
intinti gruhalakshmi 23 november 2021 full episode
Intinti Gruhalakshmi 23 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 నవంబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ 484 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లక్కీ అలిగి సోపాలో కూర్చుంటాడు. దీంతో అక్కడికి వచ్చిన తులసి.. లాస్య తిట్టిందని అలిగి ఉంటాడు అని అనుకుంటుంది. కానీ.. లక్కీ దగ్గరికి వెళ్తే లక్కీ మాట్లాడడు. పక్కకు తప్పుకుంటాడు. దీంతో లక్కీని సముదాయించేందుకు.. నా దగ్గర కథలు ఉన్నాయి. ఎవరైనా వింటారా? అంటుంది. చాలా మంచి కథలు చెబుతా అంటుంది. కానీ ఎవ్వరూ లేరు కదా.. అని వెళ్లబోతుంది. దీంతో ఆంటి నేను వింటాను ఆంటి అంటాడు లక్కీ.
intinti gruhalakshmi 23 november 2021 full episode
లక్కీకి తులసి కథలు చెబుతుండటం చూసిన లాస్య తట్టుకోలేకపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. లక్కీ, తులసి వాళ్ల లోకంలోనే విహరిస్తుంటారు. ఇంతలో లక్కీ అంటూ సీరియస్ అవుతుంది లాస్య. నీకేం చెప్పాను. తులసితో ఉండకూడదు.. మాట్లాడకూడదు అని చెప్పానా అంటుంది లాస్య. నేను ఇప్పుడు ఏం చేశాను లాస్య.. వాడికి కథలు చెబుతున్నాను అంతే అంటుంది తులసి. వీడికేంటి.. ఇంటిల్లిపాదికి నువ్వు కథలు చెబుతావు అంటుంది. వాడు దిగులుగా కూర్చుంటే ఓదార్చడం కోసం నేను కథలు చెబుతున్నాను అంటుంది. అయినా లాస్య వినదు. నీకు లక్కీ గురించి అవసరం లేదు అంటూ లాస్ట్ వార్నింగ్ ఇస్తుంది లాస్య.
కట్ చేస్తే.. ప్రేమ్, శృతి మధ్య సరసాలు జరుగుతాయి. ఆ తర్వాత.. ఇద్దరూ కాసేపు తులసి, నందు గురించి మాట్లాడుతుంటారు. నాన్నను నేను ఎందుకు పట్టించుకోనంటే.. ఆయన ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు అంటాడు ప్రేమ్. నీది, అంకుల్ ది చిన్నప్పటి నుంచి దెబ్బలాడుకునే తత్వమేనట కదా అని తులసి ఆంటి చెప్పింది అంటుంది శృతి.
అలాగే.. అన్ని విషయాలు చెబుతూ.. ప్రేమ్ తో సరసాలు ఆడుతుంది శృతి. ఇక ఆగలేక.. శృతిని పట్టుకొని మంచం మీదికి లాగుతాడు ప్రేమ్. అయినా కూడా గుండు సున్నా అంటుంది శృతి. దీంతో ఇద్దరూ మంచం మీద పడుకొని కాసేపు సరసాలు ఆడుకుంటారు.
కట్ చేస్తే.. లక్కీ బాధపడుతూ ఉంటాడు. నాకు డాడీ కోపమే గుర్తొస్తుంది మమ్మీ అంటాడు లక్కీ. ఆ విషయం గురించి నువ్వు మరిచిపోయి పడుకో లక్కీ అంటుంది. దీంతో డాడీని నువ్వు పెళ్లి చేసుకోకు మమ్మీ అంటాడు లక్కీ. దాని గురించి మనం తర్వాత మాట్లాడుదాం అంటుంది లాస్య.
ఉదయం లేవగానే తులసి.. లక్కీని ముద్దాడుతుంది. ఏం కావాలి అని అడగబోయి.. మళ్లీ ఎందుకు వెనక్కి ఆగిపోతుంది. లాస్య అన్నమాటలే తనకు గుర్తొస్తాయి. దీంతో తనకు ఏం చేయాలో అర్థం కాదు. ఏమైంది ఆంటి అంటే.. నువ్వు ఇక్కడ ఉండకు.. వెళ్లిపో అంటుంది తులసి.
దీంతో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఒక్కడే బాధపడుతుంటాడు. అక్కడికి వచ్చిన తులసి.. పాలు తాగావా అంటే.. లేదు ఆంటి.. మమ్మీ ఫోన్ లో బిజీగా ఉంది అంటాడు. దీంతో పాలు తీసుకొచ్చి ఇస్తుంది తులసి. లక్కీ పాలు తాగుతుండగానే.. అక్కడికి వచ్చిన లాస్య.. లక్కీ అని అరుస్తుంది. చాన్స్ దొరికితే చాలు.. నా కొడుకును వదలవా అంటూ మరోసారి సీరియస్ అవుతుంది లాస్య.
ఇంతలో నందు అక్కడికి వస్తాడు. ఏమైంది లాస్య అంటాడు. నీ మాజీ భార్య.. నన్ను బ్యాడ్ చేసి లక్కీని దగ్గరికి తీసుకుంటోంది అంటుంది. దీంతో లక్కీ జోలికి రావద్దని లాస్య చెప్పింది కదా. ఎందుకు వాడి జోలికి వెళ్తున్నవు అని అడుగుతాడు నందు. మరి.. వీడిని మీకు డాడీ అని పరిచయం చేసింది కదా మీరెందుకు పట్టించుకోవడం లేదు అని తిరిగి ప్రశ్నిస్తుంది తులసి.
లాస్య మాటలు మీరు వినరు కానీ.. నేను మాత్రం వినాలా? అని అంటుంది తులసి. తనకేమాత్రం తెలివి ఉన్నా.. బాబును మీరు దూరం ఉంచుతున్నందుకు మీమీద అరవాలి కానీ.. నామీద కాదు అంటుంది తులసి. దీంతో నందు షాక్ అవుతాడు.
కట్ చేస్తే.. నీకో గుడ్ న్యూస్ చెప్పాలి నందు. ఇంతకు ముందే పంతులు గారితో మాట్లాడాను. మన పెళ్లికి రేపు మంచి ముహూర్తం ఉందని చెప్పారు పంతులు గారు అంటుంది లాస్య. రేపే మనం పెళ్లి చేసుకుందాం అంటుంది లాస్య. దీంతో నందుతో పాటు తులసి, ఇతర కుటుంబ సభ్యులు అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.