన్నీ పరిశీలించి పోలీసులే సభకు అనుమతి ఇవ్వాలా వద్దా అని నిర్ణయిస్తారు. అయితే.. ఇదంతా కావాలని ప్రతిపక్షాల పాదయాత్రలను అడ్డుకోవాలని వైసీపీ ప్రభుత్వం చేస్తున్న నిషేధం అంటూ ప్రతిపక్షాలు ఓవైపు గగ్గోలు పెడుతున్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.