Janaki Kalaganaledu 16 May Today Episode : అసలు నిజం జానకికి చెప్పిన రామా.. దీంతో కన్నబాబుకు జానకి సీరియస్ వార్నింగ్.. ఇంతలో జ్ఞానాంబకు భారీ షాక్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu 16 May Today Episode : అసలు నిజం జానకికి చెప్పిన రామా.. దీంతో కన్నబాబుకు జానకి సీరియస్ వార్నింగ్.. ఇంతలో జ్ఞానాంబకు భారీ షాక్

 Authored By gatla | The Telugu News | Updated on :16 May 2022,11:30 am

Janaki Kalaganaledu 16 May Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 మే 2022, సోమవారం ఎపిసోడ్ 301 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎంత అడిగినా రామా ఏం జరిగిందో చెప్పకుండా వెళ్లిపోవడంతో జానకికి ఏం చేయాలో అర్థం కాదు. రూమ్ లో ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. ఇంతలో రామా బయటికి వెళ్తాడు. ఆరుబయట కూర్చుంటాడు. దీంతో అతడి వద్దకు వెళ్తుంది జానకి. మీరొక్కరే ఇలా బాధపడటం బాగోలేదు అంటుంది. మన శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటే అన్నారు. నేను మీలో సగభాగం అని చెప్పారు అంటుంది జానకి. మరి.. నేను మీలో సగ భాగం అయినప్పుడు మీ బాధను కూడా నేను సగం పంచుకోవాలి కదా. మీలో మీరే ఇలా బాధపడుతూ ఉంటే.. నా ప్రాణం ఎలా విలవిలలాడుతుందో మీకు తెలియదా అని అంటుంది జానకి.

janaki kalaganaledu 16 may 2022 full episode

janaki kalaganaledu 16 may 2022 full episode

ప్రతి చిన్న విషయాన్ని చెప్పే మీరు ఈ విషయాన్ని ఎందుకు చెప్పడం లేదో నాకు అర్థం కావడం లేదు. నన్ను పరాయిదాన్ని చేస్తున్నారా? లేదా మీ బాధను పంచుకునే అర్హత నాకు లేదనుకుంటున్నారా అంటుంది జానకి. దీంతో తప్పు జానకి గారు అలా మాట్లాడకండి అంటాడు రామా. ఎంత పెద్ద కష్టమైనా ఇద్దరం కలిసి దాటుదామని చెప్పారు కదా. మరి ఈ కష్టాన్ని నాతో ఎందుకు చెప్పడం లేదు రామా గారు అని అడుగుతుంది. అసలు మీ కష్టం ఏంటో చెప్పండి అని అడుగుతుంది జానకి. దీంతో తన ఒడిలో పడుకుంటాడు రామా. స్వీటు కొట్టు విషయంలో కన్నబాబు చేసిన మోసాన్ని జానకికి చెబుతాడు రామా.

చివరకు అమ్మ నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. కొట్టును చేజార్చుకునే పరిస్థితిని తీసుకొచ్చాను. ఈ విషయం గుర్తొచ్చిన ప్రతిసారీ ప్రాణం పోతోంది జానకి గారు అంటాడు రామా. ఈ బాధలో అమ్మ ముఖం కూడా చూడలేకపోతున్నాను జానకి గారు అంటాడు.

దీంతో రామా గారు.. నాకోసం మీరు సమస్యల్లో పడిపోయి.. నాకు చెప్పకుండా ఉండటం ఏదైనా ధర్మమా చెప్పండి. నా భర్త బాధపడటానికి నేను కారణమైతే.. నాకు అంతకంటే ఇంకోటి ఉంటుదా చెప్పండి అంటుంది జానకి. ఈ బాధనంతా మీరొక్కరే భరిద్దామనుకున్నారా. కరెక్ట్ కాదు రామా గారు అంటుంది జానకి.

తప్పు చేస్తే బాధపడాలి. మోసపోతే ఆ మోసాన్ని ఎలా ఎదుర్కోవాలో.. దానికి ఎలా బుద్ధి చెప్పలో ఆలోచించాలి. ఇప్పుడు మనం చేయాల్సింది బాధపడటం కాదు. ఆ కన్నబాబు కుట్రను ఎదుర్కోవడం.. అంటుంది. వాడి మోసాన్ని ఎదుర్కొందాం అంటుంది జానకి.

Janaki Kalaganaledu 16 May Today Episode :  రామాకు భరోసా ఇచ్చిన జానకి

మన స్వీటు కొట్టు వాడి గుప్పిట్లోకి వెళ్లకుండా కాపాడుకుందాం. అందుకు ఏం చేయాలో ఆలోచిద్దాం. మీరు భయపడుతున్నట్టు ఏం కాదు. మన స్వీటు కొట్టు ఎక్కడికీ పోదు. మీరు బాధపడకుండా ప్రశాంతంగా ఉండండి అంటుంది జానకి.

కట్ చేస్తే తెల్లారుతుంది. కన్నబాబు తన దగ్గర ఉన్న డబ్బులు.. డాక్యుమెంట్లను చూసి సంతోషిస్తూ ఉంటాడు. నిన్న రామచంద్రాకు ఇచ్చిన వార్నింగ్ కు వాడి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. ఇక.. స్వీటు షాపు నా సొంతం అయితే అని అనుకుంటాడు కన్నబాబు.

