Janaki Kalaganaledu 13 Sep Monday Episode Highlights : జానకి డిగ్రీ పట్టా తీసుకుంటున్న ఫోటోను చూసిన జ్ఞానాంబ, తన భర్త.. జానకి చదువు విషయం జ్ఞానాంబకు తెలుస్తుందా?

janaki kalaganaledu 13 september 2021 monday 126 episode highlights
Janaki Kalaganaledu 13 Sep Monday Episode Highlights : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. సోమవారం ఎపిసోడ్ 126, 13 సెప్టెంబర్ 2021 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం.
పెద్ద కోడలు జానకి తనకు పెత్తనం వద్దని చెప్పడంతో.. చిన్న కోడలు మల్లికకు జ్ఞానాంబ పెత్తనం అప్పగిస్తుంది. దీంతో పెద్దమనిషిలా చీర కట్టుకున్న మల్లిక.. అందరికీ తన రూల్స్ చెబుతుంది. ఒక్కొక్కరుగా అందరూ ఏమున్నా కూడా తనను అడగాలని.. తన పర్మిషన్ తీసుకోకుండా.. ఇంటి గడప కూడా దాటొద్దని అంటుంది.
ఒక్కొక్కరు వచ్చి.. మల్లికను పర్మిషన్లను అడుగుతుంటారు. ఒక్కొక్కరికి పర్మిషన్లు ఇస్తుంటుంది. జ్ఞానాంబ కూడా వచ్చి.. మేం తీర్థయాత్రలకు వెళ్లాలని అనుకుంటున్నా.. అని అంటుంది జ్ఞానాంబ. ఎందుకు ఇప్పుడు అవసరం లేదు అంటుంది. తర్వాత తన మామయ్య వచ్చి.. తీర్థయాత్రలకు వద్దన్నారు.. కనీసం నాకు తీర్థం పోస్తారా… అంటుంది. హా.. పోస్తారు.. వెళ్లి ఆంజనేయ స్వామిలో పూజారిని అడగండి అంటుంది. తర్వాత జానకి వచ్చి.. మల్లిక మల్లిక అంటుంది. మల్లిక సరుకులు తీసుకురావాలి.. అంటుంది. మల్లిక ఏంటి.. మల్లిక.. మేడమ్ అని పిలువు అంటుంది.

janaki kalaganaledu 13 september 2021 monday 126 episode highlights
Janaki Kalaganaledu 12 Sep Monday Episode Highlights : మేడమ్ మల్లిక అని పిలిచిన జానకి
మేడమ్.. అంటుంది. మేడమ్ మల్లిక గారు.. అని పిలిచాక.. సరుకులు తీసుకురావాలి అంటుంది. దీంతో వంద రూపాయలు ఇచ్చి సరుకులు తీసుకురా.. నెలంతా రావాలి అంటుంది. దీంతో ఏం మాట్లాడకుండా వెళ్తుంది జానకి. వెంటనే అక్కడికి వచ్చిన తన భర్త విష్ణు.. వంద రూపాయలు ఇస్తే ఏం వస్తాయి.. అని అంటాడు. హేయ్.. నా మాటే శాసనం.. అంటూ తెగ నవ్వేస్తుంటుంది. నవ్వుతూ నవ్వుతూ.. తీరా చూసుకునేసరికి.. తను రోడ్డు మీద ఉన్న విషయాన్నే మరిచిపోతుంది. పక్కనే ఉన్న వాళ్లు ఈ పిల్లకు ఏమైందని నవ్వుతారు.
జానకి పెద్ద చదువులు చదువుకుందని తెలుసుకున్న మల్లిక.. వెంటనే ఇంటికి పరిగెత్తుతూ వస్తుంటుంది. ఉదయమే జ్ఞానాంబ దేవుడికి పూజ చేస్తుంటుంది. అందరూ టెన్షన్ గా నిలబడి ఉంటారు. ఇప్పటి దాకా మీ అమ్మ నిర్ణయానికి ఎదురు చెప్పలేదు కానీ.. మీ అమ్మ తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు.. అంటాడు జ్ఞానాంబ భర్త. నాన్న.. అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా బాగానే ఉంటుంది. ఈ విషయంలో మాత్రం నాకు నచ్చడం లేదు. మల్లికకు పెత్తనం ఇస్తే.. ఇంటిని రెండు ముక్కలుగా చేయకుండా ఉంటుందా? అంటాడు.

