Jabardasth Raghava : జబర్దస్త్ రాఘవ పరువుపాయే.. సొంత కొడుకే అలాంటి కామెంట్లు

Authored By Cinema Desk | The Telugu News | Published on: September 26, 2021, 2:10 pm

Jabardasth Raghava : జబర్దస్త్ షోలో రాఘవ గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. జబర్దస్త్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రాఘవ ఉన్నాడు. ఇక ముందు కూడా ఉంటాడు. అందరికంటే సీనియర్ అతనే. అయితే ఈ మధ్యన రాఘవ తన కొడుకు మురారిని కూడా ఎంట్రీ ఇప్పించాడు. జబర్దస్త్ స్టేజ్ మీద మురారి ఈ మధ్య హల్చల్ చేస్తున్నాడు. ఒకప్పుడు దీవెన, నేహాంత్ వంటి వారుండే వారు. కానీ ఇప్పుడు మాత్రం ఫోకస్ అంతా కూడా మురారి మీదే పడింది. ఎవ్వరికీ చాన్స్ ఇవ్వకుండా మురారి అందరి మీద పంచ్‌లు వేసేస్తున్నాడు.

Jabardasth Raghava Son Murari In Hyper Aadi Skit

Jabardasth Raghava Son Murari In Hyper Aadi Skit

మొన్నటికి మొన్న ఆది టీంలో మురారి వేసిన పంచ్‌లకు అందరూ ఫిదా అయ్యారు. ఆ స్కిట్‌లో రాఘవ కూడా ఓ క్యారెక్టర్ వేశాడు. ఇక తన తండ్రి మీదే దారుణమైన కామెంట్లు వేశాడు. డాన్ గెటప్‌లో పిల్లి బొమ్మను పట్టుకొచ్చిన రాఘవను దారుణంగా ఏకిపారేశాడు. ప్రాణాలు తోడేస్తా అని రాఘవ భయపెట్టే ప్రయత్నం చేశాడు.. ఇక్కడేమో ఇలా ప్రాణాలు తోడేస్తా అంటాడు.. ఇంటికెళ్తే పాలల్లో తోడేస్తాడు. పిల్లిని ఇక్కడ నిమురుతున్నాడు.. ఇంట్లోకి వెళ్తే ఆయన పరిస్థితి కూడా అదే అని కౌంటర్లు వేశాడు.

Jabardasth Raghava Son Murari In Hyper Aadi Skit

Jabardasth Raghava Son Murari In Hyper Aadi Skit

Jabardasth Raghava : రాఘవపై మురారి పంచులు..

ఇంచు అంత ఉన్నావ్.. జబర్దస్త్‌లో ఇంకెన్నాళ్లు ఉంటావ్.. కొత్త వాళ్లకు చాన్స్ ఇవ్వవా? ఇలా వరుసగా పంచులు మీద పంచులు వేశాడు. అనసూయ ముద్దు పెడితే కూడా కౌంటర్ వేశాడు.

Jabardasth Raghava Son Murari In Hyper Aadi Skit

Jabardasth Raghava Son Murari In Hyper Aadi Skit

చివరకు చందమామ అంటూ రోజాను పొగిడినట్టే పొగిడి కౌంటర్ వేశాడు. ఆది, రాఘవ, దొరబాబు, శాంతి, రైజింగ్ రాజు ఇలా ఏ ఒక్కరినీ వదిలిపెట్టలేదు. మొదటిసారిగా ఆది టీంలో ఆది కాకుండు ఓ బుడ్డోడు ఇలా చెలరేగడం. మొత్తానికి మురారి టైమింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు.

Cinema Desk

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp