Jabardasth Paradesi : బాబోయ్ జబర్దస్త్ పరదేశీలో అంత ప్రతిభ ఉందా.. ఆది నిజంగా దేవుడే
Jabardasth Paradesi : జబర్దస్త్ హైపర్ ఆది టీం లో పరదేశి అనే ఒక కమెడియన్ ఉంటాడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ మధ్య వైజాగ్ రైటింగ్ లో ఈ పరదేశి పట్టుపడ్డాడు. సహజంగా అయితే అలాంటి రైడింగ్ లో పట్టుబడితే పోలీస్ కేస్ అయ్యి వారి కెరియర్ నాశనమైనట్లే.. కానీ హైపర్ ఆది దయవల్ల స్కిట్స్ లో కనిపిస్తూ వస్తున్నాడు. పరదేశి వైజాగ్ లో పట్టుపడ్డ తర్వాత కెరియర్ విషయంలో ఆందోళన పెట్టుకున్నాడు. కానీ అతడి అదృష్టం బావుంది. హైపర్ ఆది మరియు రోజా మద్దతుతో సహకారంతో బయటపడ్డాడు.హైపర్ ఆది, పరదేశిని ఎక్కువగా నమ్మాడు.
కేవలం ఒక నటుడిగా మాత్రమే కాకుండా పరదేశిలో ఒక మంచి రైటర్ కూడా ఉన్నాడని ఆది గుర్తించాడు. అందుకే అతడికి తన స్కిట్ యొక్క రచన బాధ్యత అప్పగించడంతో పాటు కార్యక్రమం యొక్క ఢీ డాన్స్ షో యొక్క కామెడీ స్కిట్ లు కూడా రాసే బాధ్యతను అప్పగించాడు. తనకు అప్పగించిన బాధ్యతను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న పరదేశి ఇప్పుడు ఒక మంచి రైటర్ గా నిలిచాడు. ఆది మార్క్ పంచ్ డైలాగులు మాత్రమే కాకుండా మంచి కాన్సెప్ట్ లను కూడా పరదేశి తీసుకొస్తూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడంలో సక్సెస్ అవుతున్నాడు. కనుక ముందు ముందు పరదేశి మరింతగా సక్సెస్ అవ్వడం
ఖాయమని సినిమాల్లో కూడా ఎంట్రీ ఇస్తే మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాడని ఆయన అభిమానులు మరియు సన్నిహితులు మాట్లాడుకుంటున్నారు. పరదేశి గురించి ఎప్పుడు హైపర్ ఆది మరియు ఇతర కమెడియన్స్ వైజాగ్ రైడింగ్ అంటూ కామెడీ చేస్తూ ఉంటారు. అయితే ఆ వైజాగ్ రైటింగ్ కాన్సెప్ట్ వళ్లే పరదేశి మరియు దొరబాబు మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ముందు ముందు వీరు మరింత సక్సెస్ అవ్వాలి. వీరి యొక్క సక్సెస్ కి ప్రధాన కారణం హైపర్ ఆది అనడంలో సందేహం లేదు. అందుకే వారు హైపర్ ఆది ని తమ దేవుడు అంటూ పూజిస్తూ ఉంటారు.