Janaki Kalaganaledu 20 Sep Today Episode : వైజయంతి కూతురును ప్రాణాలకు తెగించి కాపాడిన జానకి.. జ్ఞానాంబకు జానకి చదువు విషయం చెప్పేందుకు పిలిచిన వైజయంతి.. చివరకు ఏం జరుగుతుంది?
Janaki Kalaganaledu 20 Sep Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 20 సెప్టెంబర్ 2021, 131 లేటెస్ట్ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
వైజయంతి కూతురు కష్టాల్లో ఉందని తెలుసుకున్న జానకి.. ఎందుకు ఏడుస్తుంది అని అనుకుంటుంది. రోడ్డు మీద ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది అనుకొని.. తన దగ్గరికి వెళ్తుంది జానకి. ఏమైంది.. ఏంటి ప్రాబ్లమ్ అంటే ఏం లేదు అంటుంది. ఒకవైపు ఫోన్ లో బతిమిలాడుతూ ఏడుస్తున్నావు.. ఏమైంది చెప్పు అని అడుగుతుంది జానకి. ముక్కు మొహం తెలియని వ్యక్తికి చెబితే.. ఏం సమస్య వస్తుందని భయపడుతున్నావా? నేను నీ ఫ్రెండ్ అనుకో.. ఏంటో చెప్పు అంటుంది జానకి. కానీ.. తను వైజయంతి కూతురు అని కూడా జానకికి తెలియదు.

Janaki kalaganaledu 20 september 2021 monday episode 131 highlights
రెండు రోజుల క్రితం నా ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో ఓ వెదవ నాకు తెలియకుండా ఫోటోలు తీసి అసభ్యంగా మార్ఫింగ్ చేసి.. ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నాడు. నా ఫోటోలు ఇంటర్నెట్ లో పెడతాడట. ఇంటికి రమ్మంటున్నాడు.. అంటూ ఏడుస్తుంది వైజయంతి కూతురు.
వాడికి ఫోన్ చేసి నువ్వు వస్తున్నావని చెప్పు.. అని అంటుంది జానకి. ఫోన్ చేసి అడ్రస్ అడుగు అంటుంది. దీంతో ఫోన్ చేస్తుంది. అడ్రస్ చెప్పగానే పది నిమిషాల్లో వస్తున్నాను అని చెబుతుంది వైజయంతి కూతురు. ఇంతలో రామా తెగ టెన్షన్ పడుతుంటాడు. జానకి ఇంకా రాలేదు ఏంటని తెగ ఆలోచిస్తుంటాడు.
కట్ చేస్తే.. జ్ఞానాంబ కొట్టు దగ్గరికి వస్తుంది. ఒక కిలో పూత రేకులు కట్టి ఇవ్వు అంటుంది జ్ఞానాంబ. దీంతో రామా షాక్ అవుతాడు. రామా.. ఏమైంది అంటాడు. ఒక్కసారిగా అలా అయిపోయావు ఏంటి.. అంత కంగారు పడుతున్నావు అంటుంది. ఏం లేదు అమ్మా అంటాడు. వైజయంతికి ఇంటికి వెళ్తున్నా.. ఒక ముఖ్య విషయం చెప్పాలి.. ఇంటికి రా.. అన్నది అని రామాతో అంటుంది జ్ఞానాంబ. తను వెళ్లిపోగానే.. జానకికి ఫోన్ చేస్తాడు రామా.

Janaki kalaganaledu 20 september 2021 monday episode 131 highlights
జానకి గారు ఎక్కడున్నారు.. అనగానే.. ఏమండి ముందు మీరు అర్జెంట్ గా నేను చెప్పిన అడ్రస్ కు రండి.. అంటుంది. వెంటనే వచ్చేయండి అంటుంది. జ్ఞానాంబ.. వైజయంతి ఇంటికి వెళ్లింది అని చెప్పినా కూడా పట్టించుకోకుండా ముందు అక్కడికి రండి.. అని చెబుతుంది.
Janaki Kalaganaledu 20 Sep Today Episode : ఆ ప్రబుద్ధుడికి బుద్ధి చెప్పిన జానకి
అడ్రస్ తెలుసుకొని అక్కడికి వస్తుంది ఆ అమ్మాయి. ఇంతలో అక్కడికి జానకి వచ్చి.. తన కళ్లలో ఏదో కొడుతుంది. అక్కడ పడేస్తుంది. అక్కడే ఉన్న ఓ గాసు సీసాను తీసుకొని.. ఏంట్రా ఇది.. నిన్నే పెన్ డ్రైవ్ ఎక్కడ.. అని అడుగుతుంది. అక్కడే ఉంది తీసుకో అని చెబుతాడు. దీంతో స్వీటీ వెళ్లి వెంటనే పెన్ డ్రైవ్ తీసుకుంటుంది. ల్యాప్ టాప్ లో ఉన్న డేటాను కూడా డిలీట్ చేసి.. పెన్ డ్రైవ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా.. ఇంతలో ఆ వ్యక్తి వెనక నుంచి కర్ర పట్టుకొని వచ్చి తనను కొట్టబోతాడు. తను వెంటనే వెనక్కి వంగి అదే కర్రను పట్టుకొని వాడిని చితకబాదుతుంది. ఇంతలోనే అక్కడికి రామా వస్తాడు.

Janaki kalaganaledu 20 september 2021 monday episode 131 highlights
జరిగిన విషయం రామాకు చెబుతుంది జానకి. తను వైజయంతి కూతురు అని చెబుతుంది. ఓవైపు వైజయంతి ఇంటికి జ్ఞానాంబ వెళ్లిందని రామా చెబుతాడు. ఇప్పటికే అత్తయ్య గారితో ఆవిడ చెప్పేసి ఉంటారు. ఏం చేద్దాం అని అడుగుతుంది.
కట్ చేస్తే.. వైజయంతి జానకి ఫోటో పట్టుకొని జ్ఞానాంబ కోసం ఎదురు చూస్తుంటుంది. ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వస్తుంది. పూత రేకులు తెచ్చి తనకు ఇస్తుంది. స్వీట్స్ తినే సమయం కాదిది. అవును.. ఏంటి ఉన్నపళంగా రమ్మని చెప్పావు. చాలా ముఖ్యమైన విషయం ఏదో చెప్పాలి అన్నావు. ఇప్పటికిప్పుడు నాతో మాట్లాడే ముఖ్యమైన విషయం ఏంటి.. అని జ్ఞానాంబ అడుగుతుంది.

Janaki kalaganaledu 20 september 2021 monday episode 131 highlights
కట్ చేస్తే.. అత్తయ్య గారు వచ్చి ముందే నిలదీయడం కంటే నేనే క్షమాపణ అడుగుతాడు అని అంటుంది జానకి. ఇంతలో కొట్టు దగ్గరికి జ్ఞానాంబ వస్తుంది. అత్తయ్య గారు నన్ను క్షమించండి. మీదగ్గర ఒక నిజం దాచిపెట్టాను.. అంటుంది. దీంతో నాకు తెలుసు అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాలి.

Janaki kalaganaledu 20 september 2021 monday episode 131 highlights