Janaki Kalaganaledu : మల్లికకు జానకి వార్నింగ్.. అఖిల్ మోసాన్ని జెస్సీ తెలుసుకుంటుందా? జ్ఞానాంబ జెస్సీని క్షమిస్తుందా?

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 3 అక్టోబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 401 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ దొంగవు నువ్వేనా అని రామాను పట్టుకుంటుంది జానకి. దీంతో రామా షాక్ అవుతాడు. మీకు ఫిజికల్ వ్యాయామం చేయించడం కోసమే ఇలా చేయించా అంటాడు రామా. ఇంతలో తనకు కాలు పట్టుకున్నట్టు నటిస్తుంది జానకి. దీంతో తనను మోసుకెళ్తాడు. ఆ తర్వాత ఒకచోట కూర్చోబెట్టి తన కాలు ఎక్కడ బెనికిందో చూస్తాడు రామా. దీంతో జానకి నవ్వుతుంది. నువ్వు నవ్వుతున్నావా అని రామాకు కోపం వస్తుంది. దీంతో మీరు నన్ను ఆటపట్టించాలని చూస్తే నేను మిమ్మల్ని ఆటపట్టించా అంటుంది జానకి.

janaki gives warning to mallika in janaki kalaganaledu

మరోవైపు రేపు పరీక్ష పెట్టుకొని జానకి చదువుకోకుండా ఇంట్లో పనులు చేస్తుండటం చూసి రామా షాక్ అవుతాడు. ఇవన్నీ మేము చూసుకుంటాం. మీరు వెళ్లి చదువుకోండి అంటాడు రామా. అప్పుడే అక్కడికి వచ్చిన జ్ఞానాంబ కూడా అదే అంటుంది. ఈ ఇంట్లో పని చేయాల్సిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అయినా నువ్వు పని చేయాల్సిన అవసరం ఏం లేదు. ఖాళీగా చాలామంది ఉన్నారు. చికిత, మల్లిక తప్పితే ఇంకెవరూ లేరా అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో జెస్సీకి ఇంకా పనుల గురించి తెలియదు. తనకు ఏ వస్తువులు ఎక్కడున్నాయో అర్థం కాదు అంటుంది. దీంతో జానకి అక్క నన్ను చాలా సపోర్ట్ చేస్తుంది. నేను తొందరగా పనులు నేర్చుకుంటా అని అనుకుంటుంది జెస్సీ.

ముందు నువ్వు వెళ్లి చదువుకో అని జ్ఞానాంబ చెప్పి రామాతో జానకిని లోపలికి తీసుకెళ్లమంటుంది జ్ఞానాంబ. మరోవైపు ఎలాగైనా జ్ఞానాంబకు మస్కా కొట్టి తనను ప్రేమగా చూసుకునేలా చేయాలని ప్లాన్ వేస్తాడు అఖిల్. నా ప్లాన్ వర్కవుట్ అవ్వాలంటే అమాయకపు అన్నయ్యను వాడుకోవడమే కరెక్ట్ అని అనుకుంటాడు అఖిల్.

Janaki Kalaganaledu : జ్ఞానాంబను నమ్మించే ప్రయత్నం చేసిన అఖిల్

రామా వెళ్లడం చూసి ఏడుస్తున్నట్టు నటిస్తాడు. ఇంతలో రామా వచ్చి అఖిల్ ఏంట్రా.. ఒంటరిగా ఇక్కడ నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అని అడుగుతాడు రామా. ఇంతలో జానకి కూడా వస్తుంది.

అమ్మ నన్ను దోషిని చేసి మాట్లాడుతోంది. ఇంట్లో మిగితా వాళ్లు కూడా నన్ను దోషిగా చూస్తున్నారు. నాకు ప్రాణం పోయినంత పని అవుతోంది అంటాడు అఖిల్. దీంతో బాధపడకు. నీకు మేమున్నాం. అమ్మ కూడా త్వరలోనే అర్థం చేసుకుంటుంది. నీతో మాట్లాడుతుంది అంటాడు.

అసలు నేను జెస్సీని ప్రేమించే వాడినే కాదు. మీ ప్రేమ నాకు దూరం అయింది. నా మనసులోకి అటువంటి ఆలోచనే రానిచ్చే వాడిని కాదు అంటాడు అఖిల్. తన తల్లిదండ్రులను వదులుకొని జెస్సీ వచ్చింది. అన్నీ సర్దుకుంటాయి. నువ్వు బాధపడకు అఖిల్ అంటుంది జానకి.

ఇప్పుడు నీకంటూ ఒక బాధ్యత ఉంది. జెస్సీని బాగా చూసుకోవాలి. తనకు నువ్వు తోడున్నావన్న ధైర్యాన్ని కల్పించాలి. నీ భవిష్యత్తుకు ఒక దారి చూపించాలి అంటుంది జానకి. బుజ్జగించడానికి వాడేం చిన్నపిల్లాడు కాదు అని జ్ఞానాంబ అక్కడికొచ్చి అంటుంది.

వాడు చాలా ఎదిగిపోయాడు. సొంత నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాడు అంటుంది జ్ఞానాంబ. మీరు మీ పనులు మానుకొని వాడిని ఓదార్చాల్సిన అవసరం లేదు అంటుంది జ్ఞానాంబ. కొట్టుకు ఆలస్యం అవుతోంది వెళ్లు అంటుంది జ్ఞానాంబ.

అన్నయ్య, వదినను ఒప్పించినంత తేలికగా అమ్మను ఒప్పించలేను అని అనుకుంటాడు అఖిల్. మరోవైపు ఎలాగైనా పని విషయంలో జెస్సీని పోలేరమ్మ ముందు బుక్ చేయాలని అనుకుంటుంది మల్లిక.

దీంతో జానకి గురించి చెడుగా చెబుతుంది మల్లిక. నీ మంచి కోరే చెబుతున్నాను. నేను చెప్పినట్టు చేయి. నువ్వు జానకిని నమ్ముకుంటే అత్తయ్య గారి దృష్టిలో ఎప్పుడూ అలాగే ఉంటావు.

నీకు నువ్వుగా అత్తయ్య గారెతో మాటలు కలుపు. తను అడిగినా వద్దనా కాఫీ పెట్టి ఇవ్వు. భోజనం పెట్టు. వెంటపడి చేస్తే కొన్నాళ్లకు అత్తయ్య గారు నిన్ను చేరదీస్తారు అంటుంది మల్లిక. ఇవన్నీ విన్న జానకి.. బుద్ధి ఉందా అని ప్రశ్నిస్తుంది.

నువ్వు ఒక కోడలువు అన్న విషయాన్ని మరిచిపోకు అంటుంది జానకి. అనవసరం అయినవి నూరిపోసి దాన్ని పెంచి పెద్దచేయకూడదు అంటుంది. తను మన తోటి కోడలు. కొత్తగా మన ఇంట్లోకి అడుగుపెట్టింది.

అత్తయ్య గారికి జెస్సీని దూరం చేసే ప్రయత్నం చేయకు. నీ పద్ధతి మార్చుకోకుండా ఇలాగే ఉంటాను అంటే.. నేను పెద్ద కోడలుగా, బాధ్యతగా వేరే విధంగా నీ మీద రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అది నీకు మంచిది కాదు అంటుంది జానకి.

ఆ తర్వాత జానకి రూమ్ లో కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. రామా కొట్టులో ఉంటాడు. ఇంతలో జానకితో మాట్లాడాలనిపిస్తుంది రామాకు. జానకి ఏం చేస్తున్నారో అని వీడియో కాల్ చేస్తాడు రామా.

ఏం చేస్తున్నారు అని అడుగుతాడు రామా. దీంతో చదువుకుంటున్నాను అంటుంది జానకి. ఇద్దరూ కాసేపు వీడియో కాల్ లో మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

42 minutes ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

2 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

4 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

5 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

6 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

7 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

8 hours ago

Rains | రానున్న మూడు రోజుల‌లో భారీ వ‌ర్షాలు.. ఆ జిల్లాల‌కి బిగ్ అలర్ట్‌

Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌…

9 hours ago