sunil played important role in pushpa film
Sunil : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ -సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘పుష్ప’. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ నెల 17న పార్ట్ వన్ విడుదల కానుంది. ఇకపోతే ఇందులో భారీతారాగణమే ఉంది. విలన్‌గా మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ నటిస్తుండగా, మరో కీలక పాత్రలో సునీల్ నటిస్తున్నారు. కమెడియన్, హీరోగా సక్సెస్ అయిన సునీల్ ప్రజెంట్ విలక్షణమైన పాత్రలను పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ‘మంగళం శ్రీను’గా సునీల్ యాక్టింగ్ వేరే లెవల్‌లో ఉండబోతుందని మూవీ యూనిట్ సభ్యులు చెప్తున్నారు.
‘పుష్ప’ సినిమాలో సునీల్ యాక్టింగ్ ప్లస్ డైలాగ్ డెలివరీ, డిక్షన్ వెరీ డిఫరెంట్‌గా ఉండబోతున్నాయని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతున్నది. గతంలో కమెడియన్‌గా నటించిన సునీల్ హీరోగానూ పలు సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. కాగా, ఇటీవల కాలంలో సునీల్ విలక్షణమైన పాత్రలు పోషించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ‘పుష్ప’లో మంచి రోల్ ప్లే చేశారని మూవీ యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికే డబ్బింగ్ టైంలో తాను సునీల్ యాక్టింగ్ చూసి ఫిదా అయ్యానని బన్నీ సుకుమార్‌కు చెప్పారని టాక్.నెగెటివ్ షేడ్‌లో సునీల్ ఇరగ దీశాడని, ఈ సినిమాలో ఆయనకు జోడీగా ‘దాక్షాయణి’గా అనసూయ భరద్వాజ్ చాలా బాగా నటించిందని తెలుస్తోంది.
sunil played important role in pushpa film
ట్రైలర్‌లో సునీల్ చెప్పిన ‘కట్ట మీద కూసోని ఎవరైనా చెప్తారు.. లోతు దిగితే తెలుసుద్ది అబ్బా’ అంటూ డిఫరెంట్ డిక్షన్‌లో సునీల్ డైలాగ్.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘పుష్ప’ సినిమాకు మ్యూజిక్ దేవి శ్రీప్రసాద్ అందించగా, సినిమాటోగ్రఫీ కుబా చేశారు. ఇక ఇందులో ఐకాన్ స్టార్ బన్నీ సరసన బ్యూటిఫుల్ అండ్ క్యూట్ హీరోయిన్ రష్మిక మందన నటించింది. ఈ పిక్చర్ ద్వారా బన్నీ పాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బన్నీ-సుక్కు కాంబోలో గతంలో ‘ఆర్య, ఆర్య-2’ చిత్రాలు వచ్చాయి.
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
This website uses cookies.