Janaki Kalaganaleduu 11 April Today Episode : యోగికి జానకి షాక్.. తన మీద ఫిర్యాదు ఇవ్వడంతో జ్ఞానాంబ షాకింగ్ నిర్ణయం.. జానకి పరిస్థితి ఏంటి? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Janaki Kalaganaleduu 11 April Today Episode : యోగికి జానకి షాక్.. తన మీద ఫిర్యాదు ఇవ్వడంతో జ్ఞానాంబ షాకింగ్ నిర్ణయం.. జానకి పరిస్థితి ఏంటి?

Janaki Kalaganaleduu 11 April Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 ఏప్రిల్ 2022, సోమవారం ఎపిసోడ్ 276 హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. మా అత్తయ్య గారి గురించి నేను చెప్పిన ప్రతి మాట నిజం అంటుంది జానకి. కానీ.. యోగి మాత్రం కాదు అంటాడు. ఆవిడ నీకు పెట్టిన బాధలు నేను కళ్లారా చూశాను. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీకు విడాకులు ఇప్పించేసి […]

 Authored By gatla | The Telugu News | Updated on :11 April 2022,11:30 am

Janaki Kalaganaleduu 11 April Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 ఏప్రిల్ 2022, సోమవారం ఎపిసోడ్ 276 హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. మా అత్తయ్య గారి గురించి నేను చెప్పిన ప్రతి మాట నిజం అంటుంది జానకి. కానీ.. యోగి మాత్రం కాదు అంటాడు. ఆవిడ నీకు పెట్టిన బాధలు నేను కళ్లారా చూశాను. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీకు విడాకులు ఇప్పించేసి మాతో పాటు అమెరికాకు తీసుకెళ్లిపోతాం అంటాడు యోగి. దీంతో జానకి షాక్ అవుతుంది. అన్నయ్య బుద్ధి లేకుండా మాట్లాడకు. పిచ్చి గానీ పట్టిందా నీకు. ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతోందా అని అడుగుతుంది జానకి.

janaki kalaganaledu 11 april 2022 full episode

janaki kalaganaledu 11 april 2022 full episode

దీంతో నేను ఏం చేస్తున్నానో నాకు అర్థం అవుతోంది. నువ్వు ఇలా ఇబ్బందులు పడటం నేను చూడలేకపోతున్నాను. నువ్వు ఎవ్వరికీ భయపడకుండా స్టేషన్ కు వచ్చి ఆ జ్ఞానాంబ మీద కంప్లయింట్ ఇవ్వు. తర్వాత జరిగేది నేను చూసుకుంటాను అంటాడు యోగి. పదా అని తనను తీసుకెళ్లబోతుంటాడు యోగి. ఊర్మిల మాట కూడా వినడు. పోలీస్ స్టేషన్ కు పట్టుకొని వస్తాడు. లోపలికి తీసుకొస్తాడు. ఎస్ఐ గారు.. మా చెల్లెలు జానకి అంటాడు. అత్తయ్య గారు అని పిలుస్తుంది జానకి.

జాను నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. మీ అత్తయ్య నిన్ను ఎలాంటి ఇబ్బందులు పెట్టిందో.. అన్నింటినీ ఎస్ఐ గారికి చెప్పు అంటాడు యోగి. ఇంతలో గోవిందరాజు, విష్ణు, అఖిల్, మల్లిక, రామా అందరూ వస్తారు.

మీ అత్తయ్య నిన్ను పెట్టిన టార్చర్ అంతా చెప్పు అంటాడు. దీంతో చెప్తాను.. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను అంటుంది జానకి. ఎస్ఐ గారు నా స్టేట్ మెంట్ రికార్డు చేసుకోండి అంటుంది జానకి. మా అత్తయ్య గారు నన్ను చాలా బాధపెట్టారు అంటుంది జానకి.

చాలా కష్టపెట్టారు. ఇది నిజం. నన్ను చాలా చాలా హింసించారు. అవును ఎస్ఐ గారు. నేను ఇప్పుడు చెప్పిన ప్రతి మాట నిజం.. అంటుంది. దీంతో ఎస్ఐ గారు మా చెల్లెలు చెప్పింది విన్నారు కదా మీ ఫార్మాలిటీస్ పూర్తి చేయండి అంటాడు యోగి.

దీంతో ఒక్క నిమిషం. నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు అంటుంది. మా అత్తయ్య గారు నన్ను ఎలా ఇబ్బంది పెట్టారో తెలుసా.. భరించలేనంత ప్రేమతో అంటుంది జానకి. నాకింట్లో ఏ పనీ చెప్పకుండా అన్ని పనులు తనే చేస్తూ నా మనసును చాలా కష్టపెట్టారు అంటుంది జానకి.

ఎస్ఐ గారు.. మా అన్నయ్య మీకు ఇచ్చిన కంప్లయింట్ లో ఒక్క విషయం కూడా నిజం లేదు. మా అత్తయ్య గారు నన్ను కోడలుగా కాకుండా కూతురుగా చూసుకున్నారు.. అంటుంది జానకి. ప్రతి క్షణం అమ్మలా ప్రేమను పంచారే తప్ప.. తన అజమాయిషీని ఏనాడూ చూపించలేదు అంటుంది జానకి.

మేము మా అత్తయ్య గారికి తెలియకుండా ఒక్క విషయంలోనే తప్పు చేశాం. ఆవిడ మామీద పెట్టుకున్న నమ్మకాన్ని మోసం చేశాం. ఆవిడ ముందు తల ఎత్తుకొని నిలబడే ధైర్యం లేకే మేము బయటికి వచ్చాం తప్పితే ఆవిడ మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించలేదు అంటుంది జానకి.

Janaki Kalaganaleduu 11 April Today Episode : కేసు వెనక్కి తీసుకోకపోతే నీ మీద రివర్స్ కేసు పెడతా అని యోగిన బెదిరించిన జానకి

జాను ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు యోగి. ఏం మాట్లాడుతున్నావో.. ఎవరి గురించి మాట్లాడుతున్నావో కాస్త తెలుసుకొని మాట్లాడు అంటుంది జానకి. మా అత్తయ్య గారు నన్ను కష్టాలు పెట్టారా.. అసలు అలాంటి మనస్తత్వమేనా ఆవిడది అంటుంది జానకి.

అమ్మ నాన్న దూరం అయ్యారని నేను ఏడుస్తుంటే మా అత్తయ్య గారు ఏం చెప్పారో తెలుసా? నీకు అమ్మానాన్న దూరం అవ్వొచ్చు కానీ.. వాళ్ల ప్రేమ దూరం అవ్వదు అని చెప్పారు. చెప్పిన ప్రకారమే అమ్మానాన్నల ప్రేమను నాకు అందించారు. ఫోటో చూసినప్పుడల్లా అమ్మానాన్నలు లేని లోటు నాకు రాకూడదని.. వాళ్ల ఇంట్లో ఫోటోను పెట్టించారు అంటుంది జానకి.

అలాంటి అత్తయ్య గారి మీద కేసు పెడితే ఆ దేవుడు కూడా క్షమించడు.. అని చెప్పి తన కాళ్లకు నమస్కరిస్తుంది జానకి. జానకి కన్నీళ్లు తన కాళ్ల మీద పడతాయి. దీంతో తను కాళ్లను వెనక్కి అనుకుంటుంది. మా అత్తయ్య గారి పరువును పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చి ఇప్పటికే నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు అంటుంది జానకి.

మర్యాదగా కేసును వెనక్కి తీసుకొని మా అత్తయ్య గారికి క్షమాపణ చెప్పు. లేదంటే నేనే నీ మీద కేసు పెడతా అంటుంది జానకి. ఎస్ఐ గారు నేను కంప్లయింట్ ఇస్తేనే మీరు కేసు పెట్టాల్సి ఉంటుంది. ఎవరో ఇచ్చిన కంప్లయింట్ ను తీసుకొని మీరు మా అత్తయ్య గారిని అరెస్ట్ చేయడం అంటే మీరు కూడా నేరం చేసినట్టే అవుతుంది అంటుంది జానకి.

కంప్లయింట్ చింపేసి.. సారీ మేడమ్ అని చెబుతాడు ఎస్ఐ. ఆ తర్వాత పదండి అత్తయ్య గారు అంటుంది జానకి. కానీ.. నేను వెళ్లను అంటుంది జ్ఞానాంబ. ఏం జరుగుతుందో ఎవరు ఏం చేస్తున్నారో.. ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం అవుతోంది అంటుంది జ్ఞానాంబ.

వాళ్ల ఫిర్యాదులో ఇచ్చిన ప్రతి మాట నిజం. నేను నా పెద్దకొడుకును పెద్దకోడలును ఇంట్లో నుంచి పంపించేసి బాధపెట్టాను. నన్ను జైలుకు పంపించండి అంటుంది జ్ఞానాంబ. అమ్మ.. తెలిసో తెలియకో తప్పు జరిగిందమ్మా దయచేసి క్షమించు అమ్మ అంటాడు రామా.

ఎస్ఐ గారు నేను ఒప్పుకుంటున్నాను కదా కేసు పెట్టండి అంటుంది. కానీ.. మీరు ఒప్పుకుంటే సరిపోదు.. నేరం చేసినట్టు సాక్ష్యం కావాలి.. కేసు రిజిస్టర్ చేయలేం అంటాడు ఎస్ఐ. నేనే ఒప్పుకుంటున్నాను కదా ఇంకేంటి సమస్య అంటుంది జ్ఞానాంబ.

మీ కోడలు మీరు నిర్దోషి అని చెప్పాక కేసు నిలబడదు. మీలో మీకు ఏమైనా మనస్పర్థలు ఉంటే.. ఇంటికెళ్లి మాట్లాడుకోండి అంటాడు ఎస్ఐ. ఇంటికెళ్దాం పదా అని అందరూ జ్ఞానాంబను బతిమిలాడుతారు. దీంతో జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించారు. ఈ అవమానాన్ని నేను జీవితంలో మరిచిపోను. నువ్వు ఈ నాటకం మీ అన్నయ్యతో కలిసి ఆడావని నాకు తెలియదా. ఈ జన్మలో ఈ అవమానాన్ని మరిచిపోను. నేను బతికి ఉన్నంత కాలం ఈ అవమానం గుర్తుంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ.

కట్ చేస్తే.. నడుచుకుంటూ రామా, జానకి వెళ్తుంటారు. మధ్యలో రామా ఆగుతాడు. ఏమైంది రామా గారు అని అడుగుతుంది జానకి. దీంతో సైకిల్ కు స్టాండ్ వేసి.. ముందుకెళ్లి ఆగుతాడు. నన్ను క్షమించండి అని తన చేతులు పట్టుకొని అడుగుతాడు రామా.

అయ్యో మీరు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటి అని అంటుంది. మీకు తెలియకుండా మీ అన్నయ్య కేసు పెట్టడు అని అనుమానించాను. మీరేంటో మీ మనస్తత్వం ఏంటో నాకు తెలుసు. ఇప్పటికే మా అమ్మ దూరం అవడంతో ఇంకా దూరం అవుతుందని నేను బాధపడ్డాను.. అంటాడు రామా.

మిమ్మల్ని బాధపెట్టినందుకు నన్ను క్షమించండి జానకి గారు అంటాడు రామా. మీ కళ్లలో కళ్లు పెట్టి చూడలేకపోతున్నాను అంటాడు రామా. దీంతో తన చేతికి ముద్దు ఇచ్చి.. మా ఆయన ఏంటో నాకు తెలియదా. మా ఆయనకు నేనంటే ఎంత ప్రేమో నాకు తెలియదా. రామా గారు మీ అమ్మ గారు అరెస్ట్ అయ్యారన్న బాధతోనే అలా మాట్లాడారు తప్పితే నామీద కోపంతో కాదని నేను అర్థం చేసుకోగలను అంటుంది జానకి.

కానీ.. అమ్మ మిమ్మల్ని ఇంకా అపార్థం చేసుకుంది అంటాడు రామా. ఆ కోపం ఎంత దూరం వెళ్తుందో.. ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అని భయంగా ఉంది అంటాడు రామా. అపార్థాలు తొలిగిపోయే ముందు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అత్తయ్య గారు నన్ను అర్థం చేసుకుంటారనే నమ్మకం నాకు ఉంది. ఇక ఈ విషయం గురించి మీరు ఏం మాట్లాడొద్దు. వెళ్దాం పదండి అంటుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది