jabardasth Paradesi : ఇంకా ఆ కేసులు కొట్టేయలేదా?.. అసలు విషయం చెప్పిన జబర్దస్త్ పరదేశీ

 Authored By prabhas | The Telugu News | Updated on :14 May 2022,10:00 pm

jabardasth Paradesi : జబర్దస్త్ పరదేశీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. జబర్దస్త్ షోలో కనిపించే ఆర్టిస్ట్‌గా కంటే.. వైజాగ్ ఘటనలో పట్టుబడ్డ నటుడిగానే ఎక్కువ ఫేమస్ అయ్యాడు. వ్యభిచార గృహంలో విటులుగా పట్టుబడ్డ దొరబాబు, పరదేశీలు ఎంతగా ఫేమస్ అయ్యారో అందరికీ తెలిసిందే. వైజాగ్ ఘటన నుంచి హైపర్ ఆదినే వాళ్లిద్దరినీ బయటకు తీసుకొచ్చాడు. తన ఇంఫ్లూయెన్స్ ఉపయోగించి ఆ ఇద్దరిని కాపాడాడు. అయితే ఆ తరువాత ఆ ఇద్దరికి జబర్దస్త్ షోలో అవకాశాలు ఉండవు అని అంతా అనుకున్నారు.కానీ ఆది మాత్రం ఆ ఇద్దరినీ పెట్టుకున్నాడు.

ఆ ఘటన మీదే సెటైర్లు వేసుకుంటూ స్కిట్లు రాసుకుంటూ వచ్చాడు. పరదేశీ, దొరబాబుల మీద ఎప్పుడూ కూడా వైజాగ్ ఘటనను ప్రస్థావిస్తూ సెటైర్లు వేస్తుంటాడు. ఒక్కోసారి అవి మితిమీరిపోతుంటాయి. కానీ ఆ ఇద్దరూ కిమ్మనరు. అలా ఆది కౌంటర్లు వేస్తేనే తాము మరింతగా ఫేమస్ అవుతుంటామని అనుకుంటారు. అయితే తాజాగా పరదేశీ ఓ స్కిట్లో భాగంగా కొన్ని కామెంట్లు చేశాడు. అందులో భాగంగా కొన్ని విషయాలు మళ్లీ ప్రస్థావనకు వచ్చాయి.తాజాగా పరదేశీ, నూకరాజు, గలాట గీతూ, రోహిణి కలిసి చేసిన స్కిట్లో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. దెయ్యం పట్టిన వాడిలా పరదేశీ నటించాడు.

jabardasth Paradesi Satires On His Vizag Incident Case

jabardasth Paradesi Satires On His Vizag Incident Case

మాంత్రికురాలిగా రోహిణి కనిపించింది. వీడి మీద ఏదో ఉంది అని రోహిణి అంటే.. అవును నా మీద రెండు కేసులు ఉన్నాయ్.. అవి ఇంకా కొట్టేయలేదు అని చెప్పుకొచ్చాడు. అంటే వైజాగ్ ఘటన కేసు ఇంకా నడుస్తోందా? ఇంకా ముగిసిపోలేదా? అనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి. ఇంకో సందర్భంలో నూకరాజు ఓ పంచ్ వేశాడు.దెయ్యం పట్టినట్టు నటించమంటే.. వాళ్లు పట్టుకున్నప్పుడు ఏం చేశాడో అలా చేస్తున్నాడు అని పరదేశీ పరువు తీసేశాడు నూకరాజు. మొత్తానికి వైజాగ్ ఘటనను మాత్రం ఇలా ప్రతీ స్కిట్లో వాడేసుకుంటూ జనాలకు ఇంకా గుర్తు చేస్తూనే ఉన్నారనర్నమాట.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి