Shilpa Shetty : శిల్పాశెట్టికి బ‌ల‌వంతంగా ముద్దులు పెట్టిన న‌టుడు.. ఇద్ద‌రిపై కేసు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shilpa Shetty : శిల్పాశెట్టికి బ‌ల‌వంతంగా ముద్దులు పెట్టిన న‌టుడు.. ఇద్ద‌రిపై కేసు..!

 Authored By sandeep | The Telugu News | Updated on :26 January 2022,10:00 pm

Shilpa Shetty : శిల్పా శెట్టి.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. అన్ని భాష‌ల‌లోను అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. ఆమె ప్ర‌స్తుత వయ‌స్సు 45 సంవత్సరాలు.. అయినా చెక్కుచెదరని అందంతో ఆకట్టుకుంటోంది ఈ మంగుళూరు భామ. యోగాసాన‌లాతో ఎప్పూడూ ఫిట్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు ట‌చ్‌లో ఉంటుంది. పేరుకు బాలీవుడ్ భామ అయిన శిల్పా శెట్టికి తెలుగు సినిమాలతో మంచి అనుబంధమే ఉంది. ఈమె త్వరలో ఓ ప్యాన్ ఇండియా తెలుగు ప్రాజెక్ట్‌తో పలకరించబోతున్నట్టు సమాచారం. అయితే ఈ అమ్మ‌డి పాత కేసుకి సంబంధించి ఇప్పుడు ఊర‌ట ల‌భించింది.

2007లో రాజస్థాన్ లో జరిగిన ఎయిడ్స్ ఈవెంట్ కు శిల్పా శెట్టి, హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ అతిథులుగా హాజరయ్యారు. ఎయిడ్స్ అవేర్నెస్ కార్యక్రమంలో శిల్పా శెట్టి అందానికి రిచర్డ్ గేర్ ముగ్ధుడయ్యాడు. వేదికపైనే శిల్పా శెట్టిని తన కౌగిలిలో బంధించి ముద్దుల వర్షం కురిపించాడు. బహిరంగంగా అసభ్యంగా ముద్దులు అంటూ శిల్పా శెట్టిపై, రిచర్డ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇద్దరిపైనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ శిల్పా శెట్టిపై కేసు ఎందుకు అనే అనుమానం రావచ్చు. రిచర్డ్ గేర్ బలవంతమా ముద్దులు పెడుతున్నప్పటికీ శిల్పా శెట్టి ఏమాత్రం ప్రతిఘటించలేదు అనేది ఆరోపణ.

shilpa shetty came out as the victim

shilpa shetty came out as the victim

Shilpa Shetty : నాజూకు భామ నిర్దోషి అని తేలిందిగా..!

ఈ కేసుపై తాజాగా విచార‌ణ జ‌రిపిన న్యాయ స్థానం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో శిల్పా శెట్టి నిందితురాలు కాద‌ని బాధితురాలు అని చెప్పుకొచ్చింది. ఆ మ‌ధ్య రాజ్‌కుంద్రా కేసులో కూడా శిల్పా శెట్టి ప‌లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంది. కొద్ది రోజుల త‌ర్వాత తాను నిర్ధోషి అని తేలింది. 45 ఏళ్ల శిల్పా శెట్టి ప్ర‌స్తుతం ప‌లు టీవీ ఛానల్స్‌కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తుంది. అప్పుడప్పుడు ఈ ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలో షేర్ చేసే పిక్స్ కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్న‌యి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది