Janaki Kalaganaledu 25 Feb Today Episode : దిలీప్, వెన్నెల ప్రేమ గురించి తెలుసుకున్న మల్లిక.. జ్ఞానాంబకు తెలియకుండా క్లాస్ కు వెళ్తున్న జానకికి భారీ షాక్

Janaki Kalaganaledu 25 Feb Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 ఫిబ్రవరి 2022, శుక్రవారం ఎపిసోడ్ 245 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అస్సలు వీళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదని తెగ టెన్షన్ పడుతుంది మల్లిక. మరోవైపు మీరు ఇంకేం ఆలోచించండి.. వెళ్దాం పదండి అని దిలీప్ తల్లికి సర్దిచెబుతుంది జానకి. మీ కొడుకు ఫ్రాణాల కంటే ఇది ఎక్కువా చెప్పండి.. ఇంకేం ఆలోచించకండి అంటుంది జానకి. దీంతో సరేనమ్మా.. అంటుంది దిలీప్ తల్లి. మీకు చాలా థాంక్స్ అండి అంటుంది జానకి. పర్లేదు అని చెప్పి ఇద్దరూ కిందికి వెళ్తారు. మరోవైపు తన పెళ్లి సంబంధం ఏమైందో అని వెన్నెల టెన్షన్ పడుతూ ఉంటుంది.

janaki kalaganaledu 25 february 2022 full episode

జానకి.. ఏదైనా సమస్యా అని జ్ఞానాంబ అడుగుతుంది జానకిని. దీంతో అవును అత్తయ్య గారు చాలా పెద్ద సమస్య అంటుంది జానకి. మరోవైపు వెన్నెల భయంతో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఒక్కగానొక్క కూతురు. తను అత్తారింట్లో సంతోషంగా ఉంటే చాలు.. అంటుంది. దీంతో అడిగితే ఇవ్వొచ్చు కానీ.. అడగకపోతే ఏం ఇస్తాం చెప్పండి అని అంటుంది జానకి. మాకు కట్నకానుకలు ఏవీ వద్దు. మీ అమ్మాయిని మా ఇంటికి పంపిస్తే చాలు అని చెప్పారు. ఆ విషయాన్నే ఆవిడ ఇంతకుముందు మీకు చెప్పాలని ప్రయత్నించారు అని చెబుతుంది జానకి. దీంతో జ్ఞానాంబ చాలా సంతోషిస్తుంది. మరోవైపు మల్లికకు ఏం చేయాలో అర్థం కాదు.

మా వారు ఊరెళ్లారు. ఆయన రాగానే మిగితా విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి జ్ఞానాంబ వాళ్లు బయలుదేరుతారు. జ్ఞానాంబ వాళ్లు బయలు దేరగానే.. వెంటనే దిలీప్ వెన్నెలకు ఫోన్ చేస్తాడు. అంతా కూల్ గా జరిగిపోయింది. నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు దిలీప్.

మరోవైపు జ్ఞానాంబ వాళ్లు బయలు దేరే సమయానికి తన ఫోన్ మరిచిపోయానని చెబుతుంది మల్లిక. ఇంతలో దిలీప్ ఫోన్ లో మాట్లాడటం మల్లిక వింటుంది. చాలా పెద్ద గొడవ జరిగి ఉండేది అని వెన్నెలతో మాట్లాడుతుంటాడు. మీ జానకి వదిన మా అమ్మతో మాట్లాడి నచ్చజెప్పింది. లేదంటే మన ప్రేమ విషయం మీ అమ్మకు తెలిసిపోయి ఉండేది అంటాడు దిలీప్.

మీ జానకి వదిన చాలా గ్రేట్ వెన్నెల అంటాడు దిలీప్. మన ప్రేమ పెళ్లిని పెద్దలు కుదిర్చిన పెళ్లిగా మార్చేశారు కాబట్టి.. ఇక మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మన పెళ్లి ఇక జరిగిపోయినట్టే అని అంటుండగా మల్లిక అతడి మాటలు వింటుంది. తనకు ఏదో తేడా కొడుతుంది.

Janaki Kalaganaledu 25 Feb Today Episode : తన పెళ్లి సంబంధం కుదిర్చినందుకు జానకికి థాంక్స్ చెప్పిన వెన్నెల

తను రాగానే రామా కారు తీయ్ అంటుంది జ్ఞానాంబ. తర్వాత అందరూ ఇంటికి వస్తారు. ఆడపిల్ల పెళ్లి అంటే ఎన్నో భయాలు ఉంటాయి. మన కూతురు ఎలాంటి ఇంటికి వెళ్తుంది.. కంట తడి పెట్టే భయం లేకుండా నా కూతురు సంతోషంగా ఉంటుందా అనే టెన్షన్స్ అన్నీ పోయాయి నాకు అంటుంది జ్ఞానాంబ.

అత్తారింట్లో నాకు ఎటువంటి లోటు ఉండదని.. జీవితాంతం నువ్వు సంతోషంగా ఉంటావని నాకు నమ్మకం వచ్చిందమ్మా అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత వదిన థాంక్స్ అంటూ వెన్నెల.. జానకి మీద పడి పడిపోతుంది. దీంతో మల్లిక చూసి.. ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. మల్లిక తమవైపు రాగానే.. వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు.

వెన్నెల చాలా సంతోషంగా ఉండటం చూసి అస్సలు మల్లికకు అర్థం కాదు. ఆ తర్వాత తన రూమ్ కు వెళ్లి జానకిని హత్తుకుంటుంది వెన్నెల. థాంక్యూ వదిన.. థాంక్యూ థాంక్యూ సో మచ్ అంటుంది వెన్నెల. నీ కాపురం సమస్యల్లో పడిపోయే ప్రమాదం ఉందని తెలిసి కూడా నువ్వు నాకోసం ఇంత రిస్క్ చేస్తున్నావు అంటుంది వెన్నెల.

దీంతో ఇది నా కుటుంబం వెన్నెల.. నా కుటుంబం కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా కానీ.. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మల్లికకు ఏమాత్రం అనుమానం వచ్చినా చాలా సమస్య అవుతుంది అని అంటుంది. మరోవైపు జానకి కోసం రామా ఒక మంచి గిఫ్ట్ తీసుకొస్తాడు.

మీకు చాలా ఇష్టమైన వాటిని తీసుకొచ్చాను అంటాడు రామా. దీంతో ఏంటి రామా గారు అవి అంటుంది జానకి. తనకు ఒక లెటర్ ఇస్తాడు. తనకు రాత్రి పూట వెళ్లి కోచింగ్ సెంటర్ కు చదువుకునేలా పర్మిషన్ తీసుకొని వస్తాడు రామా. ఆ లెటర్ అదే.

దాన్ని ఇవ్వగానే నాకు తిరిగి ఎప్పుడెప్పుడు సివిల్స్ కోచింగ్ కు వెళ్లాలా అని ఉంది. అలాగే భయం కూడా ఉంది అంటుంది జానకి. మనం నైట్ క్లాస్ లకు రాజమండ్రికి వెళ్లాలి అంటే.. రాత్రి ఏడున్నర నుంచి 10 గంటల వరకు క్లాస్ లు ఉంటాయి. ఇంటికి వచ్చే సరికి 12 కావచ్చు. ప్రతి రోజు అత్తయ్య గారికి టైమ్ విషయంలో మనం ఏం సమాధానం చెబుతాం చెప్పండి అంటుంది జానకి.

దీంతో జానకి గారు దానికి ఒక ప్లాన్ కూడా వేశాను. మీరు ఇటు రండి అంటాడు. ఇప్పుడు మీరు ఈ టైమ్ గురించే కదా కంగారు పడుతున్నారు అంటాడు రామా. దీంతో కొద్దిగా కష్టమేనండి.. కష్టపడదాం. ఆశయం గొప్పదైనప్పుడు కష్టపడకుండా ఉంటామా చెప్పండి అంటాడు రామా.

ఈరోజు చాలా మంచి రోజంట. ఈరోజే మీరు రాత్రి బడి కోచింగ్ లో చేరాలి. చకచకా పుస్తకాలు సర్దేసుకోండి. మనం వెళ్లిపోదాం అంటాడు రామా. నేను దీని గురించి ఆలోచిస్తుంటాను. మీరు ఇంతలో రెడీ అవ్వండి అంటాడు రామా. నా బంగారం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రామా.

మరోవైపు జ్ఞానాంబ.. ఏదో కేకుల ఆర్డర్ ను తీసుకుంటుంది.  రామా అని పిలుస్తుంది. ఒకసారి జానకిని పిలువు అంటుంది. జానకి గారు అని పిలుస్తాడు. చెప్పండి అత్తయ్య గారు అంటుంది. దీంతో మనకు తెలిసిన వాళ్లు బర్త్ డే కేకు తయారు చేయమని ఇచ్చారు అని చెబుతుంది. దీంతో జానకి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

10 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

11 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

11 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

13 hours ago

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

14 hours ago

Cholesterol | ముఖంపై కనిపించే లక్షణాలు .. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని సంకేతాలు!

Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…

15 hours ago

I Phone 17 | గ్రాండ్‌గా లాంచ్ అయిన ఐ ఫోన్ 17.. లాంచ్, ఫీచ‌ర్స్ వివ‌రాలు ఇవే.!

I Phone 17 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న లేటెస్ట్ ఐఫోన్ మోడ‌ల్ ఐఫోన్ 17ను తాజాగా…

16 hours ago

Dizziness causes symptoms | ఆక‌స్మాత్తుగా త‌ల తిరుగుతుందా.. అయితే మిమ్మ‌ల్ని ఈ వ్యాధులు వెంటాడుతున్న‌ట్టే..!

Dizziness causes symptoms |  చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…

16 hours ago