Janaki Kalaganaledu 28 Sep Today Episode : వ్రతాన్ని చెడగొట్టే ప్లాన్ చేసింది మల్లికే అని జ్ఞానాంబకు తెలుస్తుందా? జానకికి తెలిసి ఏం చేస్తుంది?
Janaki Kalaganaledu 28 Sep Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 సెప్టెంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 398 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పద్ధతులు తెలియని అమ్మాయిని పూజ మీద ఎలా కూర్చోబెట్టారు అని ముత్తయిదువులు జ్ఞానాంబను అంటారు. ఆ తర్వాత జానకిని మంగళహారతి పాట పాడమని పంతులు చెబుతాడు. దీంతో సరే అని వేవేళ జగదీశ్వరి అని పాట పాడుతూ ఉంటుంది. ఇంతలో మల్లిక.. జెస్సీని ఇరికించడం కోసం నువ్వు కూడా జానకితో పాటు పాడు.. అత్తయ్య గారు మెచ్చుకుంటారు అని అంటుంది మల్లిక. దీంతో సరే అని పాడుతుంది. కానీ.. తనకు పాట సరిగ్గా పాడటం రాకపోవడంతో అందరూ తనను చూసి నవ్వుతారు. జ్ఞానాంబకు కోపం వస్తుంది. ఆచారం తెలియని పిల్లను పూజలో ఎందుకు కూర్చోబెట్టారు అంటూ జ్ఞానాంబను అడుగుతారు ముత్తయిదువులు.
పూజ పూర్తయ్యాక.. అమ్మవారికి నైవేద్యం పెట్టి ముత్తయిదువులకు వాయినం ఇస్తే పూజ పరిపూర్ణం అవుతుంది అని చెబుతాడు పూజారి. దీంతో సరే అంటుంది జ్ఞానాంబ. అందరూ హారతి తీసుకోండి అంటాడు పూజారి. క్లాత్ పక్కనే హారతి పెడతాడు పంతులు. దీంతో అది అంటుకోవడం ఖాయం అని అనుకుంటుంది నీలావతి. పూజ పూర్తయింది. ఇక ముత్తయిదువులకు వాయినాలతో పాటు ఉండ్రాళ్లు ఇవ్వండి అంటాడు పంతులు. ఇంతలో వాయినాల్లో పెట్టిన జాకెట్లు మంటల్లో కాలిపోతాయి. దీంతో అందరూ షాక్ అవుతారు. వెంటనే జానకి వెళ్లి ఆ మంటలను ఆపేందుకు ప్రయత్నిస్తుంది కానీ.. ఆ మంటలు మాత్రం ఆగవు. వాయినం తగలబడిపోతుంది అయ్యయ్యో అంటూ అరుస్తుంది మల్లిక. మొత్తానికి మనం అనుకున్నది జరిగింది అని అనుకుంటుంది నీలావతి.
అమ్మవారికి ఆగ్రహం కలిగింది. అందుకే అగ్ని ద్వారా అశుభం అని చెప్పింది అని అంటారు ముత్తయిదువులు. అంటే మనం వాయినం తీసుకుంటే మన పసుపుకుంకుమలు కూడా అమ్మవారి కోపానికి బలయిపోతాయనా మీ అనుమానం అని అంటుంది నీలావతి. దీంతో అందులో అబద్ధం ఏముంది అంటారు.
Janaki Kalaganaledu 28 Sep Today Episode : జానకిని ఆశీర్వదించిన జ్ఞానాంబ
వాయినాలు తీసుకోకుండా వెళ్లబోతుంటే అందరినీ ఆపే ప్రయత్నం చేస్తుంది జానకి. వాయినాలు తీసుకోకుండా వెళ్తే మరీ అశుభం అంటుంది జ్ఞానాంబ. మాకు అక్షింతలు వేసి.. మిమ్మల్ని ఆశీర్వదించి ఈ వ్రతాన్ని సంపూర్ణం చేయండి అని జానకి.. జ్ఞానాంబను వేడుకుంటుంది.
దీంతో సరే అంటుంది జ్ఞానాంబ. వాయినం తీసుకొని ఆ వాయినాన్ని తీసుకుంటుంది జ్ఞానాంబ. తనకు అక్షింతలు వేస్తుంది జ్ఞానాంబ. మల్లిక ఆశీర్వాదం తీసుకో అంటుంది జానకి. తర్వాత జెస్సీని కూడా ఆశీర్వాదం తీసుకో అంటుంది జానకి. కానీ.. జెస్సీ ఎందుకో భయపడుతుంది.
ఆశీర్వాదం తీసుకో అని చెబుతుంది జానకి. దీంతో జ్ఞానాంబ దగ్గరికి వెళ్తుంది జెస్సీ. దీంతో జెస్సీని కూడా ఆశీర్వదిస్తుంది జ్ఞానాంబ. వెన్నెల, చికిత కూడా తన ఆశీర్వాదం తీసుకుంటారు. దీంతో వ్రతం ఫలించినట్టే అని చెబుతాడు పూజారి. మరోవైపు రామా బైక్ మీద వెళ్తుంటే కాలేజీ ప్రిన్సిపల్ కారు ఆపుతుంది.
జానకి గురించి మాట్లాడాలని నేను మీ ఇంటికే బయలుదేరాను అని అంటుంది ప్రిన్సిపల్. జానకి చాలా తెలివి కళ్లది అని చెబుతుంది. కారణం తెలియదు కానీ.. జానకి ఈ మధ్య క్లాస్ లకు సరిగ్గా రావడం లేదు. ఈ మధ్య పరీక్ష కూడా రాయలేదు. మిస్ అవకుండా క్లాసెస్ కు రావాలి అని చెబుతుంది.
వాటి మీద దృష్టి పెట్టమని చెప్పండి అంటుంది ప్రిన్సిపల్. మెయిన్స్ పూర్తి కాగానే ట్రెయినింగ్ ఉంటుంది. దాని కోసం శారీరకంగా దృఢంగా ఉండాలి. వ్యాయామం కూడా మొదలుపెట్టమని చెప్పండి అంటుంది ప్రిన్సిపల్. దీంతో సరే అంటాడు రామా. కట్ చేస్తే జ్ఞానాంబ ఇంకా వ్రతం గురించే ఆలోచిస్తూ ఉంటుంది.
గోవిందరాజుతో జ్ఞానాంబ మాట్లాడటం వింటుంది జానకి. కష్టమే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తోంది.. అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.