
janaki kalaganaledu 23 may 2022 full episode
Janaki Kalaganaledu 23 May Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 మే 2022, సోమవారం ఎపిసోడ్ 306 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంకో పది నిమిషాల్లో లూసీ దగ్గరికి ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంటుంది జానకి. లూసీ వెళ్లిపోతే రామా గారు పోటీల్లో పాల్గొనే బంగారు అవకాశం తప్పిపోతుంది. రామా గారిని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్లి అప్లికేషన్ పూర్తి చేయించాలని రామా కోసం వెతుకుతుంది. రామా అక్కడ పూల దండలు కడుతూ ఉంటాడు. అప్పుడే నీలావతి వస్తుంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు.. అబ్బాయి అంటుంది. ఎంతైనా మీ అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు నిండు నూరేళ్లు ఉండాలని నీకోసం ఆయుష్షు హోమం చేయిస్తోంది అంటుంది. తనతో మాట్లాడుదాం అని అనుకునే లోపే.. నీలావతి టైమ్ వేస్ట్ చేస్తుంటే.. తనను వంటల దగ్గరికి పంపించేసి.. ఒకసారి ఇలా రండి అంటుంది జానకి.
janaki kalaganaledu 23 may 2022 full episode
మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని రామాను లోపలికి తీసుకెళ్లడం నీలావతి చూస్తుంది. ఇంత హడావుడి ఏంటి.. విషయం ఏంటో తెలుసుకొని మల్లికకు చెబితే మనకు పట్టుచీర పక్కా అని అనుకుంటుంది నీలావతి. ఏమైంది అని అడుగుతాడు. దీంతో లూసీ ఫోన్ చేసింది అని చెబుతుంది. తను హైదరాబాద్ కు వెళ్లడానికి రెడీ గా ఉంది. మనకోసం వెయిట్ చేస్తోంది అని చెబుతుంది జానకి. బెస్ట్ చెఫ్ పోటీలకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ తన దగ్గర ఉందట. మనం వెళ్లి అప్లికేషన్ ఫిల్ చేస్తే హైదరాబాద్ లో సబ్మిట్ చేస్తా అని చెప్పింది. మనం ఇప్పుడు త్వరగా వెళ్లి అప్లికేషన్ ఫిల్ చేసి ఇవ్వాలి అంటుంది జానకి. వాళ్ల డోర్ వద్దకు వెళ్లి ఏం జరుగుతోందో వినాలని చూస్తుంది నీలావతి.
ఈ సమయంలో ఎలా కుదురుతుంది అని అంటాడు రామా. నాకు కూడా ఈ విషయంలో ఏం చేయాలో అర్థం కావడం లేదు రామా గారు అంటుంది జానకి. మనం ఇప్పుడు వెళ్లకపోతే లూసీ వెళ్లిపోతుంది. అప్లికేషన్ పూర్తి చేయకపోతే పోటీలో కూడా పాల్గొనలేము అంటుంది. బయటికి నుంచి నీలావతి ఎంత వినాలని ట్రై చేసినా తనకు వినిపించదు.
ఇటువైపు పూజ అవసరం.. అటువైపు అప్లికేషన్ పూర్తి చేసి ఇవ్వడం అంతకన్నా అవసరం అంటుంది. తర్వాత జ్ఞానాంబ రామా, జానకి ఎక్కడున్నారు అని అడుగుతుంది. దీంతో వాళ్లు రూమ్ లో ఉన్నారని చెబుతుంది నీలావతి. దీంతో వాళ్ల రూమ్ దగ్గరికి వెళ్తుంది జ్ఞానాంబ.
డోర్ తెరిచేలోపే జానకి జారి పడబోతుంటే పట్టుకుంటాడు రామా. అప్పుడే జ్ఞానాంబ చూసి షాక్ అవుతుంది. వాళ్లను ఆ పొజిషన్ లో చూసి షాక్ అవుతుంది. నా మాటంటే అసలు లెక్కలేకుండా పోయిందా నీకు అంటుంది జ్ఞానాంబ. నీ ప్రవర్తన అలాగే ఉంది కదా అంటుంది.
పూజ అయిపోయే వరకు ఎంత నియమ నిష్టలతో ఉండాలో నీకు చిలక్కు చెప్పినట్టు చెప్పాను అంటుంది జ్ఞానాంబ. నువ్వు ఇలా ప్రవర్తిస్తావా అంటూ సీరియస్ అవుతుంది. ఇందులో జానకి గారి తప్పేం లేదు అంటాడు రామా. తను కాలు మడత పడి పడబోతుంటే నేను పట్టుకున్నాను అంటాడు రామా.
చూడు రామా.. నువ్వు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని నీకోసం చేయిస్తున్న ఆయుష్షు పూజ ఇది. ఈ పూజను చాలా పవిత్రంగా చేయాలి. మీరిద్దరూ ఇలా దగ్గర దగ్గరగా ఉండకూడదు. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం రేపు ఉదయం వరకు మీరు ఇంట్లోనే ఉండాలని ఎట్టి పరిస్థితుల్లోనూ గుమ్మం దాటకూడదని పూజారి గారు చెప్పారు అంటుంది జ్ఞానాంబ.
అలా పాటిస్తేనే ఆ పూజ ఫలితం దక్కుతుందని పూజారి గారు అన్నారు అంటుంది జ్ఞానాంబ. జానకి.. ఈ విషయం ప్రత్యేకంగా నీకే చెబుతున్నాను అంటుంది జ్ఞానాంబ. ఎందుకో తెలుసు కదా. రాత్రుళ్లు.. సరదాలు.. షికార్లు అంటూ వాడిని బయటికి తీసుకెళ్తావు కదా.
ఆ అలవాటు ప్రకారమే.. ఈరోజు కూడా వాడిని బయటికి తీసుకెళ్లి పూజాఫలం నా కొడుకుకు దక్కకుండా చేస్తావేమోనని నాకు భయంగా ఉంది. పూజకు టైమ్ అయింది. వెళ్దాం పదండి అని వాళ్లను తీసుకెళ్తుంది. ఇదంతా నీలావతి వింటుంది. జానకిని జ్ఞానాంబ తిట్టడంతో సంతోషిస్తుంది.
ఇంతలో ఆయుష్షు పూజ ప్రారంభం అవుతుంది. కానీ.. జానకి మనసు మాత్రం లూసీ దగ్గరే ఉంటుంది. ఎలాగైనా అప్లికేషన్ నింపాలని అనుకుంటుంది. పూజారులు మంత్రాలు చెబుతున్నా.. కూడా సరిగ్గా పలకదు జానకి. దీంతో పూజారి గారు.. మంత్రోచ్చరణ సరిగ్గా చేయాలి అంటాడు.
దీంతో నీ ఆలోచన, మనసు ఎక్కడుంది అంటుంది జ్ఞానాంబ. దీంతో క్షమించండి అత్తయ్య గారు అంటుంది జానకి. తర్వాత పూజ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Amaravati : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజధాని అంశంపై కేంద్రం నుంచి కీలక సంకేతాలు అందుతున్నాయి. సుదీర్ఘ కాలంగా అమరావతిని…
ChatGPT : ఏఐ టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్న తరుణంలో, ఓపెన్‌ఏఐ మరో కీలక అడుగు వేసింది. చాట్‌బాట్‌లను ఎక్కువ…
Toll Free Number : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థిక భద్రతనిచ్చే ప్రధాన పథకం…
Ys jagan : వైసీపీ YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు…
Mega Family : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చాలా…
USA-Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎవరైనా ప్రయత్నించి…
MLA Turns Delivery Boy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్…
KBR Park : హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం…
This website uses cookies.