Janaki Kalaganaledu 20 April Today Episode : యోగికి షాకిచ్చిన జ్ఞానాంబ.. గుడిలోనే అందరి ముందు రామా, జానకి విషయంలో జ్ఞానాంబ షాకింగ్ నిర్ణయం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu 20 April Today Episode : యోగికి షాకిచ్చిన జ్ఞానాంబ.. గుడిలోనే అందరి ముందు రామా, జానకి విషయంలో జ్ఞానాంబ షాకింగ్ నిర్ణయం

 Authored By gatla | The Telugu News | Updated on :20 April 2022,11:30 am

Janaki Kalaganaledu 20 April Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు జానకి కలగనలేదు 20 ఏప్రిల్ 2022, 283 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నీ పెద్ద కూతురును బయటికి తరిమేసి.. ఇక్కడ మాత్రం ఒక్కొక్కరు ఎంత బాగా నటిస్తున్నారు. అస్సలు ఎవ్వరూ తగ్గట్లేదుగా అని సునంద అందరి ముందు అంటుంది. దీంతో చూడండి.. మా అత్తయ్య గారు మా ఇంట్లో నుంచి పంపించలేదు. మేం ఎప్పుడూ విడిపోం.. విడిపోలేదు కూడా. మేము కలిసే ఉంటాం అంటుంది జానకి. తెలిసీ తెలియక మాట్లాడితే బాగుండదు అని జానకి అంటుంది.

janaki kalaganaledu 20 april 2022 full episode

janaki kalaganaledu 20 april 2022 full episode

మీ ఇంటి ముందు గుడిసె ఎందుకు వేశారు. ఆ గుడిసెలో నువ్వు, మీ ఆయన ఎందుకు ఉన్నట్టు అని అడుగుతుంది సునంద. దీంతో అందులో ఉంటే విడిపోయినట్టేనా. ఎండాకాలం అని అక్కడ గాలి బాగా వస్తుందని వేసుకున్నాం.. పది మందిలో అల్లరి చేస్తారా అని జానకి, రామా అంటారు. మా అత్తయ్య గారి మంచితనం ఏంటో ఈ ఊరి వారందరికీ తెలుసు అంటుంది జానకి. మరి దేవత లాంటి అత్తయ్య గారు మమ్మల్ని ఎందుకు ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారు అని అంటుంది జానకి.

ఇంతలో యోగి వస్తాడు. ఎందుకు జాను.. అలా వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నావు అంటాడు యోగి. ఎందుకు జాను.. జరిగిన విషయాలను, నిజాలను దాచిపెట్టి నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అంటాడు యోగి. దీంతో అన్నయ్య నువ్వెందుకు వచ్చావు. ముందు ఇక్కడి నుంచి వెళ్లిపో అంటుంది జానకి.

దీంతో వెళ్లిపోవడానికి రాలేదు. నిన్ను తీసుకెళ్లడానికి వచ్చాను అంటాడు యోగి. నేను ఈ నిర్ణయం తీసుకుంది నా చెల్లెలు ప్రాణాలకు ఏమవుతుందోనని అంటాడు యోగి. ఆరోజు నువ్వు బస్సు ప్రమాదంలో బయట పడ్డావని శ్రావణి చెప్పింది. ఆ తర్వాత నీకు ఇంకేమన్నా జరిగితే.. నేను బతకలేను అంటాడు యోగి.

పిల్లలు అన్నాక తెలిసో తెలియకో తప్పు చేస్తారు. మీ అత్తయ్య గారు మాత్రం నిన్ను ఇంట్లో నుంచి పంపించేయడమే పరిష్కారం అని అనుకుంటున్నారు.. అంటాడు యోగి. మా కుటుంబ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు.. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో అంటుంది జానకి.

నీ కుటుంబమా.. అంటే వీళ్లే నీ కుటుంబమా. నీ అన్నయ్య నీకు ఏం కాడా.. అని అంటాడు యోగి. ఒకవేళ అత్తారింట్లో నీకేదైనా అయితే.. నేను జీవితాంతం పశ్చాతాపంతో బతకాల్సిందే.. అంటాడు యోగి. నువ్వు అనుకుంటున్నట్టు అలా ఏం జరగదు అని అంటాడు గోవిందరాజు. దీంతో అలా జరగదు అని గ్యారెంటీ ఇవ్వగలరా అని అడుగుతాడు యోగి.

Janaki Kalaganaledu 20 April Today Episode : నా కోడులు చేయి వదులు అని యోగిని బెదిరించిన జ్ఞానాంబ

మిమ్మల్ని ఇంకా ఇంట్లోకే రానివ్వలేదు. మరి మరోసారి బయటికి పంపించరని గ్యారెంటీ ఏంటి అని నేను అడగడం ఏంటి అని అంటాడు యోగి. ఏంటి జ్ఞానాంబ మరి ఇప్పుడు ఏమంటావు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కుటుంబం అంతా కలిసి మెలిసి ఉండాలని నీతులు చెబుతుంటావు కదా. మరి నువ్వే ఆ నీతి పాటించకపోతే ఏమనాలి. ఇదేనా నీ పెద్దరికం అంటుంది సునంద.

ఎదుటి వాళ్లను వేలెత్తి చూపేముందు.. మనమేంటో తెలుసుకుంటే బాగుంటుంది. పదరా కన్న.. అంటుంది సునంద. ఆ తర్వాత బావ గారితో నీకు తర్వాత విడాకులు ఇప్పిస్తాను. పదా వెళ్దాం అంటాడు యోగి. విడాకుల కోసం లాయర్ నోటీసులు పంపిద్దాం పదా అంటాడు యోగి.

దీంతో రామా షాక్ అవుతాడు. బావ గారు.. ఆగండి.. ఏంటండి ఇది.. అన్యోన్యంగా ప్రాణానికి ప్రాణంగా బతుకుతున్న మాకు విడాకులు ఇప్పించడం ఏంటి అంటాడు రామా. నీ భార్య కళ్లముందే కష్టాలు పడటం అన్యోన్యమా అంటాడు యోగి. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ ఉండటం అన్యోన్యమా అంటాడు యోగి.

ఆ పరిస్థితులన్నీ త్వరలోనే పోతాయండి అంటాడు రామా. కానీ.. యోగి మాత్రం వినడు. దీంతో అందరూ జ్ఞానాంబ మాట కోసం ఎదురు చూస్తుంటారు. దీంతో రామాను తీసుకొని జ్ఞానాంబ ఆలయం బయటకు తీసుకొస్తుంది. చేయి వదులు.. నా కోడలు చేయి వదులు అని యోగిని బెదిరిస్తుంది జ్ఞానాంబ.

దీంతో యోగి తన చేయి వదులుతాడు. నా కోడలును తీసుకెళ్లడానికి నువ్వెవరివి. తనకు అన్నయ్యవు అయినా సరే ఆ హక్కు నీకు లేదు. నా కోడలు ఎప్పుడూ నాతోనే ఉంటుంది. మాతోనే ఉంటుంది. నా కోడలును మా ఇంట్లో నుంచి దూరం చేయాలని చూసేవాడు సాక్షాత్తూ సొంత అన్న అయినా సరే క్షమించను అంటుంది జ్ఞానాంబ.

ఎలాంటి అవాంతరాలు ఎదురైనా సరే.. ఆ సీతారాములు కలిసే ఉంటారు. ఈ జానకిరాములు కూడా అంతే అంటుంది జ్ఞానాంబ. దీంతో అందరూ సంతోషిస్తారు. ఇద్దరి చేతులను కలుపుతుంది జ్ఞానాంబ. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి వెళ్తారు అందరూ.

రామా, జానకి ఇంట్లో అడుగు పెట్టబోతాడు. ఇంతలో ఆగండి అంటుంది జ్ఞానాంబ. దీంతో అడుగు పెట్టకుండా వెనక్కి జరుగుతారు రామా, జానకి. చికిత.. దిష్టి తీయాలి వెళ్లి ఎర్ర నీళ్లు తీసుకురా అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత జ్ఞానాంబ వాళ్లకు దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement
WhatsApp Group Join Now

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది