Janaki Kalaganaledu 28 June Today Episode : జ్ఞానాంబను అవమానించిన కామాక్షి.. మనవడిని కని ఇవ్వాలంటూ జానకిని కోరిన జ్ఞానాంబ.. జానకి మాట ఇస్తుందా?

Janaki Kalaganaledu 28 June Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 జూన్ 2022, మంగళవారం ఎపిసోడ్ 332 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కామాక్షి మనవరాలు బారసాల ఫంక్షన్ లో జానకిని విశేషం ఏం లేదా అని అడుగుతుంది కామాక్షి. దీంతో జానకికి ఏం చెప్పాలో అర్థం కాదు. ఏవమ్మా జ్ఞానాంబ కోడళ్లారా.. కనీసం మంగళహారతి పాటలు అయినా వచ్చా అని అడుగుతుంది కామాక్షి. నాకు బ్రహ్మాండంగా వచ్చు అంటుంది మల్లిక. కాకపోతే పెద్ద కోడలు ఉండగా చిన్నకోడలు పాడితే బాగుండదు కదా. అందుకే మా జానకి పాడుతుంది అంటుంది మల్లిక. దీంతో జానకికి ఏం చేయాలో అర్థం కాదు. ఏం కాదు పాడు అంటుంది జ్ఞానాంబ. దీంతో సరే అని పాపాయిని ఎత్తుకొని పాట పాడటం మొదలుపెడుతుంది. లాలీ లాలీ లాలీ లాలీ.. అంటూ పాట పాడటం స్టార్ట్ చేస్తుంది. వటపత్ర సాయికి అంటూ పాడుతుంది.

Advertisement
janaki kalaganaledu 28 june 2022 full episode
janaki kalaganaledu 28 june 2022 full episode

దీంతో అందరూ తనను మెచ్చుకుంటారు. నువ్వు, నీ కోడళ్లు రావడంతో ఫంక్షన్ కే కల వచ్చింది అంటారు అందరూ. మీరు మాత్రం మీ ఇద్దరు కోడళ్లతో కలిసి వచ్చారు. మీరు చాలా గ్రేట్ అని అందరూ అంటే.. మా అత్తయ్య గారు మిమ్మల్ని కోడళ్లలా కాదు.. కూతుళ్లలా చూసుకుంటారు అని అంటుంది జానకి. దీంతో నేను కూడా ఓ రెండు మాటలు అంటా అని చెప్పి గుడిలో అమ్మ వారు.. మా అత్తయ్య గారు ఇద్దరూ ఒకటే అంటుంది మల్లిక. ఆ తర్వాత వసు ఇక మేము వెళ్లి వస్తాం అని అంటుంది జ్ఞానాంబ. మీ ఇంట్లో బారసాలకు మిమ్మల్ని అందరినీ ఎప్పుడు పిలుస్తావా అని అంతా ఎదురు చూస్తున్నాం అని అడుగుతుంది కామాక్షి. దీంతో ఏడాది తిరిగేసరికి అల్లా మిమ్మల్ని అందరినీ మీ ఇంట్లో బారసాలకు పిలుస్తా అన్నావు కదా. ఏడాది దాటింది కానీ.. ఎలాంటి పిలుపు లేదు. మీ కోడళ్ల వైపు నుంచి ఎలాంటి శుభవార్త లేదు. ఏంటి జ్ఞానాంబ సమస్య. మనలో మన మాట జ్ఞానాంబ. మీ కోడళ్లలో ఏదైనా లోపమా అని అడుగుతుంది. లేదంటే ఇంకా ఏదైనా కారణమా అని అడుగుతుంది.

Advertisement

పోనీ ఒకసారి హాస్పిటల్ కు తీసుకెళ్లకపోయావా అని అడుగుతుంది కామాక్షి. ఒకవేళ హాస్పిటల్ చుట్టూ తిరగడం కూడా అయిపోయిందా ఏంటి. మీ ఇంటికి వారసులు పుట్టరని డాక్టర్లు చెప్పేశారా ఏంటి అని అడుగుతుంది. సరేలే.. ఆశపడితే జరుగుతుందా.. రాసి పెట్టి ఉండాలి కదా. బాధపడకుండా గుండె రాయి చేసుకొని ప్రశాంతంగా ఉండు అంటుంది కామాక్షి.

దీంతో నువ్వు మిమ్మల్ని అందరిలో బాధపడుతున్నవు. నీ ఉద్దేశం ఏంటో.. నీ మనసులో ఉన్నది ఏంటో నాకు తెలుసు.. అంటుంది జ్ఞానాంబ. దీంతో నువ్వు ఏడాది క్రితం నువ్వు చాలెంజ్ చేసిన విషయం నిజమా కాదా చెప్పు అని అడుగుతుంది కామాక్షి.

నేనే కాదు.. అందరూ అడుగుతారు. అడిగిన వాళ్లను అందరినీ ఇలా తిడుతూ పోతావా ఏంటి.. అంటుంది. దీంతో నెల తిరిగే కళ్లా నా కోడళ్లు నెల తప్పారు అనే శుభవార్త నీకు చెబుతాను అంటుంది జ్ఞానాంబ. దీంతో అంతకంటే కావాల్సింది ఏముంది అంటుంది కామాక్షి.

ఇంకోసారి మాట పోనిచ్చుకోకుండా చూసుకో అంటుంది కామాక్షి. దీంతో అలా జరిగితే ఇంకోసారి నేను ఇలాంటి ఫంక్షన్లకే రాను. ఇదే చివరిది అని చెప్పి అక్కడి నుంచి కోడళ్లను తీసుకొని ఇంటికి వెళ్తుంది జ్ఞానాంబ. ఇంటికొచ్చాక ఫంక్షన్ బాగా జరిగిందా అని అడుగుతాడు గోవిందరాజు.

దీంతో మాట్లాడుకుండానే వెళ్లిపోతుంది జ్ఞానాంబ. ఏమైంది అని అనుకుంటాడు గోవిందరాజు. తర్వాత జానకిని ఏమైంది అని అడుగుతాడు. దీంతో ఫంక్షన్ లో ఏం జరిగిందో గోవిందరాజుకు చెబుతుంది జానకి. దీంతో ఏం చేయాలో గోవిందరాజుకు అర్థం కాదు.

Janaki Kalaganaledu 28 June Today Episode : ఇద్దరు కోడళ్లను పిలిచి.. పిల్లల గురించి అడిగిన జ్ఞానాంబ

కానీ.. బాగా ఆలోచించి.. ఇద్దరు కోడళ్లను పిలుస్తుంది జ్ఞానాంబ. ఎప్పుడు పిల్లలను కనాలో నేను చెప్పను. పిల్లలను కనండి అని ఇబ్బంది పెట్టను కానీ.. అర్థం చేసుకుంటారని నా బాధను చెబుతున్నాను. ఇందాక బారసాలలో చూశారు కదా. వచ్చిన వాళ్లు ఎలా మాట్లాడారో.

అలాంటి మాటలు.. వినడం ఇదే మొదటిసారి కాదు అని అంటుంది జ్ఞానాంబ. అయినా వాళ్లు వీళ్లు అడుగుతున్నారు అనేది పక్కన పెడితే.. మనవడితోనో.. మనవరాలితోనో ఆడుకోవాలనే ఆశ నాకూ ఉంది అంటుంది జ్ఞానాంబ. ఈ విషయం మీకు కూడా చాలా సార్లు చెప్పాను.

కానీ.. ఆ ఆశ బాధగానే మిగిలిపోయింది. ఆ బాధను ఇంకా ఇంకా భరించే శక్తి నాకు లేదు అంటుంది జ్ఞానాంబ. అందుకే.. చెప్పడమే తప్ప అడగడం తెలియని నేను మొదటి సారి అడుగుతున్నాను. మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీరు నాకు ఒక మనవడినో.. మనవరాలినో ఇవ్వండి అమ్మ అంటుంది జ్ఞానాంబ.

ఇప్పటి దాకా మీరు పిల్లలను ఎందుకు వద్దనుకున్నారో కారణాలు నేను అడగను. కానీ.. ఇప్పటికైనా నా బాధను అర్థం చేసుకోమని బతిమిలాడుతున్నాను. ఈ ఇంటికి వారసుడిని ఇస్తామని మాటివ్వండి అంటుంది జ్ఞానాంబ. తను చెప్పే విషయాలను వింటాడు రామా.

ఇద్దరినీ మాట ఇవ్వాలంటూ జ్ఞానాంబ కోరుతుంది. దీంతో ఇద్దరూ కాసేపు ఆలోచిస్తారు. ఎదుటి వాళ్ల బాధను నువ్వు చెప్పకుండానే అర్థం చేసుకుంటావు. మరి ఈ అత్తయ్య బాధను నువ్వు ఇంకా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అని అడుగుతుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement