Jabardasth Praveen : జబర్దస్త్ ప్రవీణ్ ఇంట్లో విషాదం.. స్టేజ్ మీదే ఏర్చేసిన ఫైమా లవర్

Authored By aruna | The Telugu News | Published on: September 26, 2022, 7:30 pm

Jabardasth Praveen : జబర్దస్త్ స్టేజ్ మీద ప్రవీణ్ మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. పటాస్ షోతో తెర మీదకు వచ్చిన ప్రవీణ్.. జబర్దస్త్ షోతో మరింతగా ఫేమస్ అయ్యాడు. ఫైమా, ప్రవీణ్, నూకరాజు, ఆసియా ఇలాంటి వాళ్లంతా కూడా పటాస్ షోతో ఎక్కువగా ఫేమస్ అయ్యారు. అయితే ప్రవీణ్, ఫైమాల కథ మాత్రం ఎన్నో ఏళ్లుగా నడుస్తోంది. ప్రవీణ్ ఫైమా లవ్ స్టోరీ మీద ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ నడుస్తూనే ఉంటుంది. ఫైమా ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో ఉంది. ప్రవీణ్ జబర్దస్త్ స్టేజ్ మీద సందడి చేస్తున్నాడు. బిగ్ బాస్ ఇంట్లోకి ఫైమా వెళ్లినప్పుడు ఓ మాట చెప్పింది. అసలు ఇప్పుడు నేను ప్రవీణ్ పక్కన ఉండాల్సింది..

ఎందుకంటే వాళ్ల నాన్న చనిపోయాడు.. ఈ సమయంలో నేను ప్రవీణ్ పక్కన ఉండాలి.. కానీ వాడే నన్ను బిగ్ బాస్ ఇంటికి పంపించాడు.. బిగ్ బాస్ ఆఫర్ రావడం గొప్ప.. నువ్ వెళ్లు.. బాగా ఆడు అని నన్ను పంపించాడు అంటూ ఫైమా స్టేజ్ మీద చెబుతూ ఎమోషనల్ అయింది. ఇక ఫైమా కోసం ప్రవీణ్ రాసిన ఫన్నీ లెటర్‌ను నాగార్జున స్టేజ్ మీదే చదివించేలా చేశాడు. అయితే ప్రవీణ్ తల్లి చిన్నప్పుడే మరణించింది. తండ్రే అన్నీ తానై పెంచాడు. ఇక ప్రవీణ్ తన తండ్రిని కోల్పోయాడనే వార్త ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. ఎందుకంటే తాజాగా రిలీజ్ చేసిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో ఈ మేరకు అసలు విషయాన్ని చెప్పేశారు.

Jabardasth Praveen father Passes away and Gets Emotional in Extra Jabardasth Promo

Jabardasth Praveen father Passes away and Gets Emotional in Extra Jabardasth Promo

ప్రవీణ్ తన తండ్రిని కోల్పోయాను అంటూ తెగ ఏడ్చేశాడు.స్టేజ్ మీదే కన్నీరు పెట్టుకున్నాడు. నాకు తల్లి లేదు.. అన్నీ తానై పోషించాడు.. ఏం ఉన్నా కూడా నాన్నతోనే చెప్పుకునే వాడిని.. అలాంటి నాన్న కూడా ఇప్పుడు లేడు అంటూ ప్రవీణ్ ఏడ్చేశాడు. రోజూ రాత్రి.. నాన్నా తిన్నావారా? అని నన్ను అడిగితే గానీ నిద్రపోయే వాడు కాదు అంటూ తండ్రిని తల్చుకుంటూ ప్రవీణ్ కన్నీరుమున్నీరయ్యాడు. ఇక ప్రవీణ్‌ను ఓదార్చేందుకు ఇంద్రజ వచ్చింది. ఇంద్రజ వచ్చి ఓదార్చుతూ.. నీకు మేమంతా ఉన్నామని హత్తుకుని భరోసా ఇచ్చింది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp