Janaki Kalaganaledu 22 March Today Episode : జానకిని మెచ్చుకున్న మైరావతి.. రామాతో మాట్లాడటం మానేసిన జ్ఞానాంబ… దీంతో రామా షాకింగ్ నిర్ణయం
Janaki Kalaganaledu 22 March Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 మార్చి 2022, మంగళవారం ఎపిసోడ్ 262 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు చేసింది మామూలు తప్పు కాదు. నీకు ఏ శిక్ష వేసినా తక్కువే. అందుకే నాకు నేను శిక్ష వేసుకుంటున్నాను అని జానకితో చెబుతుంది మైరావతి. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు బాధపడుతున్నాను అంటుంది మైరావతి. 22 ఏళ్లు లేని నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి అన్నాను. కానీ.. కుటుంబం అంటే ఎంత బాధ్యత ఉందో తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు తెలుసుకున్నాను అంటుంది మైరావతి.

janaki kalaganaledu 22 march 2022 full episode
శభాష్.. మనవరాలా.. శభాష్ నువ్వు నాకు బ్రహ్మండంగా నచ్చావు అంటుంది. ఎప్పుడూ అమ్మకు అబద్ధం చెప్పని నా రామా.. అమ్మకు అబద్ధం చెప్పడమే కాదు.. నా మనవరాలితో పాటు.. నా కోడలను కూడా కాపాడారు. శభాష్ అంటుంది. ఒరేయ్ రామయ్య.. ఇటురా అంటుంది. చాలా సంతోషిస్తుంది మైరావతి. జానకి, రామాను తీసుకొని కారులో బయలుదేరుతుంది మైరావతి. కట్ చేస్తే ఖార్ఖానాలో అప్పలు చేస్తూ ఉంటుంది జ్ఞానాంబ. ఇంతలో మైరావతి.. జానకి, రామాను తీసుకొని వస్తుంది. మా అత్త అబద్ధం చెబితేనే ఊరుకోదు. అట్టాంటిది ఇంత పెద్ద మోసం చేసిన వ్యక్తిని క్షమించడం ఏంటి అని అనుకుంటున్నావా. జానకి చేసిన తప్పుకు తనకు శిక్ష వేయకుండా ఇట్టా వెంట పట్టుకొని తీసుకొచ్చావేంటి అని అనుకుంటున్నావా అంటుంది.
ఒకప్పుడు నాకు జానకి అస్సలు నచ్చలేదు. రామయ్యకు ఈ పిల్లకు తెగతెంపులు చేయమన్నా. మూడు సార్లు అలా చెప్పా. ఒక్కసారి కూడా నువ్వు ఆ మాట వినలేదు. నా పెద్ద కోడలుకు మంచి చేయడం తప్ప చెడు చేయడం తెలియదు అన్నావు. ఇవాళ నీ కోడలు గురించి నీకు జ్ఞానోదయం అయింది.. అంటుంది.
అందుకే.. ఆ శిక్ష ఏదో నీ కళ్ల ముందే వేద్దామని వీళ్లను నీ దగ్గరికి తీసుకొచ్చాను అంటుంది మైరావతి. ఇంతలో బూంది మాడిపోతుందని వెళ్లి దాన్ని తీయమంటుంది రామాతో. జానకిని కూడా వెళ్లి బోందీ తీయమంటుంది. చెబితే అర్థం కాదా. వస్తువులు పాడైపోతే మళ్లీ తిరిగిరావు అంటుంది.
మనుషులు కూడా అంతే. ఒకసారి పోగొట్టుకుంటే తిరిగిరారు అంటుంది మైరావతి. జ్ఞానాంబ.. నేను వీళ్లకు వేయబోయే శిక్ష ఏంటో నీకు ఈపాటికే అర్థం అయి ఉంటుంది అంటుంది మైరావతి. మీరేనా ఇలా మాట్లాడేది అని షాక్ అవుతుంది జ్ఞానాంబ.
Janaki Kalaganaledu 22 March Today Episode : నన్ను వీళ్లు పిచ్చిదాన్ని చేశారని బాధపడ్డ జ్ఞానాంబ
ఎలా క్షమించగలరు వీళ్లను. క్షమించడానికి వీళ్లు చేసింది తప్పు కాదు.. మోసం అంటుంది జ్ఞానాంబ. నమ్మించి వెన్నుపోటు పొడిచారు అంటుంది. కన్నకూతురు జీవితం విషయంలో ఎన్ని భయాలు ఉంటాయో అన్ని జాగ్రత్తలు ఉంటాయి.. అంటుంది జ్ఞానాంబ.
నా కూతురు మీద నాకు ఉన్న ప్రేమను అడ్డు పెట్టుకొని నన్ను పిచ్చిదాన్ని చేశారు వీళ్లు అంటుంది. దీంతో నువ్వు నిజంగా పిచ్చిదానివి కాకూడదని అలా చేశారు అంటుంది మైరావతి. నీకు కడుపు కోత ఉండకూడదనే ఈ పని చేశారు వాళ్లు. ఈ పెళ్లి చేయాలనుకున్నారు అంటుంది మైరావతి.
వీళ్లు ఇలా చేయకపోయి ఉంటే.. నీ కూతురు శవం దగ్గర గుండె పగిలేలా ఏడ్చేదానివి. కూతురు పోతే.. నువ్వు బతికి ఉండేదానివా. అప్పుడు ఈ ఇంటి పరిస్థితి ఏమయ్యేదో ఒకసారి ఆలోచించు అంటుంది మైరావతి. జ్ఞానాంబకు ఎంతో సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది మైరావతి.
వెన్నెలకు ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తే జానకికి ఏమొస్తుంది. తన జీవితాన్ని కష్టాల్లో పడేసుకోవడం తప్ప అందులో తన స్వార్థం ఏముంది. నీ కూతురు ప్రాణాలను, నీ ఇంటిని నిలబెట్టారని ఒక్కసారైనా ఆలోచించావా. వీళ్లిద్దరూ లేకపోతే నీ ఇల్లు చీకటి అయి ఉండేది.. అంటుంది మైరావతి.
ఆశ, స్వార్థం లేకపోతే ఆ మనిషిని దేవుడు అంటారు. నీ కోడలు నిజంగా అలాంటిదే అంటుంది మైరావతి. నిన్ను గెలిపించడం అంటే నువ్వు చెప్పినట్టు నడుచుకోవడం కాదు. నీ కుటుంబాన్ని కాపాడుకోవడం. ఈరోజు వాళ్లు చేసింది అదే అంటుంది మైరావతి.
అంత చెప్పినా కూడా ఏం మాట్లాడుకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. రామా, జానకి ఇంట్లోకి అడుగుపెడతారు. ఇంతలో మగ పెళ్లి వాళ్లు జ్ఞానాంబ ఇంటికి వస్తారు. మీ పెద్ద కోడలు జానకిని పిలవండి అంటుంది పెళ్లికొడుకు తల్లి.
తన నాటకంతో మా పరువు తీసింది. మా అందరినీ తన మాటలతో బోల్తా కొట్టించింది అంటుంది. ఇంతలో జానకి బయటికి వస్తుంది. నువ్వు మాతో చెప్పిందేంటి.. ఇప్పుడు జరిగిందేంటి అని అంటుంది. మా అబ్బాయి మీ వెన్నెల ప్రేమించుకున్నారని.. వాళ్లకు పెళ్లి చేయకపోతే చనిపోతారని చెప్పావు.
మీ అత్త ప్రేమ పెళ్లికి ఒప్పుకోదని చెప్పావు. పెద్దలు కుదిర్చిన పెళ్లిగా చేద్దామని చెప్పావు అంటారు. ఆ తర్వాత రామాతో పూర్తిగా మాట్లాడటమే మానేసింది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.