Jabardasth Rakesh : లాగి పెట్టి కొట్టిన రాకేష్.. పగ తీర్చుకున్న రోహిణి
Jabardasth Rakesh జబర్దస్త్ షోలో ఈ మధ్య రోహిణి, రాకేష్ బంధం గట్టిగానే బలపడుతోంది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ బాగానే కుదిరింది. అయితే ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పుకొచ్చారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరం సాయం చేసుకుంటామని తమ బంధంలోని స్వచ్చతను చెప్పుకొచ్చారు. అలా రాకేష్, రోహిణి ట్రాక్ జబర్దస్త్ షోలో బాగానే వర్కవుట్ అయంది.
లాగి పెట్టి కొట్టిన రాకేష్.. పగ తీర్చుకున్న రోహిణి Jabardasth Rakesh
ఆ మధ్య ఓ స్కిట్‌లో రోహిణి బుగ్గ మీద రాకేష్ ముద్దు పెట్టినట్టు చేసేశాడు. ఆమె బుగ్గకు రాకేష్ తన బుగ్గను ఆనించాడు. లైటుగా ముద్దుకూడా పెట్టేశాడు. అది నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. అయతే దీనిపై రోహిణి స్పందించింది. అది కూడా ముద్దేనా? దాన్ని ముద్దు అంటారా? అని తన ముద్దుల పురాణం గురించి రోహిణి చిట్టా విప్పేసింది.
అయితే తాజాగా వేసిన స్కిట్లో ఒకరిని ఒకరు బాగానే వాయించుకున్నారు. మాట్లాడుతూ మాట్లాడుతూ రోహిణి చెంపచెల్లుమనిపించాడు రాకేష్. ఆఫీస్‌లో బాస్‌గా చెలరేగిపోయిన రాకేష్‌ను ఇంటికి వచ్చిన తరువాత భర్త స్థానంలో పెట్టి భార్యగా రోహిణి ఆడుకుంది. మొత్తానికి ఇలా ఈ ఇద్దరూ ఆన్ స్క్రీన్ మీద భార్యాభర్తలు జోడికట్టి బాగానే క్లిక్ అయ్యారు.