janaki kalaganaledu 13 september 2021 monday 126 episode highlights
ఓవైపు పెత్తనం వస్తుందన్న ఆనందం.. మరోవైపు జానకి తట్టాబుట్టా సర్దుకొని వెళ్తుందన్న సంతోషం.. ఈ రెండింటి గురించి ఆలోచిస్తే చాలా సంతోషంగా ఉంది అనుకుంటూ ఇంటికి వస్తుంది మల్లిక. కానీ.. ఇంట్లో మాత్రం అందరూ జానకినే పెత్తనం తీసుకోవాలని కోరుతారు. కానీ.. తను మాత్రం నాకు పెత్తనం తీసుకోవడం కంటే.. ఈ ఇంటి కోడలుగా బాధ్యతలు నిర్వర్తించడమే ఇష్టం అంటుంది జానకి.
Janaki Kalaganaledu 12 Sep Monday Episode Highlights : హారతి దీపానికి కాలిపోయిన పేపర్
ఇంతలో అత్తయ్య గారు.. అత్తయ్య గారు.. అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి.. ఎంత మోసం.. ఎంత ఘోరం అంటూ చెబుతుంది. మీకొక భయంకరమైన నిజం చెప్పాలి.. ఒక్కనిమిషం.. ముందు ఇది చూడండి.. అంటూ పేపర్ తీసి ఇవ్వబోతుంది. అంతలోనే జ్ఞానాంబ చేతుల్లో ఉన్న మంగళహారతి కింద పడి.. పేపర్ కూడా దాని మీద పడటంతో ఆ పేపర్ కాలిపోతుంది. దీంతో జానకి చదువుకు సంబంధించిన ఆ ఒక్క సాక్ష్యం కూడా పోతుంది. హారతి కింద పడేశావు.. నీకు పెత్తనం ఇద్దామనగానే ఇంత ఘోరం జరిగింది. నీకు పెత్తనం ఇస్తే.. ఆ కాగితాన్ని తగులబెట్టినట్టే ఇంటిని కూడా తగులబెట్టేస్తావు అంటుంది. జానకి ముందు హారతి పళ్లెం తీసుకెళ్లి పూజగదిలో పెట్టు అంటుంది జ్ఞానాంబ.

janaki kalaganaledu 13 september 2021 monday 126 episode highlights
ఈరోజు మంచి రోజు అంట.. ఆ పెత్తనం ఏదో నాకు ఇస్తారా.. అని అడుగుతుంది మల్లిక. దీంతో ఏం అవసరం లేదు.. ఆ పెత్తనం ఏదో నాదగ్గరే ఉంటుంది.. అని చెబుతుంది జ్ఞానాంబ. దీంతో అందరూ ఈలలు వేసి సూపర్ అంటారు. ఇంతలో ఏదో భయంకరమైన నిజం చెప్పాలన్నావు కదా.. ఏంటది అని అడుగుతుంది జ్ఞానాంబ. చెప్పు.. మాట్లాడవేంటి.. ఏంటా నిజం.. అని అడుగుతుంది. దీంతో ఏం లేదు.. అంటూ నీళ్లు మింగుతుంది.. మల్లిక. దీంతో నీ బొంద అంటూ తిట్లు తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. దీంతో ఏడుస్తూ కూర్చుంటుంది మల్లిక.
Janaki Kalaganaledu 12 Sep Monday Episode Highlights : ఓ మహిళకు 5 లక్షలు ఇచ్చిన జ్ఞానాంబ
జ్ఞానాంబ తన కూతురు చదువుల కోసం తనకు తెలిసిన మహిళకు 5 లక్షల డబ్బులు ఇస్తుంది. థ్యాంక్యూ జ్ఞానాంబ అంటుంది. అడగ్గానే డబ్బులు ఇచ్చినందుకు నీకు చాలా రుణపడి ఉంటాను అంటుంది. ఆ తర్వాత జ్ఞానాంబ, తన భర్త.. ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లబోతుండగా.. అక్కడ జానకి కాలేజీలో డిగ్రీ పట్టా తీసుకున్న ఫోటోలు కనిపిస్తాయి వాళ్లకు. జ్ఞానాంబ భర్త ఆ ఫోటోను చూసి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.