ఇంతలో జానకి అక్కడికి వచ్చి అద నీ భ్రమ అంటుంది జానకి. దీంతో కన్నబాబు షాక్ అవుతాడు. నీ పగటి కల.. కలలో కూడా నెరవేరదు అంటుంది జానకి. మీ ఆయన్ను నేను భయపడితే.. రాజీకి నువ్వు వచ్చావన్నమాట అంటాడు కన్నబాబు.

రాజీకి కాదు.. హెచ్చరించడానికి వచ్చాను. జ్ఞాన ప్రసుమాంబ స్వీట్ షాపు మాది. మా అత్తయ్య ప్రాణం. దాన్ని కాపాడుకుంటాం కానీ.. నీ లాంటి వాడి చేతుల్లోకి ప్రాణం పోయినా పోనివ్వం అని చెప్పడానికే వచ్చాను అని అంటుంది జానకి.

ఇంతలో జానకి కన్నబాబు ఇంటికి రావడాన్ని మల్లిక చూస్తుంది. ఏం జరుగుతుందో అని లోపలికి వస్తుంది. నీ మోసానికి బుద్ధి చెప్పకుండా కుట్రలను ఎదుర్కోకుండ చూస్తూ ఊరుకుంటానా అని కన్నబాబుకు వార్నింగ్ ఇస్తుంది జానకి.

జనాల్లో విశ్వాసం బొత్తిగా లేకుండా పోతున్నాయిరా నూకాలు. ఇలా అయితే మంచితనం ఎలా బతుకుతుందిరా అని అంటాడు కన్నబాబు. అవసరానికి డబ్బు ఇస్తే కూడా తప్పా అంటాడు కన్నబాబు. టైమ్ వేస్ట్ చేయకుండా డబ్బుతో వచ్చి ఈ కాగితాలు ఎట్టుకెళ్లు అంటాడు కన్నబాబు.

వెళ్తాను.. ఇంటికి కాదు.. కోర్టుకు అంటుంది జానకి. దీంతో కన్నబాబు షాక్ అవుతాడు. చదువు సరిగ్గా రాని నా భర్తను మోసం చేసి స్వీటు షాపును కాజేయాలని చూశావని నీ మీద కేసు పెడతాను అంటుంది జానకి. సెక్షన్ 415 ప్రకారం.. నిన్ను తీసుకెళ్లి లోపల పడేస్తారు. అప్పుడు ఇలా కాగితాలు పట్టుకొని తిరగడం కాదు.. సత్తు గిన్నెల పట్టుకొని తిరుగుతావు అంటుంది జానకి.

దీంతో.. నీకు లాలో సెక్షన్లు తెలిస్తే.. నాకు లాయర్లు తెలుసు. నీకు డైలాగులు కొట్టడం తెలిస్తే.. నాకు డబ్బులు కొట్టడం తెలుసు. నువ్వు ఎక్కడికి వెళ్లినా నాదే గెలుపు అంటాడు కన్నబాబు. గెలుస్తావో.. చిప్పకూడు తింటావో నీకే తెలుస్తుంది అంటుంది జానకి.

యుద్ధంలో నీతి నియమాలు ఉండవు. గెలవడం మాత్రమే ఉంటుంది.. అంటాడు కన్నబాబు. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా.. నా కుటుంబాన్ని టచ్ కూడా చేయలేవు. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఇప్పుడు మళ్లీ అదే జరగబోతోంది గుర్తుపెట్టుకో అంటుంది.

ఆ డబ్బులు నీ ముఖాన కొట్టి ఆ షాపు కాగితాలు తీసుకెళ్తాను. ఆ లోపు నువ్వు పిచ్చి వేషాలు వేసి తోక జాడిస్తే.. అంటుంద జానకి. దీంతో బెదిరిస్తున్నావా అంటాడు కన్నబాబు. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది జానకి. ఆ వంటోడిని చేసుకొని చాలా బాధపడుతున్నావు అంటాడు కన్నబాబు.

చేసే పనిని దైవంగా భావించే గొప్పవాడు నీలాగా మోసం చేసి బతికేవాడు కాదు. నా భర్త కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు. ఇంకో ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకో. నా భర్త చేసే పనిలో ఎంత గౌరవం ఉందో.. తను ఎంత గొప్పవాడో త్వరలోనే నిరూపిస్తాను.. చూస్తూ ఉండు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జానకి.

ఇవన్నీ మల్లిక.. ఇంటి బయట నుంచి వింటుంది. వెంటనే ఇంటికి వచ్చి మల్లిక.. రచ్చ రచ్చ చేస్తుంది. జానకిని ఈరోజో రేపో పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు అని అంటుంది. అసలేం జరిగిందో చెప్పు అని జానకిని అడుగుతుంది జ్ఞానాంబ. నువ్వు కన్నబాబు వాళ్ల ఇంటికి వెళ్లి వాడితో గొడవపడ్డావా అని ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది