Janaki Kalaganaledu 19 August 2022 Episode అఖిల్ ,జెస్సి లా ప్రేమ విషయం తెలిసిన జానకి ఏం చేస్తుంది…!

Janaki Kalaganaledu 19 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగనలేదు. ఈ సీరియల్ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఎపిసోడ్ 370 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… జానకి ముడుపు కట్టడానికి వచ్చి పెళ్లితో ఆగిపోయింది అనుకున్న నా కలని నెరవేర్చావు తల్లి. అలాగే ఇప్పుడు మా అత్తయ్య కల కూడా నెరవేరేలా చెయ్యి తల్లి అని మొక్కుకొని ఆ మడుపుని కడుతుంది. అదంతా రామ అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు. రామ అక్కడికి వచ్చి జానకిని ఎత్తుకొని ముడుపు కట్టిస్తాడు. అప్పుడు జానకి రామ చేయి పట్టుకుని నేను అంటూ ఉన్నానంటే మీరు నాతో ఉన్నారు. మీరు నా ప్రతి అడుగులోనూ నా వెనకే ఉండి నన్ను గెలిపిస్తూ వస్తున్నారు. మీరు నా భర్త కావడం నా అదృష్టం. అని సంతోషంతో ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే జెసి సాంప్రదాయంగా రెడీ అయి గుడికి అఖిల్ వాళ్ళ ఫ్యామిలీ ని పరిచయం చేసుకోవాలి అని వచ్చి అఖిల్ కి ఫోన్ చేస్తుంది. అప్పుడు అఖిల్ నేను వన్ అవర్ లో వస్తాను అని చెప్తాడు.

అప్పుడు జెస్సి నువ్వు రావాల్సిన అవసరం లేదు నేనే గుడికి వచ్చాను అని చెప్తుంది. అప్పుడు అఖిల్ తన దగ్గరికి వెళ్లి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు.. ఇక్కడి నుంచి వెళుదువు గాని అని అంటాడు. అప్పుడు జెస్సి ఎన్నిసార్లు మీ ఫ్యామిలీని పరిచయం చేయమన్న చేయట్లేదు. ఇప్పుడు వెళ్దాం పద అని అంటుంది. అప్పుడు అఖిల్ ఇప్పుడు కాదు ఒకరోజు పరిచయం చేస్తాను అని జెస్సిని కన్విన్ చేస్తూ ఉంటాడు. అంతలో జానకి వాళ్ళిద్దర్నీ చూస్తుంది. అప్పుడు అఖిల్ కూడా జానకిని చూస్తాడు. అక్కడినుంచి అఖిల్ వెళ్ళిపోతాడు. అప్పుడు జానకి జెస్సి దగ్గరికి వచ్చి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. అప్పుడు జెస్సి నేను నా బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాను. అని అఖిల్ పేరు చెప్పి జరిగిందంతా చెప్పేస్తుంది. అప్పుడు జ్ఞానాంబ ఆ జెస్సిని చూసి వాళ్ళిద్దరికీ జరిగిన ఘర్షణ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు జ్ఞానం జానకిని గట్టిగా పిలుస్తుంది. నువ్వు ఎవరితో పడితే వాళ్లతో మాట్లాడటమేనా పద ఇక్కడి నుంచి అని అంటుంది. అప్పుడు జానకి తను నా ఫ్రెండ్ అని చెప్తుంది. నువ్వు స్నేహం చేసేటప్పుడు ఎవరు ఎలాంటివారో నువ్వు తెలుసుకొని స్నేహం చేయాలి అని అంటుంది. తను చాలా మంచిది అని జానకి అంటుంది. అప్పుడు జ్ఞానంబ ఈ అమ్మాయి అహంకారానికి బట్టలు వేసినట్లుగా ఉంటుంది అని చెప్పి జానకిని తీసుకెళ్తుంది. అఖిల్ అని తనముందే పిలుస్తుంది. అప్పుడు జెస్సి…

janaki kalaganaledu 19 august 2022 full episode

అంటే అఖిల్ నేను గొడవ పడినా ఆవిడ కొడుకా అని అనుకుంటుంది. కట్ చేస్తే అఖిల్ ఈ జెస్సి ఏం చెప్పిందో ఏంటో వదినకి అని కంగారుపడుతూ ఉంటాడు. అంతలో అక్కడికి జానకి వస్తుంది. అఖిల్ ని పిలిచి ఏ విషయం గురించి నువ్వు కంగారు పడుతున్నావు జెస్సి గురించేనా అని అంటుంది. అదేంటో వదిన నేను తన గురించి ఎందుకు కంగారు పడతాను అని అంటాడు. అఖిల్ మర్యాదగా మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో చెప్పు అని అంటుంది. అప్పుడు అఖిల్ ఏదో సరదాకి చెప్పు ఉంటుంది వదిన అని అంటాడు అఖిల్. మీ అమ్మగారి గురించి తను సాంప్రదాయాన్ని ఎలా పాటిస్తుందో నీకు తెలుసు కదా… ఏ విషయాన్ని దాచి పెట్టకుండా చెప్పు అని అంటుంది. అసలు అలాంటిదేం లేదు వదిన అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జానకి మాత్రం వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి రామ వస్తాడు. ఏంటండీ జానకి గారు ఆలోచిస్తున్నారు అని అంటాడు. అప్పుడు ఏం లేదండి అని అంటుంది.

మీరు వెళ్లి పడుకోండి మీరు రేపు మళ్లీ కొట్టుకు వెళ్లాలి అని అంటుంది. అప్పుడు రామ మీరు మాత్రం రేపు చదువుకోడానికి వెళ్లారా.. మీకు నిద్ర సరిపోతుందా .మీరు ఏమి ఆలోచించకుండా చదువుకోండి నేను ఇక్కడే ఉంటాను అని అంటాడు. కానీ జెసి, అఖిల్ వాళ్ళ గురించి జానకి ఆలోచిస్తూ ఉంటుంది. రామ అక్కడే సోఫాలో నిద్రపోతూ ఉంటారు. జానకి తనను చూసి సంతోష పడిపోతూ ఉంటుంది. అంతలో అక్కడికి జ్ఞానాంబ వచ్చి రామాను చూసి జానకిని నేను భర్త సంతోషానికి నీ చదువు అడ్డు కాకూడదు అని చెప్పిన కానీ రామ నీ పక్కనే ఉంచుకొని కూడా తనని పట్టించుకోవడం లేదు అని జ్ఞానంబ అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

Recent Posts

Healthy Street Food : ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది… అదేనండి…స్ట్రీట్ ఫుడ్ వీటి రూటే సపరేట్…?

Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…

8 minutes ago

Lucky Bhaskar Sequel : ల‌క్కీ భాస్క‌ర్ సీక్వెల్ క‌న్‌ఫాం చేసిన ద‌ర్శ‌కుడు.. ఎలా ఉంటుందంటే..!

Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…

1 hour ago

Jaggery Tea : వర్షాకాలంలో ఈ టీ తాగారంటే… రోజు ఇదే కావాలంటారు… దీని లాభాలు మిరాకిలే…?

Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…

2 hours ago

Bonalu In Telangana : బోనాల పండుగలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి… అవేంటో తెలుసా…?

Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…

3 hours ago

Poco M6 Plus : రూ.10 వేల ధరలో పోకో M6 Plus స్మార్ట్‌ఫోన్‌

Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…

12 hours ago

Atchannaidu : జగన్ ప్రతిపక్ష నేత కాదు.. జస్ట్ ఎమ్మెల్యే అంతే : అచ్చెన్నాయుడు.. వీడియో

Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…

13 hours ago

Ration : రేషన్ పంపిణీ కొత్త టెక్నాల‌జీ.. ఇక‌పై గంటల తరబడి వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేదు

Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…

14 hours ago

Nayanthara : నయనతార – విఘ్నేష్ విడాకులు తీసుకుంటున్నారా..? క్లారిటీ ఇది చాలు..!

Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…

15 hours ago