Jabardasth : జ‌బ‌ర్ధ‌స్త్‌లో మ‌ళ్లీ ప‌చ్చి బూతులు.. ఇంత చెండాల‌మా?

Authored By Sam C | The Telugu News | Published on: August 9, 2022, 7:20 pm

Jabardasth : బుల్లితెర పాపుల‌ర్ కార్య‌క్ర‌మం జ‌బ‌ర్ధ‌స్త్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఒక‌ప్పుడు టాప్ కామెడీ షోగా గుర్తింపు తెచ్చుకున్న జబర్ధస్త్ రేటింగ్ కొంతకాలంగా తగ్గుముఖం పడుతోందనే టాక్ వినిపిస్తోంది. సుధీర్, గెటప్ శ్రీను వంటి వాళ్లు షో నుంచి వెళ్లిపోవడం.. షోలో హైపర్ ఆది స్కిట్ లేకపోవడం వంటివి ఇందుకు పలు కారణాలుగా చెప్పుకోవచ్చు. రోజా జబర్ధస్త్ నుంచి వెళ్లిపోయిన తరువాతే అనేక రకమైన పరిణామాలు చోటు చేసుకోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి జబర్ధస్త్‌ షో మొదలైనప్పటి నుంచి రోజా ఆ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ జబర్ధస్త్‌ షోలో కంటిన్యూ అవుతూ వచ్చారు. మంత్రి ప‌దవి త‌ర్వాత ఆమె పూర్తిగా త‌ప్పుకున్నారు.

Jabardasth : ఘోర‌మైన పంచ్‌లు..

జ‌బ‌ర్ధ‌స్త్ ఇప్పుడు అంతా కొత్త వాళ్ల‌తో నడుస్తుంది. కొత్త యాంకర్ తో..కొత్త జడ్జీలతో షో కి కొత్త కళ్ళ వచ్చింది. మరి ఇన్ని కొత్తగా వచ్చిన్నప్పుడు..కొత్త పంచ్లు కూడా రావాలిగా..అలానే అనుకుని టీం మెంబర్స్..ఘాటు డైలాగ్లు వాడుతున్నారు. ఈ క్రమంలోనే..షోకి ఎలాగైనా ఆదరణ తెచ్చే క్రమంలో టీం లీడర్స్ మరలా డబుల్ మీనింగ్ కామెడీని పండించడానికి చూస్తున్నారు. ఆగస్టు 11న ప్రసారం కావాల్సిన జబర్దస్త్ ప్రోమోని తాజాగా విడుదల చేసారు. ఈ స్కిట్ లో తాగుబోతు రమేష్ కామెడీ టైమింగ్ కొంచెం హద్దులు దాటేసిన్నట్లు అనిపించింది.

jabardasth show with double meaning dialogues

jabardasth show with double meaning dialogues

స్కిట్ లో భాగంగా రమేష్… తన భార్యతో హనీమూన్ కి వెళ్ళాలి అనుకుంటాడు. భార్య డ్రీమ్స్‌లోకి వెళుతుంది. అప్పుడే హనీ మూన్ లో ఏం చేస్తారు అని అడగ్గా..మూన్ చూస్తూ, హనీ ని నాకుతాం అని అన్నాడు. లేడీ కమెడియన్ నాకడానికి అంత దూరం వెళ్లాలా..అంటూ పచ్చి వల్గర్ పదాలను పంచ్ గా వేసింది.దీని వెన‌క ఉన్న మీనింగ్ అంద‌రికి తెలిసిన కూడా కొంద‌రు స‌మ‌ర్దించుకుంటూ వ‌స్తున్నారు. జ‌డ్జిలు న‌వ్వ‌డం ఇక అంద‌రికి కోపాన్ని తెప్పిస్తుంది. ఇలాంటివి ఎంక‌రేజ్ చేస్తే ఫ్యామిలీ ఆడియ‌న్స్ ఎలా చూస్తారంటూ ప‌లువురు వాపోతున్నారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp