Janaki Kalaganaledu 16 Feb Today Episode : వెన్నెల నిశ్చితార్థం ఆపబోయి.. జ్ఞానాంబ‌ ముందు అడ్డంగా బుక్కయిపోయిన రామా, జానకి.. జ్ఞానాంబ‌ నిర్ణయానికి జానకి కట్టుబడి ఉంటుందా?

Janaki Kalaganaledu 16 Feb Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 ఫిబ్రవరి 2022, బుధవారం ఎపిసోడ్ 238 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏది మంచో  ఏది చెడో తెలియని వయసు నీది. చిన్నప్పుడు నువ్వు టప్పటడుగులు వేస్తుంటే చూసి సంబురపడ్డాను. ఇప్పుడు వేస్తే చూస్తూ ఊరుకోలేను. అమ్మ ఏం చెప్పినా.. ఏం ఆలోచించినా.. ఏం చేసినా.. పిల్లల సంతోషం కోసమే. ప్రేమ వ్యవహారంలో అభద్రత ఉంటుంది. అది ఎప్పుడు కూలిపోయేది తెలియదు. అర్థం చేసుకో. నువ్వు బాధపడకు. నన్ను బాధపెట్టకు అని వెన్నెలకు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ‌. మరోవైపు రామా, జానకికి ఏం చేయాలో అర్థం కాదు. వెన్నెల పరిస్థితి చెబితే అర్థం చేసుకుంటారని అనుకున్నా కానీ.. అంత కోపంగా ప్రవర్తిస్తారని అనుకోలేదు. నిశ్చితార్థం ఆపడానికి ఉన్న ఒకే ఒక అవకాశం చేజారిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటాడు రామా.

janaki kalaganaledu 16 february 2022 full episode

నిశ్చితార్థం ఆపలేకపోయాం.. దానితో పాటు కొత్త సమస్యలను కొని తెచ్చుకున్నామేమో అంటుంది జానకి. ఒకవేళ ఆ విషయాన్ని ఆయన అత్తయ్య గారికి చెబితే మనకు మరో పెద్ద సమస్య వస్తుంది. ఖచ్చితంగా అత్తయ్య గారికి చెప్పే ప్రమాదం ఉంది అంటుంది జానకి. అవును జానకి గారు.. మీరు చెప్పేదాకా నాకు ఆ అనుమానమే రాలేదు. ఖచ్చితంగా వెళ్లి చెబుతాడు. అదే గనుక జరిగితే జరగబోయే పరిస్థితులను ఊహించుకోవడమే కష్టంగా ఉంది అంటాడు రామా. దీంతో రామా గారు వాళ్లు అత్తయ్య గారి దగ్గరికి వెళ్లముందే ఆయనతో మాట్లాడుదాం. వెంటనే ఆయనకు ఫోన్ చేయండి అంటుంది జానకి. దీంతో రామా ఫోన్ చేస్తాడు కానీ.. సుబ్బరాజు లిఫ్ట్ చేయడు. మరోవైపు సుబ్బరాజు తన కొడుకు, భార్యతో కలిసి జ్ఞానాంబ‌ ఇంటికి కారులో బయలుదేరుతాడు.

ఇంతలో జ్ఞానాంబ‌ నిశ్చితార్థం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. జ్ఞానాంబ‌ తన కుటుంబ సభ్యులతో చెబుతుంది. ఇంతలో రామా, జానకి వస్తారు. రామా.. ఇటురండి అని పిలుస్తుంది జ్ఞానాంబ‌. ఎక్కడికెళ్లారురా అని అడుగుతుంది. మన కొట్టు దగ్గరికి వెళ్లివస్తున్నాను అని చెబుతాడు రామా.

నిశ్చితార్థం పనులు ఉన్నాయి కదరా.. ఈరోజు కొట్టు ఎందుకు అంటుంది. విష్ణుకు సుబ్బరాజు వాళ్లకు ఫోన్ చేసి ముహూర్తానికి కొంచెం ముందుగానే రమ్మని చెప్పు అని అంటుంది. అలాగే అని విష్ణు ఫోన్ చేయబోతాడు. ఇంతలోనే సుబ్బరాజు వాళ్ల కారు వచ్చి అక్కడ ఆగుతుంది.

అక్కర్లేదు మేమే వచ్చాం అంటారు సుబ్బరాజు వాళ్లు. దీంతో అందరూ షాక్ అవుతారు. రండి అన్నయ్య గారు అంటుంది జ్ఞానాంబ‌. కూర్చోండి అంటుంది జ్ఞానాంబ‌. అన్నయ్య గారు నిశ్చితార్థానికి ఒక రోజు ముందే వచ్చారా అని అడుగుతుంది జ్ఞానాంబ‌. దీంతో నిశ్చితార్థానికి కాదు.. నిలదీయడానికి వచ్చాం అంటారు వాళ్లు.

Janaki Kalaganaledu 16 Feb Today Episode : సుబ్బరాజు ఫ్యామిలీ వచ్చి జ్ఞానాంబ‌తో గొడవపెట్టుకున్నట్టు కల గన్న జానకి

అన్నయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు. నిలదీయడానికి రావడం ఏంటి. ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటుంది జ్ఞానాంబ‌. జ్ఞానాంబ‌ గారి కుటుంబం అంటే సంస్కారానికి పెట్టింది పేరు అనుకున్నాం. మీ కుటుంబం నుంచి మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా తెచ్చుకోవడం మా అదృష్టం అనుకున్నాం కానీ.. మీరు ఇంత మోసం చేసేవాళ్లు అని.. అనుకోలేదు అంటాడు సుబ్బరాజు.

దీంతో జ్ఞానాంబ‌.. సుబ్బరాజుపై సీరియస్ అవుతుంది. మమ్మల్ని ఇప్పటి వరకు ఎవ్వరూ వేలు ఎత్తి చూపించలేదు.. అంటుంది. మీ అమ్మాయి ప్రేమ విషయం దాచి పెట్టడం మోసం కాదా అంటుంది పెళ్లికొడుకు తల్లి. వేరే ఎవరినో ప్రేమించిన అమ్మాయిని నాకు అంటగడతారా అని పెళ్లికొడుకు అంటాడు.

ఎవరో మీకు మా మీద చెప్పి ఉంటారు అని విష్ణు అంటాడు. దీంతో ఎవరో చెప్పలేదు.. మీ ఇంట్లో వాళ్లే చెప్పారు అంటాడు సుబ్బరాజు. దీంతో అందరూ మల్లికను అనుమానిస్తారు. మీకు మా ఇంట్లో వాళ్లు చెప్పారా.. ఎవరు వాళ్లు అని అడుగుతుంది జ్ఞానాంబ‌. దీంతో మీ పెద్ద కొడుకు రామచంద్ర, మీ పెద్ద కోడలు జానకి అని చెబుతాడు సుబ్బరాజు.

దీంతో జ్ఞానాంబ‌ షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు. వాళ్లు చెప్పడం ఏంటి.. అంటుంది. వాళ్లు మీ ఇంటికి రావడం ఏంటి.. మీకు చెప్పడం ఏంటి అంటుంది జ్ఞానాంబ‌. వాళ్లు చెప్పే మాటలను అస్సలు నమ్మదు. వాళ్ల మీద నిందలు వేస్తున్నారు ఎందుకు అంటుంది జ్ఞానాంబ‌.

వాళ్లు ఇక్కడే ఉన్నారు కదా.. వాళ్లను అడగండి.. అని పెళ్లికొడుకు అంటాడు. సుబ్బరాజు కూడా అదే అంటాడు. రామా వాళ్లు అలా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే మాట్లాడవేంటి. సమాధానం చెప్పు. అతడి నోరు మూయించు అంటుంది జ్ఞానాంబ‌. దీంతో అమ్మ అది.. అంటూ తడబడుతాడు రామా.

వాళ్ల నోరు మూయించమని చెబుతుంటే నీళ్లు నములుతావేంట్రా అంటుంది జ్ఞానాంబ‌. అంటే.. వాళ్లు చెప్పేది నిజమేనా అంటుంది. మీరిద్దరూ వాళ్ల ఇంటికి వెళ్లి వెన్నెల గురించి చెప్పారా అని అడుగుతుంది జ్ఞానాంబ‌. అడుగుతుంటే మాట్లాడరు ఏంటి.. వెళ్లారా లేదా.. మాట్లాడారా లేదా అని అడుగుతుంది జ్ఞానాంబ‌.

దీంతో వెళ్లాం అంటాడు రామా. విన్నారు కదా.. స్వయంగా వాళ్లే ఒప్పుకున్నారు కదా. వాళ్లు మా ఇంటికి వచ్చి మీ కూతురు వ్యవహారం గురించి చెప్పారు. ఇప్పుడు మీరు ఏం సమాధానం చెబుతారు అని ప్రశ్నిస్తారు. పరువు గల కుటుంబం అనుకున్నాం కానీ.. ఇంత గొప్ప పరువు గల కుటుంబం అనుకోలేదు. మీకు ఒక నమస్కారం.. అని చెప్పి పెళ్లి కొడుకు తరుపు వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు.

అమ్మ.. అది కాదు అమ్మ నేను చెప్పేది అని రామా ఏదో చెప్పబోయేసరికి.. జ్ఞానాంబ‌ అస్సలు వినదు. నా కొడుకు ఇలా మారిపోవడానికి కారణం నువ్వే అంటూ జానకిపై నోరు పారేసుకుంటుంది జ్ఞానాంబ‌. అయితే.. అదంతా కల.. జానకి అలా ఏమైనా జరుగుతుందేమో అని భయపడుతుంది.

రామా గారు వాళ్లు మన ఇంటికి వస్తారేమో అని భయమేస్తుంది. వాళ్లు మన ఇంటికి రాకముందే వాళ్లను ఆపాలి అంటుంది జానకి. మరో వైపు జ్ఞానాంబ‌.. రామాకు ఫోన్ చేస్తుంది. రామచంద్రాపురం నుంచి పెళ్లివాళ్లు వచ్చారు. ఉన్నపళంగా మీరు వచ్చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Bonalu In Telangana : బోనాల పండుగలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి… అవేంటో తెలుసా…?

Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…

29 minutes ago

Poco M6 Plus : రూ.10 వేల ధరలో పోకో M6 Plus స్మార్ట్‌ఫోన్‌

Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…

9 hours ago

Atchannaidu : జగన్ ప్రతిపక్ష నేత కాదు.. జస్ట్ ఎమ్మెల్యే అంతే : అచ్చెన్నాయుడు.. వీడియో

Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…

10 hours ago

Ration : రేషన్ పంపిణీ కొత్త టెక్నాల‌జీ.. ఇక‌పై గంటల తరబడి వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేదు

Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…

11 hours ago

Nayanthara : నయనతార – విఘ్నేష్ విడాకులు తీసుకుంటున్నారా..? క్లారిటీ ఇది చాలు..!

Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…

12 hours ago

Ys Jagan : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లేస్ లో మరొకరికి ఛాన్స్ ఇచ్చిన జగన్

Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…

13 hours ago

Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, పండుగ సాయ‌న్న మ‌ధ్య బాండింగ్ ఏంటి.. అస‌లుఎవ‌రు ఇత‌ను..?

Hari Hara Veera Mallu : పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…

14 hours ago

Jagadish Reddy : క‌విత‌ని ప‌ట్టించుకోన‌వ‌సరం లేదు… బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

15 hours ago