Karthika Deepam 10 Feb Today Episode : తాడికొండ ఎపిసోడ్ ఓవర్.. సౌందర్యతో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయిన కార్తీక్ ఫ్యామిలీ.. ఇంతలో మోనిత రూపంలో కార్తీక్ కు మరో డేంజర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Karthika Deepam 10 Feb Today Episode : తాడికొండ ఎపిసోడ్ ఓవర్.. సౌందర్యతో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయిన కార్తీక్ ఫ్యామిలీ.. ఇంతలో మోనిత రూపంలో కార్తీక్ కు మరో డేంజర్

Karthika Deepam 10 Feb Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 ఫిబ్రవరి 2022, గురువారం 1272 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వొక గొప్ప డాక్టర్ వి నాన్నా అని సౌందర్య.. కార్తీక్ తో అంటుంది. దీంతో నేను ఒకప్పుడు డాక్టర్ ను మమ్మీ. ఇప్పుడు కాదు అంటాడు కార్తీక్. నిన్న గాక మొన్న కలిసిన బాబు మీద మీరు అంత ప్రేమ పెంచుకున్నారు.ర […]

 Authored By gatla | The Telugu News | Updated on :10 February 2022,11:30 am

Karthika Deepam 10 Feb Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 ఫిబ్రవరి 2022, గురువారం 1272 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వొక గొప్ప డాక్టర్ వి నాన్నా అని సౌందర్య.. కార్తీక్ తో అంటుంది. దీంతో నేను ఒకప్పుడు డాక్టర్ ను మమ్మీ. ఇప్పుడు కాదు అంటాడు కార్తీక్. నిన్న గాక మొన్న కలిసిన బాబు మీద మీరు అంత ప్రేమ పెంచుకున్నారు.ర ఎవరో ఏంటో తెలియని బాబు మీదే మీకు అంత ప్రేమ ఉంటే.. కన్నకొడుకువు.. నాకెంత ప్రేమ ఉండాలి నాన్నా అంటుంది సౌందర్య. హిమను ఎవరో తీసుకెళ్లిపోయారంటేనే మీరు ఎంత బాధపడ్డారు. వాళ్ల కాళ్లు పట్టుకున్నారు. కానీ.. ఇన్నిరోజులు మీరు ఎక్కడున్నారో తెలియకపోవడంతో నేను ఎంత నరకం అనుభవించానో తెలుసా? అంటుంది సౌందర్య. మీరు రాను అంటే.. నేను ఇక్కడి నుంచి వెళ్తానని అనుకుంటున్నారా? ఒరేయ్ పెద్దోడా.. మీకే అంత మొండితనం ఉంటే.. నాకెంత ఉండాలి చెప్పు అంటుంది సౌందర్య.

janaki kalaganaledu 10 february 2022 full episode

janaki kalaganaledu 10 february 2022 full episode

చెప్పకుండా వెళ్లిపోవడం.. సెల్ ఫోన్లు పడేయడం మీకే తెలుసా? మాకు కూడా తెలుసు.. అంటుంది సౌందర్య. మీరు నాతో పాటు హైదరాబాద్ కు రాకపోతే.. నేను, మీ నాన్న ఎక్కడికైనా వెళ్లిపోతాం. అవసరమైతే.. నేను మీ నాన్న కలిసి అంటూ ఏదో అనబోతుంది సౌందర్య. దీంతో మమ్మీ.. ఏంటి ఆమాటలు అని అంటాడు కార్తీక్. చెప్పు మరీ.. మనమంతా కలిసి హైదరాబాద్ కు వెళ్తున్నామా లేదా అని అడుగుతుంది సౌందర్య. దీంతో సరే అమ్మ మీ ఇష్టం అంటాడు కార్తీక్. మరోవైపు.. కార్తీక్ కనిపిస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అంటుంది మోనిత. నా కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏమో అంటుంది మోనిత. మోనిత మాట్లాడుతుంటే ఏదో పుస్తకం చదువుతూ ఉంటుంది భారతి. దీంతో కోపం వచ్చి పుస్తకాన్ని తీసి కింద కొడుతుంది.

ఏంటి మోనిత ఇది. అసలు నీవి కష్టాలు కాదు. అవి నువ్వు కోరి తెచ్చుకున్నవి అంటుంది భారతి. తప్పుఒప్పులు పక్కన పెట్టి నీకు ఇన్నాళ్లు అంతో ఇంతో సాయం చేశాను కదా అంటుంది భారతి. అంటే ఇప్పుడు సాయం చేయవా అంటూ ప్రశ్నిస్తుంది మోనిత.

కార్తీక్ ను వెతకడంలో పడి ఆనంద్ గురించే మరిచిపోయా అంటుంది మోనిత. వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఊరుకో మోనిత. ఒక తల్లిగా నువ్వు పడే బాధను నేను అర్థం చేసుకోగలను అని చెప్పి ఓదార్చుతుంది. మరోవైపు హిమ.. రుద్రాణి గురించే ఆలోచిస్తూ ఉంటుంది.

ఏడుస్తూ ఉంటుంది హిమ. పక్కనే పడుకొని ఉన్న శౌర్య.. ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది. ఏడవకు హిమ అంటుంది శౌర్య. నానమ్మ రాకపోయి ఉంటే నేను ఇంటికి వచ్చేదాన్ని కాదేమో శౌర్య అంటుంది హిమ. నానమ్మ వచ్చింది కదా. వాళ్ల అప్పు తీర్చేసింది కదా. ఇంకెందుకు బాధపడుతున్నావు అంటుంది శౌర్య.

Karthika Deepam 10 Feb Today Episode : దీప తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించిన కార్తీక్

నాకు ఎంత భయం వేసిందో తెలుసా. నన్ను ఈ ఊరి నుంచి వేరు ఊరికి తీసుకెళ్తా అన్నారు. ఇక నేను నిన్ను, తమ్ముడిని, నాన్న వాళ్లను చూస్తానో చూడనో అనుకున్నాను అంటుంది హిమ. ఇక ఆ టెన్షన్స్ ఏం ఉండవు. మనం హైదరాబాద్ కు వెళ్తున్నాం అంటుంది శౌర్య.

ఏమ్మా దీపా.. నువ్వైనా ఒక్కసారైనా పెద్దోడితో చెప్పాలి కదా. అయ్యో అక్కడ అత్తయ్య మామయ్యలు ఎలా ఉన్నారో అని. సరే.. మేము బాగానే ఉన్నామని ఒక్కసారి ఎవరి ఫోన్ లో నుంచి అయినా చెప్పి ఉంటే బాగుండేది కదరా అని అడుగుతుంది సౌందర్య.

సౌందర్య.. తనకు గుర్తుగా పిల్లల స్కూల్ బ్యాగులు తెచ్చుకున్న విషయాన్ని చెబుతుంది. ఆ బ్యాగులో కార్తీక్ పర్సు ఉంటుంది. ఆ పర్సులో ఉన్న మీ అమ్మా నాన్న ఫోటో చూసి ఒరేయ్ నేను మీకు ఏం అన్యాయం చేశాం అని ఏడుస్తూ ఉండేదాన్ని అంటుంది సౌందర్య.

హిమ ఆ పర్సు తీసుకొని.. అందులో ఉన్న డబ్బు చూసి వామ్మో ఎన్ని డబ్బులు ఉన్నాయి అంటుంది హిమ. పెద్దోడా అవి నిజంగా నీ డబ్బులే. వాటితో దీప బంగారాన్ని తాకట్టు నుంచి విడిపించుకురా అని కార్తీక్ కు చెబుతుంది. నా కోడలు బంగారం.. తాకట్టు దుకాణంలో ఉండటాన్ని నేను భరించలేను. వెంటనే వెళ్లి తీసుకొనిరా అంటుంది సౌందర్య.

ఒరేయ్ పెద్దోడా.. ఆస్తులు, అంతస్తులు, డబ్బు, హోదా ఇవేవీ లేకున్నా అందరం సంతోషంగా ఉందాంరా అంటుంది సౌందర్య. నన్ను క్షమించు మమ్మీ. ఆశ్రమంలో మిమ్మల్ని ఒకసారి చూశాను అంటాడు కార్తీక్. మీ దగ్గరికి వచ్చి కూడా వెనక్కి వచ్చే ధైర్యం చేయలేకపోయాను. నేను ఒక బండరాయి లాంటి గుండె ఉన్న వాడిని మమ్మి అంటాడు కార్తీక్.

మేమిద్దరం.. ఒకరికి తెలియకుండా.. మరొకరం చూసి.. చెబితే బాధపడతారని ఎవ్వరికీ చెప్పుకోకుండా ఉన్నాం అత్తయ్య అంటుంది దీప. మరోవైపు నా వల్ల భారతి బాధపడుతోంది అనుకొని.. వెళ్లిపోదాం పదా. నావల్ల నీకు ఇబ్బంది వద్దు అంటుంది మోనిత.

కట్ చేస్తే.. తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకొని తీసుకొస్తాడు కార్తీక్. దీంతో దీప చాలా సంతోషిస్తుంది. ఒరేయ్ ఆనంద్.. మనం హైదరాబాద్ వెళ్లిపోతున్నాం తెలుసా అంటుంది హిమ. అన్ని సామాన్లు సర్దుకొని హైదరాబాద్ బయలుదేరబోతారు అందరూ.

ఇంతలో రుద్రాణి వస్తుంది. ఎక్కడికో బయలుదేరినట్టున్నారు అంటుంది రుద్రాణి. మీపాటికి మీరు చెక్కు రాసి మొహాన కొట్టిపోతే ఎలా మేడమ్ అని రుద్రాణి.. సౌందర్యను అడుగుతుంది. ఆ చెక్ తీసుకొచ్చి ఇది నాకొద్దు మేడమ్ అంటుంది రుద్రాణి. నన్ను క్షమించండి సారు అంటుంది రుద్రాణి.

సారు కాదు.. నన్ను క్షమించండి డాక్టర్ గారు అంటుంది రుద్రాణి. దీపమ్మ నన్ను క్షమించు. పిల్లలంటే ఇష్టం. డబ్బు, అహంకారంతో నేను ఎన్నో కష్టాలు పెట్టాను. ఈ మేడమ్ మీ గురించి చెబుతుంటే నా బుర్ర తిరిగిపోయింది అంటుంది రుద్రాణి.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది