pushpa Keshava : పుష్పలో అల్లు అర్జున్ ఫ్రెండ్ కేశవ బ్యాక్ గ్రౌండ్ తెలుసా… ఎగతాళి చేసేవారంటూ ఏమోషనలైన వరంగల్ కుర్రాడు..!
pushpa Keshava : ఎంత టాలెంట్ ఉన్నా సరైన అవకాశం రాకపోతే అనవసరమే. ఇండస్ట్రీకి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు.. అవకాశాలు దక్కించుకుని సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైన అతి తక్కువ మందే కొద్ది కాలం వెలుగుతారు. అయితే టాలెంట్ ఉన్న ఎంతో మందికి ఆ ఒక్క అవకాశం కూడా రావడం కష్టమే. అలా ఎన్నో యేళ్లు ఎదురు చూసి ఒక్క అవకాశం తో తనేంటో రుజువు చేసుకుని స్టార్ గా ఎదిగిన వారు ఎంతో మంది. ఇప్పుడు అదే కోవలోకి వెళ్తున్నాడు పుష్ప సినిమాలో బన్నీ స్నేహితుడు కేశవ క్యారెక్టర్ లో నటించిన జగదీష్.పుష్ప సినిమా అంతా అల్లు అర్జున్ పక్కనే కనిపించిన కేశవ పాత్రకు ఇప్పుడు మంచి గుర్తింపు వస్తోంది.
బన్నీ ఫ్రెండ్‌గా సినిమా మొత్తం కనిపించిన కేశవ తన స్టైల్లో కామెడీని పండించాడు. సినిమాలో కాస్త వినోదం ఉందంటే అది ఈయన పాత్ర చుట్టే. ప్రస్తుతం ఇయనకు సినిమా అవకాశాలు భారీగా వస్తున్నాయని సమాచారం అందుతోంది. అయితే ఇది రాత్రికే రాత్రే వచ్చింది కాదని.. దీని వెనక తన నాలుగేళ్ల కఠోర శ్రమ ఉన్నట్టు ఈ వరంగల్ కుర్రాడు చెబుతున్నాడు.నాలుగేళ్ల క్రితం ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యానని జగదీష్ ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మల్లేశం, పలాస వంటి సినిమాల్లో నటించినా సరైన గుర్తింపు మాత్రం రాలేదన్నారు.

jagadish who acted as friend in alluarjun pushpa movie reveals his background
pushpa Keshava : నాలుగేళ్ల కష్టం.. ఎగతాళి చేసేవారు.. ఎవరికీ చెప్పలేదు..!
అప్పుడే పుష్ప మూవీలో బన్నీ పక్కన నటించే ఛాన్స్ వచ్చినట్లు తెలిపారు. అయితే ఆ విషయం స్నేహితులతో పాటు ఊర్లో ఎవ్వరికీ చెప్పలేదన్నారు. గతంలో తనను అందరూ ఎగతాళిలా చూసేవారంటూ.. పుష్ప సినిమా విడుదలైన అనంతరం అందరూ తమ వాడని గొప్పగా చెప్పుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఊర్లో తన అసలు పేరు గోపీ అని తెలిపారు. పుష్ప సినిమాతో జగదీష్ కెరీర్ మలుపు తిరిగింది. సినిమా అంతా అల్లు అర్జున్ పక్కనే ఉంటూ లెంగ్తీ రోల్‌లో అదరగొట్టేశాడు. అలా కేశవ జగదీష్ కాస్త పుష్ప జగదీష్ అయిపోయాడు. కేవలం కామెడీతోనే కాక ఎమోషనల్ గాను నటించి మెప్పించాడు.