janaki is in danger how rama will save janaki from danger
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇవాళ ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 28 ఫిబ్రవరి 2022, ఎపిసోడ్ 246 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వెన్నెల పెళ్లి సంబంధాన్ని ఎలాగోలా కష్టపడి సెట్ చేస్తుంది జానకి. దిలీప్ తల్లిని వాళ్ల ప్రేమ వ్యవహారం జ్ఞానాంబకు చెప్పకుండా ఒప్పిస్తుంది జానకి. ఆ తర్వాత వెన్నెల, దిలీప్ పెళ్లికి జ్ఞానాంబ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. మావారు ఊరికి వెళ్లారు. ఆయన వచ్చాక మిగితా విషయాలు మాట్లాడుకొని ముహూర్తం పెట్టిద్దాం అంటుంది జ్ఞానాంబ. తర్వాత అందరూ బయలుదేరుతారు. ఇంతలో మల్లిక ఫోన్ మరిచిపోతుంది. మరోవైపు వెన్నెలకు ఫోన్ చేసి అంతా సెట్ అయిందని.. మీ జానకి వదిన వల్లనే ఇది సాధ్యం అయిందని చెబుతాడు దిలీప్. ఆ విషయాలను మల్లిక వింటుంది. అనుమానంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
janaki is in danger how rama will save janaki from danger
ఈ పెళ్లి చూపుల స్కీమ్ వెనుక పెద్ద స్కామ్ ఉంది. జానకి ఏదో మంతనాలు జరుపుతోంది. అదేంటో తెలుసుకుంటా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మల్లిక. తర్వాత అందరూ ఇంటికి తిరిగి వస్తారు. తిరిగి వచ్చాక.. జ్ఞానాంబ మగ పెళ్లి వాళ్ల గురించి చెబుతుంది. వాళ్లు బాగానే రిసీవ్ చేసుకున్నారని అంటుంది. ఒక ఆడపిల్ల తల్లిగా నాకు ఎన్నో అనుమానాలు ఉండేవి కానీ.. వాళ్లను చూశాక.. నా కూతురు అక్కడ చాలా సంతోషంగా ఉంటుంది అనిపించింది అని జానకి, రామాతో అంటుంది జ్ఞానాంబ. మన కుటుంబానికి తగ్గట్టుగా ఉన్నారు. మీ నాన్న రాగానే ఒకసారి వాళ్లతో మాట్లాడించి ముహూర్తాలు పెట్టిద్దాం అంటుంది జ్ఞానాంబ. దీంతో అలాగేనమ్మా అంటాడు రామా.
కానీ.. ఈ మల్లిక.. వెన్నెల పెళ్లి సంబంధాన్ని పెటాకులు చేయబోతోంది. మా తమ్ముడికి ఇచ్చి వెన్నెలకు పెళ్లి చేయబోతున్నా.. అని మనసులో అనుకుంటుంది మల్లిక. వెంటనే వెన్నెలను పిలుస్తుంది జ్ఞానాంబ. మీ వదిన ఒక ఆలోచన చేసిందంటే మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉండదు.. అంటుంది జ్ఞానాంబ.
నా భయాలన్నీ పోయాయి. మీ వదిన నీకు చాలా అద్భుతమైన సంబంధం చూసింది అని అంటుంది జ్ఞానాంబ. అత్తారింట్లో నువ్వు చాలా సంతోషంగా ఉంటావు అనే నమ్మకం నాకు వచ్చింది అంటుంది జ్ఞానాంబ. నువ్వు మన కుటుంబం గురించి… వాళ్ల సంతోషం గురించి ఆలోచిస్తావని మరోసారి ఆలోచించావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ.
వెన్నెల, దిలీప్ పెళ్లికి లైన్ క్లియర్ చేసినందుకు.. రామా తనకు ఇష్టమైన ఓ పని చేస్తాడు. ఓ లెటర్ తీసుకొచ్చి చూపిస్తాడు. ఏంటిది అంటుంది జానకి. మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంట్లో కష్టపడి పనిచేస్తున్నారు. దీంతో మీకు ఐపీఎస్ చదవడానికి సమయం దొరకడం లేదు కదా. అందుకే నైట్ కోచింగ్ కోసం నేను దరఖాస్తు పెట్టాను అంటాడు రామా.
అదంతా ఓకే కానీ.. మరి అత్తయ్యకు ఏం సమాధానం చెబుతాం అని అంటుంది జానకి. దీంతో అమ్మకు ఏదో ఒకటి చెప్పి నేను మేనేజ్ చేస్తా లేండి.. అంటాడు రామా. దీంతో జానకి కూడా ఖుషీ అవుతుంది. మరోవైపు జ్ఞానాంబ పుట్టిన రోజు కోసం కేకుల ఆర్డర్ ను తీసుకుంటుంది.
జానకిని పిలిచి పుట్టిన రోజు కేకులు తయారు చేయాలని చెబుతుంది. దీంతో జానకి షాక్ అవుతుంది. మరోవైపు రాజమండ్రిలో కోచింగ్ కు వెళ్లి ఆటోలో ఒంటరిగా తిరిగి వస్తుంటుంది జానకి. ఆటో వాడు నిర్మానుష్య ప్రదేశంలోకి ఆటోను తీసుకెళ్లి ఒంటి మీద ఉన్న నగలు, డబ్బు మొత్తం ఇచ్చి నడుచుకుంటూ వెళ్లాలని చెబుతాడు.
దీంతో జానకికి కోపం వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.