Janaki Kalaganaledu 26 Aug Today Episode : పనివాళ్లు రాకపోవడంతో జానకి మీద జ్ఞానాంబ సీరియస్.. నా పరువు తీశావు.. నేను తలదించుకునేలా చేశావు.. అని జ్ఞానాంబ అనగానే.. జానకి పరిగెత్తుకుంటూ వెళ్లి?

Janaki kalaganaledu 26 Aug 2021 Thursday 114 full episode highlights
Janaki Kalaganaledu 26 Aug Today Episode : జానకి కలగనలేదు సీరియల్ 26 ఆగస్టు 2021, గురువారం ఎపిసోడ్ 114 తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబ మాటను కాదని.. స్వీట్ల ఆర్డర్ ను తీసుకుంటుంది జానకి. కానీ.. జ్ఞానాంబకు మాత్రం సమయానికి స్వీట్లు డెలివరీ చేయకపోతే ఎలా? అని టెన్షన్ పడుతుంది.

Janaki kalaganaledu 26 Aug 2021 Thursday 114 full episode highlights
మల్లికకు ఇదేమీ నచ్చదు. ఎనిమిదో తరగతి చదివిన నాకే ఇలాంటి ఐడియాలు రాలేదు. మరి.. 5వ తరగతి మాత్రమే చదివిన జానకికి.. ఇంత మంచి ఐడియాలు ఎలా వచ్చాయబ్బా. ఈ ఐడియాలు నాకెందుకు రాలేదు. ఏదో ఒకటి చేయాలి. లేకపోతే.. ఈ దెబ్బతో జానకి ఎక్కడికో వెళ్లిపోతుంది.. అని తెగ ఆలోచిస్తుంటుంది మల్లిక.

Janaki kalaganaledu 26 Aug 2021 Thursday 114 full episode highlights
Janaki Kalaganaledu 26 Aug Today Episode : అమ్మమాటకు ఎదురు చెబుతావా అని జానకిని ప్రశ్నించిన రామా
మరోవైపు జానకి.. తన బెడ్ రూమ్ లో కూర్చొని ఏదో రాస్తుంటుంది. ఇంతలో రామా వచ్చి జానకి గారు.. ఏంటండి మీరు చేసే పని. అమ్మ వద్దని చెప్పినా మీరు కాంట్రాక్ట్ తీసుకున్నారట. ఎలా అవుతుంది. దానికి బోలెడు మంది పనివాళ్లు కావాలి. రేపటి వరకు ఎలా ఆర్డర్ డెలివరీ చేస్తాం.. అని అడుగుతాడు రామా.

Janaki kalaganaledu 26 Aug 2021 Thursday 114 full episode highlights
ఈ సిటీలో ఉన్న అన్ని స్వీట్ షాపుల నెంబర్స్ తీసుకుంటున్నాను. వాళ్లకు ఫోన్ చేసి.. అక్కడ పనిచేసే వాళ్ల నెంబర్స్ తీసుకొని.. వాళ్లకు ఫోన్ చేసి.. డబుల్ ఎమౌంట్ ఇస్తామని చెప్పి.. ఇక్కడికి తీసుకొచ్చి పని చేపిస్తాం. దీంతో అనుకున్న సమయానికే వాళ్లకు డెలివరీ చేయొచ్చు.. అని చెబుతుంది జానకి. ఈ విషయాన్ని మల్లిక వింటుంది. అమ్మో.. నీది మట్టి బుర్ర కాదు అని అనుకుంటుంది.

Janaki kalaganaledu 26 Aug 2021 Thursday 114 full episode highlights
Janaki Kalaganaledu 26 Aug Today Episode : కాంట్రాక్ట్ చెడగొట్టే ప్లాన్ వేసిన మల్లిక
ఒకవేళ ఆ కాంట్రాక్ట్ సక్సెస్ అయితే.. ఆ పోలేరమ్మ నీకు మహారాజా కుర్చీ వేసి కూర్చోబెడుతుంది. అప్పుడు కోడలుగా నీకు తిరుగు ఉండదు. వామ్మో.. ఈ కాంట్రాక్ట్ ఎలాగైనా చెడగొట్టాలి.. అని ప్లాన్స్ వేస్తుంది మల్లిక. రామా కూడా తన ఐడియాకు మెచ్చుకుంటాడు.
పదా జానకి.. నిను వీడని నీడను నేనే.. అన్నట్టు నేను వస్తాను. నువ్వు కష్టపడి చేసిన ఆలోచనలను అన్నింటినీ నిప్పుల్లో పోసేస్తాను.. అని అనుకుంటుంది మల్లిక.

Janaki kalaganaledu 26 Aug 2021 Thursday 114 full episode highlights
కట్ చేస్తే.. తెల్లారుతుంది. ఖార్ఖానాకు వెళ్లి పనివాళ్లతో మాట్లాడి.. ఇవాళ కష్టపడి పనిచేసి స్వీట్లు తయారు చేయండి. మీతో పాటు మరో పది మంది వస్తారు. డబ్బులు కూడా ఎక్కువ తీసుకోండి.. అని చెబుతుంది జ్ఞానాంబ. రామా సరుకులు ఆర్డర్ ఇస్తాడు. వెంటనే అందరూ సరుకులను తీసుకొని పెట్టి.. స్వీట్ల తయారీని ప్రారంభిస్తారు.
ఒకవైపు ధైర్యంగా ఉన్నా.. మరోవైపు సమయం తక్కువగా ఉందన్న కంగారు కూడా ఉంది రామా.. ఇంతకీ జానకి ఎక్కడ.. అని అడుగుతుంది జ్ఞానాంబ.

Janaki kalaganaledu 26 Aug 2021 Thursday 114 full episode highlights
Janaki Kalaganaledu 26 Aug Today Episode : 3000 ఇస్తేనే వస్తామన్న పనివాళ్లు
జానకి.. వేరే పనివాళ్లను తీసుకురావడానికి వెళ్తుంది. ఒక్క రోజులో మీరు స్వీట్లు తయారు చేయాలి.. అని చెబుతుంది. దీంతో కొంచెం డబ్బులు ఎక్కువవుతాయి అని అంటారు పనివాళ్లు. మనిషికి 3000 ఇవ్వండి.. అని అడుగుతారు. దీంతో జానకి షాక్ అవుతుంది. అవునమ్మా.. 3000 ఇస్తేనే వస్తాం.. అని అంటారు పనివాళ్లు.

Janaki kalaganaledu 26 Aug 2021 Thursday 114 full episode highlights
ఏంటమ్మా.. ఏం మాట్లాడరు ఏంటి.. అంటే.. రోజుకు వెయ్యి రూపాయలు ఇస్తారు కదా. రాత్రి పని కూడా కలుపుకొని 2000 ఇస్తాను.. అని చెబుతుంది జానకి. కానీ.. రాత్రిపగలు కష్టపడి పనిచేస్తే తెల్లారి పనికి వెళ్లలేం అమ్మా. అందుకే 3000 ఇస్తేనే పనిచేస్తాం అని చెబుతారు పనివాళ్లు.

Janaki kalaganaledu 26 Aug 2021 Thursday 114 full episode highlights
మల్లిక అక్కడే ఉండి.. పనివాళ్లు రాము.. అనేసరికి తెగ సంతోష పడుతుంది. చాలాసేపు ఆలోచించి జానకి.. సరే అండి.. అలాగే ఇస్తాం.. అని చెబుతుంది జానకి. దీంతో మల్లిక దెబ్బకు షాక్ అవుతుంది.
Janaki Kalaganaledu 26 Aug Today Episode : తన భర్త ఏటీఎం కార్డు అడిగి తీసుకెళ్లిన మల్లిక
కట్ చేస్తే విష్ణు రెడీ అవుతుంటాడు. ఏడ్చుకుంటూ అక్కడికి వస్తుంది మల్లిక. ఏమైంది.. అని అడుగుతాడు విష్ణు. అయిపోయిందండి.. అంతా అయిపోయిందండి. దానికి ఏడ్వడం ఎందుకు. మళ్లీ చేసుకొని తినొచ్చు కదా.. అని అంటుంది మల్లిక.

Janaki kalaganaledu 26 Aug 2021 Thursday 114 full episode highlights
జానకి అత్తయ్య గారి దగ్గర ఇంటికి దగ్గ కోడలు అనే పొగడ్తలు పొందే అవకాశం ఉంది. ఇలా అయితే.. నా పరిస్థితి ఏంటి? అని అంటుంది మల్లిక. విష్ణు కూడా అదే అంటాడు. దీంతో నువ్వు కూడా జానకిని మెచ్చుకుంటావా? అని మల్లిక తన భర్తను పిడిగుద్దులు గుద్దుతుంది. జానకి.. దేవత అని పొగిడితే నేను అస్సలు ఒప్పుకోను.. అని అంటుంది.
ఇక.. తన భర్త ఏటీఎం కార్డును అడుగుతుంది. ఇందులో ఎన్ని డబ్బులు ఉన్నాయండీ అని అడుగుతుంది. 30,500 ఉన్నాయి అని చెబుతాడు. నాకు అన్ని డబ్బులు వద్దు కానీ.. 30,000 చాలు అని చెప్పి కార్డు తీసుకొని వెళ్తుంది.

Janaki kalaganaledu 26 Aug 2021 Thursday 114 full episode highlights
కట్ చేస్తే.. స్వీట్ల తయారీకి అన్ని సిద్ధం చేసుకొని.. కొబ్బరి కాయ కొట్టి.. స్వీట్ల తయారీని ప్రారంభిస్తుంది జ్ఞానాంబ. నీ చేతితో పొయ్యి వెలిగిస్తే తిరుగు ఉండదు.. అని అంటాడు జ్ఞానాంబ భర్త. రామా కూడా వెలిగించు అమ్మ అంటాడు. అందరూ చప్పట్లు కొడతారు. ఇక పనులు మొదలు పెట్టండి. ఒక్క క్షణం కూడా వృధా కావడానికి వీలు లేదు.. అని అంటుంది జ్ఞానాంబ.

Janaki kalaganaledu 26 Aug 2021 Thursday 114 full episode highlights
మిగతా పనివాళ్లు కూడా వచ్చేస్తే పనులు తొందరగా అయిపోతాయి. ఇంకా వాళ్లు రాలేదేంటి.. అని అడుగుతుంది జ్ఞానాంబ. 10 నిమిషాల్లో వచ్చేస్తాం.. అన్నారు.. అని వాళ్ల కోసం ఎదురు చూస్తుంటుంది జానకి.
Janaki Kalaganaledu 26 Aug Today Episode : పనివాళ్లకు డబ్బులు ఇచ్చి పనికి రాకుండా అడ్డుకున్న మల్లిక
కట్ చేస్తే.. మల్లిక పనివాళ్ల కోసం రోడ్డు మీద ఎదురు చూస్తుంటుంది. ఆగండి.. ఆగండి.. అని అంటుంది మల్లిక. ఎవరమ్మా మీరు.. అని అడుగుతారు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు.. అని అడుగుతుంది మల్లిక. జ్ఞానాంబ గారు పనికి రమ్మన్నారు.. అని చెప్పగానే వద్దు వెళ్లండి. మీరు ఈ పని చేయకూడదు.. అనగానే.. వచ్చే 3000 ఎందుకు పోగొట్టుకోవాలి.. అని అడుగుతారు.

Janaki kalaganaledu 26 Aug 2021 Thursday 114 full episode highlights
అయితే.. తీసుకోండి.. ఇదిగో 30,000.. తీసుకొని వెళ్లిపోండి.. అనగానే.. ఆ డబ్బులను తీసుకొని వాళ్లు తిరిగి వెళ్లిపోతారు. దీంతో మల్లిక తెగ సంతోషపడుతుంది.
వెంటనే ఖార్ఖానాకు వెళ్తుంది. అసాధ్యం అని అనిపించినా సరే.. నువ్వు అంత నమ్మకంగా చెబితే నువ్వు చేయగలవేమో అని నిన్ను నమ్మాను. నిన్ను నమ్మినందుకు పరువు పోయే పరిస్థితి వచ్చింది. చేతకానప్పుడు ఎందుకు ఒప్పుకున్నారు అని అడిగితే నేను వాళ్ల ముందు తలదించుకోవాలా? వ్యాపార రంగంలో నిలబడాలంటే నమ్మకం చాలా ముఖ్యం. నువ్వు పాతికేళ్ల నమ్మకాన్ని కాలరాశావు.. అని జ్ఞానాంబ జానకిని తిడుతుంది. అలా చెప్పగానే.. జానకి.. పరుగుపరుగున ఊళ్లోకి వెళ్తుంది. తన అత్తయ్య పరువు ఎలాగైనా నిలబెట్టాలని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మాత్రం తరువాయిభాగంలో చూడాల్సిందే.

Janaki kalaganaledu 26 Aug 2021 Thursday 114 full episode highlights