Jabardasth Paradesi : జబర్దస్త్ కమెడియన్ పరదేశీ, దొరబాబులు వైజాగ్ వ్యభిచార గృహంలో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. నాడు అలా విటులుగా దొరికిన తరువాత పరదేశీ, దొరబాబుల ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయింది. అలా దొరికిన తరువాత ఈ కమెడియన్లకు మళ్లీ అవకాశాలు రాకపోవచ్చని అంతా అనుకున్నారు. అసలు ఆ కేసులోంచి బయటపడతారా? అని కూడా అనుకున్నారు. కానీ హైపర్ ఆది మాత్రం తన పలుకుబడితో అంతా మార్చేశాడు. వాళ్లని వెనక్కి తీసుకొచ్చాడు.తన టీంలో మళ్లీ పెట్టుకున్నాడు. మునుపటి కంటే ఎక్కువ ఫేమస్ అయ్యేలా చేశాడు.
నాటి ఘటన మీద నేటికీ ఏదో ఒక పంచ్ వేస్తూనే ఉంటాడు. ఆ గాయాన్ని గుర్తు చేస్తూనే ఉంటాడు. అయితే ఆది మాత్రం పరదేశీ, దొరబాబుల పాలిట దైవం అయ్యాడు. ఇదే విషయాన్ని గతంలో ఎన్నో సార్లు దొరబాబు భార్య కూడా చెప్పింది. ఇక ఇప్పుడు పరదేశీ తల్లి కూడా చెప్పింది. తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో ఈ మేరకు పరదేశీని ఓ అభిమాని ప్రశ్నించాడు.వైజాగ్ ఘటన నాడు మీ తల్లి రియాక్షన్ ఏంటి? అని అడగడంతో పరదేశీ అసలు విషయాన్ని చెప్పాడు. ఆ సమయంలో మా అమ్మ బాగా భయపడింది.. కానీ హైపర్ ఆది అన్న వల్లే బయటకు వచ్చాం..

అన్న వల్లే మళ్లీ మాకు అవకాశాలు వచ్చాయి.. హైపర్ ఆది అన్న టీంలో ఉన్నాం కాబట్టే అలా బయటపడగలిగాం.. నాకు నాన్న లేడు.. కానీ హైపర్ ఆది అన్న ఉన్నాడు అంటూ పరదేశీ ఎమోషనల్ అయ్యాడు. ఇక పరదేశీ తల్లి కూడా హైపర్ ఆది గురించి చెబుతూ కంటతడి పెట్టుకుంది.నా కొడుకుని హైపర్ ఆదినే కాపాడాడు.. ఆయన లేకుండా ఈ రోజు ఇలా ఉండేవాళ్లం కాదంటూ పరదేశీ వాళ్ల అమ్మ చెబుతూ కన్నీరుమున్నీరైంది. నా అమ్మ, నా అన్న అంటూ పరదేశీ స్టేజ్ మీదే కంటతడి పెట్టేసుకున్నాడు. మొత్తానికి హైపర్ ఆది మాత్రం మళ్లీ వాళ్లకు లైఫ్ ఇచ్చాడనేది నిజం.