Janaki Kalaganaledu 27 Jan Today Episode : రామా బైక్ కు ఉన్న బాంబును నిర్వీర్యం చేసిన జానకి.. మెచ్చుకున్న పోలీసులు.. తనను ఐపీఎస్ చదివిస్తామని చెప్పడంతో జ్ఞానాంబ షాక్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janaki Kalaganaledu 27 Jan Today Episode : రామా బైక్ కు ఉన్న బాంబును నిర్వీర్యం చేసిన జానకి.. మెచ్చుకున్న పోలీసులు.. తనను ఐపీఎస్ చదివిస్తామని చెప్పడంతో జ్ఞానాంబ షాక్

Janaki Kalaganaledu 27 Jan Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 జనవరి 2022, గురువారం ఎపిసోడ్ 224 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముగ్గుల పోటీలు పూర్తవుతాయి. జ్ఞానాంబ ముగ్గుల పోటీలో మొదటి స్థానంలో నిలుస్తుంది. మరికాసేపట్లో బైక్ రేసింగ్ పోటీలు స్టార్ట్ అవుతాయని నిర్వాహకులు చెబుతారు. దీంతో జానకి గారు కాసేపు బైక్ రైసింగ్ పోటీలు చేసి వెళ్దాం అంటాడు రామా. మీరు ఇదివరకు […]

 Authored By gatla | The Telugu News | Updated on :27 January 2022,10:00 am

Janaki Kalaganaledu 27 Jan Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 జనవరి 2022, గురువారం ఎపిసోడ్ 224 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముగ్గుల పోటీలు పూర్తవుతాయి. జ్ఞానాంబ ముగ్గుల పోటీలో మొదటి స్థానంలో నిలుస్తుంది. మరికాసేపట్లో బైక్ రేసింగ్ పోటీలు స్టార్ట్ అవుతాయని నిర్వాహకులు చెబుతారు. దీంతో జానకి గారు కాసేపు బైక్ రైసింగ్ పోటీలు చేసి వెళ్దాం అంటాడు రామా. మీరు ఇదివరకు బైక్ రేసింగ్ లో పాల్గొన్నారా అని అడుగుతుంది జానకి. దీంతో పాల్గొన్నాను.. కానీ ప్రైజ్ రాలేదు అంటాడు. ఎందుకు అంటే చూస్తే ప్రైజ్ ఇవ్వరు కదా అంటాడు రామా. ఇంతలో కన్నబాబు వచ్చి రామాను  రెచ్చగొడతాడు. బైక్ రేసింగ్ లో పాల్గొనాలంటే.. మగాడు అయి ఉండాలి. అయినా.. ఈ చుట్టుపక్కల బైక్ రేసింగ్ లో నన్ను ఓడించే మగాడు ఇప్పటి వరకు పుట్టలేదు అంటూ రెచ్చగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

janaki kalaganaledu 27 January 2022 full episode

janaki kalaganaledu 27 January 2022 full episode

దీంతో జానకి పదండి.. మనం బైక్ రేస్ లో పార్టిసిపేట్ చేద్దాం అంటాడు. బైక్ పోటీలు ప్రారంభం అవుతాయి. రామాతో పాటు విష్ణు కూడా బైక్ రేసింగ్ లో పాల్గొంటాడు. కన్నబాబు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నువ్వు బైక్ రేసింగ్ లో ఎలాగైనా గెలవాలి అంటుంది. దీంతో నీకు ఈ బైక్ రేసింగ్ లో గెలిచి కానుకగా ఇస్తా అంటాడు కన్నబాబు. బైక్ రేసింగ్ పోటీలు ప్రారంభం అవుతాయి. రామా బైక్ కు బాంబును అప్పటికే కిరాయి రౌడీ అమర్చి ఉంచుతాడు. అదే విషయం సునందకు ఫోన్ చేసి చెబుతాడు కిరాయి రౌడీ. వామ్మో.. ఆ రామచంద్ర పక్కనే నా కొడుకు కూడా ఉన్నాడు. బాంబు పేలితే.. నా కొడుకు ప్రాణాలు కూడా పోతాయి అని టెన్షన్ పడుతుంది. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది సునంద.

రేస్ మధ్యలో రామా బైక్ ను కాలితో తంతాడు కన్నబాబు. దీంతో రామా బైక్ కింద పడిపోతుంది. బైక్ మీది నుంచి రామా కింద పడిపోతాడు. బాంబు బైక్ కింద పడుతుంది. దీంతో అందరూ రామా దగ్గరికి వస్తారు. పోటీలు ముగిసే సమయం అవుతుంది.. అని రామా బైక్ తీసేసరికి దాని కింద ఉన్న బాంబును చూస్తుంది జానకి.

బాంబు అనగానే అందరూ అక్కడి నుంచి పరిగెత్తుతారు. బైక్ పోటీలు నిలిచిపోతాయి. అందరూ దూరంగా వెళ్లండి అని చెప్పి ఆ బాంబును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుంది జానకి. అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే వెంటనే బాంబ్ స్క్వాడ్ కు ఫోన్ చేస్తుంది.

Janaki Kalaganaledu 27 Jan Today Episode : బాంబును నిర్వీర్యం చేసిన జానకి

కానీ.. ఆ బాంబును నిర్వీర్యం చేసేందుకు జానకి ప్రయత్నిస్తుంది. వద్దు అని చెప్పినా కూడా వినకుండా జానకి బైక్ లో ఉన్న కటింగ్ ప్లేయర్ ను తీసుకొని బాంబు పేలకుండా.. దాని వైరును కట్ చేస్తుంది. దీంతో బాంబు నిర్వీర్యం అయిపోతుంది. దీంతో అందరూ సంతోషిస్తారు. చప్పట్లు కొడుతారు.

బాంబు ఇక పేలదు అత్తయ్య గారు అని చెబుతుంది జానకి. ఎంత పిలిచినా నువ్వు ఎందుకు రాలేదు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్నాం.. అని చెబుతుంది జ్ఞానాంబ. దేవుడి దయ వల్ల ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. ఇంకా జరగరానిది ఏదైనా జరిగి ఉంటే ఏమయ్యేది చెప్పు అంటుంది జ్ఞానాంబ.

శభాష్ జానకి అంటాడు గోవిందరాజు. జానకి గారు.. మీరు ప్రాణాలకు ప్రమాదం అని తెలిసి కూడా మీరు ఎంత చాకచక్యంగా ఆలోచించారు. మీకు హ్యాట్సాఫ్ అండి అంటాడు రామా. అందరూ తనను ప్రశంసల్లో ముంచెత్తుతారు. మల్లికకు ఏం అర్థం కాదు.

ఎమ్మెల్యే కూడా జానకిని పొగుడుతుంది. ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు. బాంబ్ స్క్వాడ్ వెళ్లి అక్కడ సెర్చ్ చేస్తారు. బాంబును తీసి అప్పటికే దాన్ని డిఫ్యూజ్ చేశారు అని చెబుతారు. దీంతో పోలీస్ షాక్ అవుతాడు. ఎవరు ఈ బాంబ్ ను డిఫ్యూజ్ చేశారు అని అడుగుతాడు పోలీస్.

నేనే అని చెబుతుంది జానకి. మీకు ఈ విషయాలు ఎలా తెలుసు అని అడుగుతాడు పోలీస్. ఏం చదువుకున్నారు అని అడుగుతాడు. డిగ్రీ అంటుంది. మరి ఇవన్నీ నీకు ఎవరు చెప్పారు అని అడుగుతాడు. ఎప్పుడో చదువుకున్నట్టు గుర్తు అని చెబుతుంది జానకి.

దీంతో పోలీసు తనను మెచ్చుకొని మీలాంటి వాళ్లు పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉండాలి అని చెబుతాడు. మిమ్మల్ని ఐపీఎస్ చదివించేందుకు డీజీపీతో మాట్లాడుతాం అని హామీ ఇస్తాడు పోలీస్. దీంతో జానకి చాలా సంతోషిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది