Janaki Kalaganaledu 26 July Today Episode : జానకి చదువు గురించి తెలుసుకున్న జ్ఞానంభ.. జానకిని ఇంట్లో నుంచి పంపించేస్తుందా.. దానికి రామ ఏమంటాడు.?
Janaki Kalaganaledu 26 July Today Episode : జానకి కలగడం లేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. 26 మంగళవారం ఎపిసోడ్ 3502 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. రామ, జానకి లను మల్లిక వాళ్ళ తమ్ముడు ఫాలో అవుతూ వెళ్లతాడు. అకాడమీలో వాళ్లని చూస్తాడు. చూసి మల్లికా కు ఫోన్ చేసి చెప్తాడు. వాళ్లు సివిల్ సర్వీస్ అకాడమీలో సర్టిఫికెట్ సబ్మిట్ చేయడానికి వచ్చారు. అక్క అని చెప్తాడు. సివిల్ సర్వీస్ అంటే చీరల వ్యాపారమార అని అడుగుతుంది మల్లికా, కాదు ఆక్క పోలీస్ కలెక్టరు లాంటి పెద్ద పెద్ద చదువులు అని చెప్తాడు. అప్పుడు మల్లిక ఆశ్చర్యానికి గురవుతుంది. ఒరేయ్ తమ్ముడు నేను వెళ్లి కురుక్షేత్రం ప్లాన్ చేయాలి. నువ్వు ఫోన్ పెట్టి అంటూ మల్లిక జ్ఞానంభకు చెప్పడానికి వస్తుంది. కానీ జ్ఞానం తిడుతుంది. నీకు చెప్పాను కదా జానకి గురించి ఇంకోసారి పుకార్లు చెప్పొద్దని ఇకనుంచి వెళ్ళు అని అంటుంది. వెళ్తాను కానీ అత్తయ్య గారు జానకి చదువు కాగితాలు మీ అల్మరుల ఉన్నాయో లేవో ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి అని అంటుంది. జ్ఞానాంబ అప్పుడు ఆశ్చర్యంగా జానకి కాగితాలు అల్మారులో ఉన్నట్టు నీకేం తెలుసు అని అడుగుతుంది.
నాకు ఇప్పటివరకు తెలియదు అత్తయ్య గారు కానీ జానకి బావగారు దొంగ చాటుగా తీసుకెళ్తుంటే చూశాను. అని అంటుంది. అప్పుడు ఆశ్చర్యంగా గోవిందరాజు జ్ఞానాంబ ఒక్కసారిగా ఉల్లిక్కిపడతారు. మల్లికను గోవిందరాజు తిడుతూ ఉంటాడు తోటి కోడల మీద ఇంకా చాడీలు చెప్పడం మానవ, నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా అంటూ తిడుతూ ఉంటాడు. నేను అబద్ధాలు చెప్తున్నాను చాడీలు చెప్తున్నాను దాని వెనక ఎవరు రాస్తూ ఉందో కాసేపు ఆగండి తెలుస్తుంది మావయ్య గారు అని అంటుంది. అత్తయ్య గారు ఆ సర్టిఫికెట్లు గురించి నాకేం తెలుసండి. నేను ఇప్పుడు చూశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. బావగారు వాళ్ళ దగ్గరే చూసిన తర్వాత మీకే అర్థమవుతుందండి. నేను ఇ న్నిసార్లు చెప్పింది మీరేం నమ్మలేదు కదా. కానీ ఇప్పుడు ఆ సర్టిఫికెట్లు చూసి ఉన్నాయా లేదా తెలుసుకోండి. అందులో జానకి సర్టిఫికెట్స్ కనుక ఉంటే మీ చెప్పుతో నన్ను కొట్టండి. అని అంటుంది. జ్ఞానం తను అలాగే చెప్తుంది తన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నువ్వెక్కడ నుంచి వెళ్ళు మల్లికా అని గోవిందరాజు కవర్ చేస్తూ ఉంటాడు.
అత్తయ్య గారు నేను చెప్పేది అబద్ధం అయితే ఈసారి మీరు ఏ శిక్ష వేసిన నేను భరిస్తాను, ఒక్కసారి ఆ సర్టిఫికెట్స్ ఉన్నాయా లేవా వెళ్లి చూడండి. అత్తయ్య గారు అని అంటుంది.గోవిందరాజు ఎంత చెప్పినా వినకుండా జ్ఞానంబ వెళ్లి చెక్ చేస్తుంది. కానీ అందులో సర్టిఫికెట్స్ ఉండవు, ఇది నిజమో కాదో చెప్పండి అత్తయ్య గారు అని అంటుంది మల్లికా, అలాగే జానకి రూమ్లో పెద్ద పెద్ద బుక్స్ ఉన్నాయి ఆమె చదువుకుంటుంది అని ఎన్నిసార్లు చెప్పినా మీరు నమ్మలేదు అత్తయ్య గారు నా పెద్ద కోడలు నమ్మకానికి మారుపేరు అది ఇది అన్నారు. వాళ్లు మిమ్మల్ని ఇంత మోసం చేస్తున్నారో అత్తయ్య గారు, వాళ్లు ఎక్కడికి వెళ్లారు ఏం చేస్తున్నారు మీరు కూడా చూద్దురుగాని రండ అత్తయ్య గారు అని జ్ఞానం భాను మల్లిక తీసుకెళ్తుంది. గోవిందరాజు వాళ్లకు ఫోన్ చేసి అక్కడ నుంచి వెళ్లిపోమని చెప్పాలి అని అనుకుంటాడు. కానీ మల్లికా అంతలో వచ్చి మావయ్య గారు మీరు కార్ డ్రైవింగ్ చేయాలి కదా రండి, మీరు పెద్ద కోడలు బాగోతం చూద్దురుగాని అని తీసుకెళ్తుంది.ముగ్గురు కలిసి అకాడమీకి వెళుతూ ఉంటారు.
కట్ చేస్తే జానకి సర్టిఫికెట్స్ కాలేజీలు చెక్ చేయడానికి తీసుకుంటారు. అక్కడ ఉన్న లెక్చరర్స్, జానకి ఆలోచిస్తూ అత్తయ్య గారిని మోసం చేస్తున్నాను, నా చదువు అయిపోయిన తర్వాత అత్తయ్య గారిని కాళ్లు పట్టుకొని వేడుకుంటా, అని బాధపడుతూ ఉంటుంది. గోవిందరాజు ఏం జరుగుతుందో ఏంటో అని కంగారుపడుతూ ఉంటాడు. మల్లిక మాత్రం సంతోష్ పడుతూ ఉంటుంది . మల్లిక మావయ్య గారు పాస్ట్ గా వెళ్ళండి మావయ్య గారు అని అంటుంది. ఇంతకంటే ఫాస్ట్ గా వెళ్తే కాలేజీకి కాదు మనం వెళ్ళేది పైకి వెళ్తామని కామెడీ లేస్తారు. మల్లిక మీద ఏదో ఒకటి సెటైర్లు వేస్తూ ఉంటుంది. జానకి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అయిపోయి షీల్డ్ ప్రజెంటేషన్ దగ్గరికి అందరూ అక్కడికి వస్తారు. జానకి రామ ఇద్దరు ఒక దగ్గర కూర్చుని ఉంటారు షీల్డ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
జ్ఞానాంబ గోవిందరాజు మల్లిక అకాడమీలోకి వచ్చేస్తారు. షీల్డ్ ప్రజెంటేషన్ జరుగుతూ ఉంటాయి. జానకి, రామ చాలా సంతోషంగా ఉంటారు. జానకిని షీల్డ్ ప్రజెంటేషన్ కోసం స్టేజ్ పైకి పిలుస్తారు. జానకి, రామచాలా సంతోష పడిపోతూ ఉంటారు. జ్ఞానంబ వాళ్లు జానకిని చూస్తారు. జానకి మాత్రం స్టేజిపై షీల్డ్ ను తీసుకొని మురిసిపోతూ ఉంటుంది. ఇదంతా జ్ఞానంభ వాలు చూస్తూనే ఉంటారు. మల్లిక జానకి పై ఇంకా నాలుగు చాడీలు ఎక్కువగానే చెబుతూ ఉంటుంది. మిమ్మల్ని ఎలా పిచ్చోళ్ళని చేశారో చూడండి అత్తయ్య గారు అంటుంది మల్లికా.., లెక్చరర్స్ జానకిని స్టేజిపై మాట్లాడమని కోరుతారు. నేను ఈ స్టేజిపై ఎలా షీల్డ్ తీసుకుంటున్నాను అంటే ఒక ఇద్దరు వ్యక్తుల కారణం ఉన్నది. ఒకరు మా నాన్న, ఇంకొకరు నా భర్త తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి. అంటే రేపటి వరకు వేచి చూడాల్సింది.