Janaki Kalaganaledu 24 Oct Today Episode : జ్ఞానాంబ ఫ్యామిలీని కలిసిన మరో ఫ్యామిలీ.. అఖిల్, మల్లికకు కనువిప్పు కలుగుతుందా? ఇంతలో జానకికి షాక్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu 24 Oct Today Episode : జ్ఞానాంబ ఫ్యామిలీని కలిసిన మరో ఫ్యామిలీ.. అఖిల్, మల్లికకు కనువిప్పు కలుగుతుందా? ఇంతలో జానకికి షాక్

 Authored By gatla | The Telugu News | Updated on :24 October 2022,9:30 am

Janaki Kalaganaledu 24 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 అక్టోబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 416 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబ తన కోడళ్లతో కలిసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తుంది. పంతులు గారు ప్రసాదం అమ్మవారికి సమర్పించి మా కుటుంబం పేరు మీద పూజ చేయండి అంటుంది జ్ఞానాంబ. ఇంతలో పంతులు గారు నా పేరు మీద, నా భర్త పేరు మీద సపరేట్ గా పూజ చేయండి అంటుంది మల్లిక. దీంతో అందరూ షాక్ అవుతారు. పంతులు కూడా షాక్ అవుతాడు. అక్కడ ఉన్న ఊరి వాళ్ల ముందు మల్లిక అలా మాట్లాడిందేంటి అని అంతా అనుకుంటారు. అదేంటమ్మా.. మీరు ఎప్పుడూ సకుటుంబ సమేతంగా పూజ చేయించుకుంటారు కదా. ఇప్పుడు ఏంటి మీరు సపరేట్ గా పూజ చేయించుకుంటున్నారు అని అడుగుతాడు.

janaki kalaganaledu 24 october 2022 full episode

janaki kalaganaledu 24 october 2022 full episode

దీంతో మల్లిక రేపటి నుంచి మేము విడిపోతున్నాం అంటూ ఏదో చెప్పబోగా ఇంతలో జానకి.. ఆమె కడుపుతో ఉంది కదా.. కడుపులోని బిడ్డతో సహా పూజ చేయండి అని చెబుతుంది. అలాగే.. జెస్సీ కూడా కడుపుతో ఉంది. తనకు కూడా సపరేట్ గా పూజ చేయండి అంటుంది జానకి. దీంతో సరే అంటాడు పంతులు. అది కాదు పంతులు గారు నేను చెప్పేది వినండి అంటూ ఏదో చెప్పబోగా అస్సలు వినిపించుకోకుండా జానకి గంట మోగిస్తుంది. ఆ తర్వాత పూజారి పూజ చేస్తాడు. తల్లి మా కుటుంబం అంతా ఎప్పుడూ కలిసి ఉండేలా దీవించు అని మొక్కుతుంది జ్ఞానాంబ. జానకి కూడా అదే మొక్కుకుంటుంది. ఆ తర్వాత పూజ అయిపోతుంది.

పూజ అయిపోయాక అందరూ బయటికి వస్తారు. అమ్మా మల్లిక.. నోటి మాటలను అదుపులో పెట్టుకో అమ్మ. లేకపోతే నీ పరువే పోతుంది అని సలహా ఇస్తాడు గోవిందరాజు. కానీ.. మల్లిక అదేమీ పట్టించుకోదు.

ఇంతలో జ్ఞానాంబ ఫ్యామిలీకి మరో ఫ్యామిలీ ఎదురు పడుతుంది. వాళ్లంతా నమస్కారం అంటారు. బాగున్నారా అమ్మా అంటారు జ్ఞానాంబ ఫ్యామిలీని చూసి. మీ అందరినీ ఇలా చూసినా.. మీరు పాటించే ఉమ్మడి కుటుంబాన్ని తలుచుకున్నా మాకు ఎంతో సంతోషంగా, ప్రేరణగా అనిపిస్తుంది అంటారు.

మేమంతా ఇలా కలిసిమెలిసి ఉంటున్నామంటే దానికి కారణం మీరే జ్ఞానాంబ గారు అంటారు. మేము ఎప్పుడూ చెప్పే జ్ఞానాంబ గారు ఈవిడే. ముందు మీరు వెళ్లి ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. వెళ్లండి అని ఆయన తన కొడుకులకు చెబుతాడు. పిల్లలు కూడా వెళ్లి తన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు.

Janaki Kalaganaledu 24 Oct Today Episode : తమ కుటుంబం గురించి చెప్పిన ఆ కుటుంబం

అసలు వీళ్లు ఎవరు. ఈ కుటుంబం మా వల్ల కలిసి ఉండటం ఏంటి అని అనుకుంటుంది జ్ఞానాంబ. మా దృష్టిలో మీరు దేవతతో సమానం అంటారు. మా జ్ఞానం వల్ల మీరు ఏమైనా సాయం పొందారా అని అడుగుతాడు గోవిందరాజు.

దీంతో వెలకట్టలేని ఉమ్మడి కుటుంబం గురించి తెలుసుకున్నాం. మేము మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాం అని అంటారు వాళ్లు. ఉమ్మడి కుటుంబం ఎంత గొప్పదో.. కలసి మెలిసి ఉంటే ఎంత మంచిదో తెలుసుకొని మేమంతా కలిసి మెలిసి ఉంటున్నాం.. అంటాడు తన కొడుకు.

లేదంటే మేమంతా ఎవరికి వారు విడిపోయి చెట్టుకు ఒకరు పుట్టకు ఒగరుగా జీవితంలో సంతోషం లేకుండా దేనికి పనికిరాకుండా అయిపోయేవాళ్లం అంటారు వాళ్లు. వీళ్ల మాటలు వింటుంటే.. విడిపోయి ఉండటం వల్ల వీళ్లు ఏదో సమస్యను ఎదుర్కున్నట్టు ఉంది అని అనుకుంటుంది జానకి.

ఉమ్మడి కుటుంబంలోని విలువలు మీకు ఇంత గొప్పగా తెలిశాయి అంటే.. మీరు విడిపోవడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు వచ్చాయి అని అడుగుతుంది జానకి. దీంతో విడిపోతే వచ్చే కష్టాలు ఏంటో మీకు తెలియదా తల్లి అంటుంది ఆవిడ.

కరెక్టే కానీ.. విడిపోవడం వల్ల వచ్చే కష్టాలు కూడా తెలవాలి కదా అంటుంది. దీంతో ఏ ఇంట్లో అయినా ఉమ్మడి కుటుంబంగా ఉండాలన్నా, విడిపోవాలన్నా కూడా ఆ ఇంటి కోడలు మీదనే ఆధారపడి ఉంటుంది అని అంటుంది ఆ ఇంటి కోడలు.

మా కోడళ్లం ఇద్దరం తప్పు చేశాం. మేమే బాగుండాలన్న స్వార్థం.. వీళ్ల పెత్తనం ఏంటి అనే అహం వల్ల మేము విడిపోయాం. అప్పుడు కానీ.. మాకు అసలు విషయం గుర్తుకురాలేదు. ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఎంత మంచిదో అప్పుడు అర్థం అయింది అంటారు.

మేము వేరు కాపురం పెట్టుకున్నాక ఎవ్వరి నుంచి మాకు ఎలాంటి సాయం లేదు. కష్టం వస్తే అందించే చేయి లేదు.. తోడు ఉండే మనిషి లేడు అంటారు. సమాజం వెలేసిన బతుకు అయిపోయింది మా పరిస్థితి అంటారు.

ఎన్నో అవమానాలు ఎదుర్కున్నాం. మా పిల్లలను మేమే చూసుకోవాలి. లేదంటే అనాథ పిల్లలలా కేర్ సెంటర్ కు వదిలేయాలి అంటారు. అటు మా అత్తయ్య గారు, మామయ్య గారు పిల్లల మీద అచ్చటా ముచ్చట దొరకగా చాలా సమస్యలు వచ్చాయి.

అప్పుడే మా మామయ్య గారు మీ కుటుంబం గురించి చెప్పారు. మాకు ఉమ్మడి కుటుంబం వల్ల లాభాలేంటో కనువిప్పు కలిగించారు. దీంతో మేము ఇప్పుడు కలిసి పోయి సంతోషంగా ఉన్నాం అని చెబుతారు.

ఆ తర్వాత అందరూ ఇంటికి వెళ్తారు. బయటి వాళ్లకు ఆదర్శం అయిన ఈ కుటుంబం.. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో లేదు అని అనుకుంటుంది జ్ఞానాంబ. తొందరపడ్డామేమో అని అనుకుంటాడు విష్ణు.

అఖిల్ కూడా అనవసరంగా ఆవేశ పడ్డాను అని అనుకుంటాడు. మనమంతా ఒక్కటే అనుకుంటే ఏ సమస్యా రాదు అని అని మల్లికతో అంటుంది జానకి. ఇందాక వాళ్లు చెప్పింది విన్నావు కదా. మనందరినీ ఆదర్శంగా తీసుకొని వాళ్లు కలిసి మెలిసి ఉంటున్నారు.

విడిగా ఉంటే పట్టించుకునే వాళ్లు ఉండరు. అందరూ ఉండి అనాథల్లా ఉంటాం. ఒక్కసారి ఆలోచించు అంటుంది జానకి. ఆ తర్వాత అఖిల్ కు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది