Intinti Gruhalakshmi 27 Sep Tomorrow Episode Highlights : పెళ్లిచూపులకు వచ్చిన జీకే, అక్షర.. వాళ్ల ముందే ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ప్రేమ్ చెబుతాడా? శృతినే పెళ్లి చేసుకుంటా అంటాడా?
Intinti Gruhalakshmi 27 Sep Tomorrow Episode Highlights : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఆదివారం ప్రసారం కాదు. సోమవారం నుంచి శనివారం వరకు మాత్రమే ప్రసారం అవుతుంది. 27 సెప్టెంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
నందు.. వెంటనే పరిగెత్తుకెళ్లి ప్రేమ్ దగ్గరికి వెళ్లాడు. ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదు. దివ్య.. నువ్వయినా చెప్పు. ప్రేమ్, దివ్య.. ఇద్దరూ తర్వాత ముచ్చట్లు పెట్టుకోవచ్చు కానీ.. ముందు వెళ్లి రెడీ అవ్వండి అని చెబుతాడు. వంటింట్లో తులసి బాధపడుతూ ఉంటుంది. అసలు.. ఏం అనుకుంటే ఏం జరుగుతోంది.. అని అనుకుంటుంది. సొంత వాళ్లే మనసు తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నారు… అని నందుతో అంటుంది. మీరు ప్రేమ్ భవిష్యత్తు కోసం ఈ పని చేస్తున్నారో.. లేక ఇంకేం ఆశించి చేస్తున్నారు అనే విషయం నేను అర్థం చేసుకోగలను.. అని నందుకు వార్నింగ్ ఇస్తుంది తులసి. దీంతో నందు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
కట్ చేస్తే.. అంకిత ఫోన్ లో మాట్లాడుతుంటుంది. లాస్య వచ్చి.. ఏంటి అంకిత త్వరగా రెడీ అవ్వు. పెళ్లివాళ్లు వచ్చే సమయం అయింది. అని చెబుతుంది. సరే.. ఆంటి అంటుంది. ఇంతకీ అభి ఎక్కడ.. అని అడుగుతుంది లాస్య. కూల్ డ్రింక్స్ కోసం వెళ్లాడు అని చెబుతుంది. ఇంతలో నందు వచ్చి నేను చెప్పి నెల అవుతోంది. ఇప్పటి వరకు రాలేదా.. ఏం చేస్తున్నాడు అని అంటాడు నందు. నువ్వేం టెన్షన్ పడకు నందు.. నేను ఉన్నాను కదా.. నేను అన్నీ చూసుకుంటాను అని చెబుతుంది లాస్య.
ఏంటమ్మా.. ఈ హడావుడి.. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదంటూ తులసికి చెబుతుంది రాములమ్మ. ఇంతలో శృతి అక్కడికి వచ్చి ఆంటీ.. నేను కూరగాయలు తరుగుతాను.. అని చెబుతుంది. వద్దులే అమ్మా.. నేను చూసుకుంటానులే.. నువ్వు ఏ పనీ ఇప్పుడు సరిగ్గా చేయడం లేదు. నువ్వు తీసుకునే నిర్ణయం సరిగ్గా లేదు. ఏదో ఒత్తిడికి గురవుతున్నావు.. అందుకే నువ్వు ఏ సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నావు.. అని తులసి అనగానే నన్ను కావాలని దూరం పెడుతున్నారా.. అని అడుగుతుంది శృతి.
Intinti Gruhalakshmi 27 Sep Tomorrow Episode Highlights : బాగా ఆలోచించి ఇప్పటికైనా నిర్ణయం తీసుకొమ్మని శృతికి చెప్పిన తులసి
నాకు తెలుసు ఆంటి.. నేను తీసుకున్న నిర్ణయం మిమ్మల్ని బాధపెట్టి ఉండొచ్చు కానీ.. నేను మాత్రం ఏం చేయలేను. ఈ సమయంలో నేను తీసుకున్నదే సరైన నిర్ణయం అని అనుకుంటున్నా.. అని చెబుతుంది శృతి. నేను అందరినీ కోల్పోయి అనాథను అయిపోయాను. మీరు చేరదీయడం వల్ల నేను అనాథను అనే ఫీలింగ్ నాకు పోయింది. కానీ.. మీరు మళ్లీ నన్ను దూరం పెడితే నేను బతకలేను.. అని అంటుంది శృతి.
