Janaki Kalaganaledu 1 Sep Today Episode : జానకి సివిల్స్ పుస్తకాలను చూసిన మల్లిక.. జ్ఞానాంబకు చెప్పేస్తుంది? ఈ విషయం తెలుసుకున్న జ్ఞానాంబ ఏం చేస్తుంది?

Janaki Kalaganaledu 1 september 2021 full episode 118 highlights
Janaki Kalaganaledu 1 Sep Today Episode : జానకి కలగనలేదు సీరియల్ తాజాగా 1 సెప్టెంబర్ 2021 ఎపిసోడ్ విడుదలైంది. లేటెస్ట్ ఎపిసోడ్ 118 హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తన అన్నయ్యకు రాఖీ పంపించి.. ఆయన కట్టుకునేలా చేసి.. వీడియో కాల్ చేసి కూడా జానకితో మాట్లాడిస్తాడు రామా. దీంతో జానకి ఫుల్ ఖుషీ అవుతుంది. ముద్దు పెడుతుంది. పెళ్లి పేరుతో చెల్లలి పీడ వదిలించుకోవాలని చూడటం, తను చదువుకోకుండా ఉండటం.. ఇవన్నీ లోపల పెట్టుకొని మీరు విడిపోవడం కరెక్ట్ కాదు. మీరిద్దరూ సంతోషంగా ఉండాలి. మీలో ఉన్నటువంటి కోపాలను పక్కన పెట్టాలి.. అని రామా చెబుతాడు.

Janaki Kalaganaledu 1 september 2021 full episode 118 highlights
మా అన్నయ్య నా విషయంలో స్వార్థంగా ఆలోచించి తప్పు చేసినా.. దేవుడి లాంటి భర్త వచ్చేలా చేశాడు నాకు. అందుకే మా అన్నయ్య మీద నాకు కోపం పోయింది.. అని చెబుతుంది జానకి. ఈ విషయంలో మీ అన్నయ్యకు నేను కూడా రుణపడి ఉంటాను.. అని చెబుతాడు రామా.

Janaki Kalaganaledu 1 september 2021 full episode 118 highlights
జానకి గారు.. మీ సంతోషాన్ని చూసి నేను కూడా చాలా సంతోషంగా ఉన్నానండీ.. మరి.. మరి.. అంటూ చెంప చూపిస్తాడు. దీంతో మరి ఏంటి.. మీరు కనపడరు కానీ.. భలే తమాషాలు చేస్తారు.. అంటుంది జానకి. ముద్దు లేదా అండి.. అంటాడు. దీంతో వద్దు లేండి.. పదండి అంటాడు. ఏమండోయ్ కొట్టు మూసేయండి.. అంటుంది జానకి. దీంతో కొట్టు మూసి అక్కడి నుంచి బయలుదేరుతారు.

Janaki Kalaganaledu 1 september 2021 full episode 118 highlights
Janaki Kalaganaledu 1 Sep Today Episode : వీడియో రికార్డింగ్ చేసి పోలీసులకు పంపించాలనుకున్న మల్లిక
కట్ చేస్తే.. మల్లిక తెగ రెడీ అవుతుంది. వీడియో రికార్డు చేసి.. ఆత్రేయపురం ఎస్సై గారు.. నా పేరు మల్లిక అండీ.. నేను చాలా అమాయకురాలిని అండి. కానీ.. నా అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని మా అత్తయ్య గారు జ్ఞానాంబ నన్ను టార్చర్ పెడుతున్నారండి. మీరు తనను అరెస్ట్ చేయండి. లేకపోతే నేను బతకలేను. నేను ఇలా వీడియో పంపించానని మా అత్తయ్య గారితో చెప్పకండి. ఈ కోపాన్ని కడుపులో పెట్టుకొని నన్ను ఇంకా టార్చర్ పెడుతుందండి. నన్ను బతికించండి.. అని అనగానే.. వెంటనే విష్ణు వచ్చి.. నమస్కారం అండీ.. ఎస్సై గారు.. నేను దీని మొగుడిని.. దీని ఒంటి మీద కేజి కండ లేదు కానీ.. ఒంట్లో బోలెడు కుట్రలు ఉన్నాయి. నన్ను రోజూ కొడుతుందండి. సార్.. వేరే కాపురం వెళ్దాం.. అంటూ నన్ను కాల్చుకు తింటుందండి. ఎస్సై గారు.. మీకు దండం పెడతాను.. దీన్ని అరెస్ట్ చేసి ఈ అమాయకపు భర్తను కాపాడండి సార్. లేదంటే.. ఉన్న ఈ జుట్టు కూడా పోతుందని నాకు భయంగా ఉందండి.. అంటాడు విష్ణు.

Janaki Kalaganaledu 1 september 2021 full episode 118 highlights
ఏమండి.. బుద్ధుందా మీకు. నేను ముఖ్యమైన వీడియో రికార్డు చేస్తుంటే.. వచ్చి అంతా గబ్బుగబ్బు చేస్తారా? అని ప్రశ్నిస్తుంది మల్లిక. కామెడీ వీడియోలు చేస్తున్నావేమో అని వచ్చి నేను కూడా పర్ఫార్మెన్స్ చేశా.. అంటే లేదు నేను పోలీసులకు పంపించడం కోసం వీడియో చేస్తున్నాను.. అంటే విష్ణు షాక్ అవుతాడు.
ఆ జానకిని పొగుడుతుంటే నా పరిస్థితి కూడా అంతే. నేను ఉండలేను. ఏదో ఒక రోజు మీ అమ్మను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిస్తాను.. అంటూ శపథం చేసి వెళ్తుంది మల్లిక.
Janaki Kalaganaledu 1 Sep Today Episode : రూమ్ లో కూర్చొని సివిల్స్ కు ప్రిపేర్ అయిన జానకి

Janaki Kalaganaledu 1 september 2021 full episode 118 highlights
కట్ చేస్తే.. జానకి సీరియస్ గా సివిల్స్ కు ప్రిపేర్ అవుతుంటుంది. అప్పుడే రామా రూమ్ లోకి వస్తాడు. జానకి గారు.. నేను ఇప్పుడే వస్తాను.. మీరు చదువుకోండి.. అని చెబుతాడు రామా. ఎక్కడికి అనగానే.. అమ్మకు కాళ్లు పట్టి వస్తాను.. అంటాడు రామా. దీంతో ఈరోజు నేను అత్తయ్యకు కాళ్లు పడతాను అండీ అని చెబుతుంది జానకి. మల్లిక వీళ్ల ముచ్చట్లను వింటుంది. మీకెందుకండీ శ్రమ.. నేను పడుతాను లేండి.. అంటుంది. దీంతో ఏంటి మీరనేది.. మీ అమ్మగారికి ఎప్పుడూ మీరే సేవలు చేస్తారా? మేం సేవలు చేసుకునే అవకాశం ఇవ్వరా ఏంటి.. అని అడుగుతుంది జానకి.

Janaki Kalaganaledu 1 september 2021 full episode 118 highlights
అందుకని మీరు పడుకోండి ముందు… నేను వెళ్లి కాళ్లు పట్టి వస్తాను అని చెబుతుంది. అది కాదు జానకి గారు అంటే వినకుండా.. పడుకోబెట్టి వెళ్తుంది జానకి. అవన్నీ గుమ్మం బయటే ఉండి.. మల్లిక వింటుంది. వామ్మో.. ఓరినాయనో.. పెద్ద కోడలు అత్త దృష్టిలో రోజురోజుకూ ఆకాశమంతా ఎత్తుకు ఎదిగిపోతోంది. పెద్ద కోడలుకు అంత పేరు రావడం నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ జానకిని ఎలా ఏడిపించాలి.. అని ఆలోచిస్తుంటుంది మల్లిక.

Janaki Kalaganaledu 1 september 2021 full episode 118 highlights
Janaki Kalaganaledu 1 Sep Today Episode : జ్ఞానాంబ కాళ్లు వత్తడానికి వెళ్లిన జానకి
కట్ చేస్తే… జ్ఞానాంబ పడుకుంటుంది. అక్కడికి వచ్చిన జానకి.. ఆమె కాళ్లు తీసుకొని ఒత్తుతుంది. రామా… పడుకోవచ్చు కదా నాన్నా.. అంటుంది జ్ఞానాంబ. చూస్తే.. రామా కాదు.. జానకి. నువ్వెందుకు నా కాళ్లు పడుతున్నావమ్మా.. అంటే.. ఈరోజు నేను కాళ్లు పడుతాను.. అనగానే వద్దమా.. కోడలితో కాళ్లు పట్టించుకోవడం నాకు ఇష్టం లేదమ్మా అంటే.. మీరు నా అత్తయ్య కాదు.. అమ్మ అని నేను అనుకుంటే.. కాళ్లు పట్టడంలో తప్పేంటి చెప్పండి.. అని అంటుంది జానకి.

Janaki Kalaganaledu 1 september 2021 full episode 118 highlights
మా అమ్మకు ఎలాగూ సేవలు చేసే అదృష్టం దక్కలేదు. కనీసం ఈ అత్తమ్మకు సేవలు చేసుకునే అవకాశాన్ని అయినా కల్పించండి.. అని చెబుతుంది. బంగారం నువ్వు అని చెప్పి పడుకుంటుంది జ్ఞానాంబ. దీంతో జానకి కాళ్లు పడుతుంది. మల్లికకు ఇక అస్సలు కోపం ఆగదు. అత్తాకోడళ్లు ఒక్కటైపోయారు. అసలు.. జానకిని పంపించి ఈయన ఏం చేస్తున్నాడు అని రామా రూమ్ లోకి తొంగి చూస్తుంది.

Janaki Kalaganaledu 1 september 2021 full episode 118 highlights
Janaki Kalaganaledu 1 Sep Today Episode : జానకి చదువుకునే పుస్తకాలు చూసిన జ్ఞానాంబ
దీంతో జానకి చదువుకునే పుస్తకాలు కనిపిస్తాయి. లైట్ కనిపిస్తుంది. పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి. అయినా చదువుకునే పిల్లకాయలకు ఉండే టేబుల్ లైట్ జానకి గదిలో ఎందుకు ఉన్నాయి. బావ గారు చదువుకోలేదు. జానకి కూడా 5 వ తరగతి మాత్రమే చదువుకుంది. మరి.. ఈ పుస్తకాలేంటి.. అప్పుడు పేపర్ లో జానకి ఫోటో కూడా వచ్చింది. ఏదో సంబంధం ఉంది. దీన్ని ఎలాగైనా ఛేదించాలి.. అని అనుకుంటుంది మల్లిక.

Janaki Kalaganaledu 1 september 2021 full episode 118 highlights
కట్ చేస్తే.. జ్ఞానాంబకు జానకి కాళ్లు ఒత్తడం చూసిన జ్ఞానాంబ భర్త.. అబ్బబ్బబ్బ.. ఏం సుఖం.. పెద్ద కోడలుతో బాగా కాళ్లు ఒత్తించుకుంటున్నావు కదా. చిన్న కోడలు లాగానే పెద్ద కోడలు కూడా వచ్చి ఉంటే మనకు చాలా సమస్యలు వచ్చేవి. శెభాష్ అమ్మా… పెద్ద కోడలువు మంచి కోడలు అనిపించుకున్నావు.. అని జానకిని మెచ్చుకుంటాడు తన భర్త.

Janaki Kalaganaledu 1 september 2021 full episode 118 highlights
ఇంతలోనే మల్లిక అక్కడికి వచ్చి.. అత్తయ్య గారు.. అత్తయ్య గారు అంటూ అరుస్తుంది. పెద్ద కోడలు కిరీటం లేని దేవత అని తెగ పొగుడుతుంటారు కదా. ఆ దేవత గారు దాచిన రహస్యాలను మీరు కూడా తెలుసుకుందురు కానీ రండి.. అని జ్ఞానాంబకు మల్లిక చెప్పగానే.. మల్లిక ఏ విషయం గురించి చెబుతోంది అని జానకి మనసులో అనుకుంటుంది.

Janaki Kalaganaledu 1 september 2021 full episode 118 highlights
కొంపదీసి నా పుస్తకాలను చూసిందా? అని షాక్ అవుతుంది జానకి. ఆ తర్వాత ఏమవుతుందో తెలియాలంటే.. తరువాయి భాగంలో చూడాల్సిందే.

Janaki Kalaganaledu 1 september 2021 full episode 118 highlights