లాస్య.. డైమండ్ నెక్లెస్ ను భాగ్యకు చూపిస్తుంది. బాగుంది నెక్లెస్ అంటుంది. ఎప్పుడు తీసుకున్నవు అంటిం. ఇది నాకోసం కాదు లాస్య.. అక్షర కోసం అంటుంది. జీకేతో మనకు భవిష్యత్తులో చాలా పని ఉంది. అందుకే.. ఇప్పుడు మనం సరిగ్గా ప్రవర్తించాలి. వాళ్లను ఆకట్టుకోవాలి.. అని భాగ్యకు చెబుతుంది.
తులసి.. మాధవికి ఫోన్ చేసి.. వస్తున్నారా.. అని అడుగుతుంది. ఎక్కడికి వచ్చేది. నేను రాను.. ప్రేమ్ కు ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిసి కూడా ఇలా చేస్తున్నారేంటి వదిన అని అంటుంది మాధవి. ప్రేమ్ కు నచ్చకున్నా.. నువ్వు ఈ పెళ్లికి అంగీకరిస్తున్నావా.. అని అడుగుతుంది.
కట్ చేస్తే.. అంకిత.. శృతి దగ్గరికి వెళ్తుంది. అత్యాశకు పోతే.. ఇలాగే అడ్రస్ లేకుండా మిగిలిపోవాల్సి ఉంటుంది.. అని శృతితో అంటుంది. నేనెక్కడ అత్యాశకు పోయాను అంకిత అని అడుగుతుంది. ప్రేమ్ ను పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో సెటిల్ అవ్వాలని అనుకున్నావు కదా.. ఒకప్పుడు నువ్వు, ప్రేమ్ గాఢంగా ప్రేమించుకున్నారు కదా. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు కదా. ఇక నీ పీడ విరగడ కాబోతుంది. ఇదిగో ఇలా మాడిపోయిన మొహం వేసుకొని నువ్వు రోజూ నాకు కనబడితే నాకు ఎంత చిరాకుగా ఉంటుందో తెలుసా.. అలాంటిది నిన్ను తోటికోడలుగా నేను ఎలా అంగీకరిస్తా అని అనుకున్నావు.. అంటూ శృతికి చెబుతుంది అంకిత.
నా స్థాయి.. నా స్థానం రెండూ నాకు తెలుసు. నేను ఏనాడూ హద్దులు దాటి ముందుకు వెళ్లలేదు.. అని చెబుతుంది. ఇంతలో పెళ్లి వాళ్లు వస్తాడు. తులసి ఆంటీ అంటే మీరే కదా.. నన్ను ఆశీర్వదించండి అంటీ.. అని తులసి కాళ్ల మీద పడుతుంది అక్షర.
అందరూ లోపలికి వెళ్లాక.. ఈయన జీకే గారు నీకు కాబోయే మామ గారు.. అని నందు.. ప్రేమ్ కు పరిచయం చేస్తాడు. ఎలాగూ ఒకరికి మరొకరు నచ్చారు కాబట్టి వెంటనే ముహూర్తాలు పెట్టేసుకుంటే మంచిది అనిపిస్తుంది అని నందు.. జీకేతో చెబుతాడు. దీంతో ప్రేమ్, తులసి షాక్ అవుతారు. మరి.. ప్రేమ్, అక్షర పెళ్లికి వెంటనే ముహూర్తం పెట్టేస్తారా? లేక ప్రేమ్ ఈ పెళ్లిని వద్దంటాడా? శృతి మధ్యలో వచ్చి.. ఏమన్నా అంటుందా? అనే విషయం తెలియాలంటే.. తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.