Janaki Kalaganaledu 31 Jan Today Episode : జానకికి చదువంటే ప్రాణం అని జ్ఞానాంబకు చెప్పిన రామా.. దీంతో జ్ఞానాంబ షాకింగ్ నిర్ణయం.. ఇంతలో మరో ట్విస్ట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janaki Kalaganaledu 31 Jan Today Episode : జానకికి చదువంటే ప్రాణం అని జ్ఞానాంబకు చెప్పిన రామా.. దీంతో జ్ఞానాంబ షాకింగ్ నిర్ణయం.. ఇంతలో మరో ట్విస్ట్

Janaki Kalaganaledu 31 Jan Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 31 జనవరి 2022, సోమవారం ఎపిసోడ్ 226 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంటికి వచ్చాక జ్ఞానాంబ సైలెంట్ గా కూర్చుంటుంది. దీంతో మల్లిక కావాలని రెచ్చగొడుతుంది. జానకిపై ఆరోపణలు చేస్తుంది. విలేకరులతో కావాలనే జానకి అడిగించిందని చెబుతుంది. దీంతో జానకి, రామా షాక్ అవుతారు. ఆ తర్వాత జ్ఞానాంబ మాట్లాడుతుంది. నువ్వు చెప్పే విషయ […]

 Authored By gatla | The Telugu News | Updated on :31 January 2022,10:30 am

Janaki Kalaganaledu 31 Jan Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 31 జనవరి 2022, సోమవారం ఎపిసోడ్ 226 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంటికి వచ్చాక జ్ఞానాంబ సైలెంట్ గా కూర్చుంటుంది. దీంతో మల్లిక కావాలని రెచ్చగొడుతుంది. జానకిపై ఆరోపణలు చేస్తుంది. విలేకరులతో కావాలనే జానకి అడిగించిందని చెబుతుంది. దీంతో జానకి, రామా షాక్ అవుతారు. ఆ తర్వాత జ్ఞానాంబ మాట్లాడుతుంది. నువ్వు చెప్పే విషయ ఏదో అక్కడ స్పష్టంగా చెప్పనందుకే నాకు బాధేస్తోంది అంటుంది జ్ఞానాంబ. నాకు ఐపీఎస్ చదువుకోవడం ఇష్టం లేదు అని డైరెక్ట్ గా అక్కడే చెప్పొచ్చు కానీ.. నేను ఇప్పుడే దాని గురించి సమాధానం చెప్పలేను అని అన్నావంటే దాని అర్థం ఏంటి.. నీ మనసులో ఇంకా చదువుకోవాలని ఉన్నట్టే కదా అంటుంది జ్ఞానాంబ.

janaki kalaganaledu 31 january 2022 full episode

janaki kalaganaledu 31 january 2022 full episode

నిన్ను నేను శాసిస్తున్నాను అని అర్థం వచ్చేలా అక్కడ ప్రవర్తించావు. నువ్వు చదువుకున్న తెలివిని అక్కడ బాగా ఉపయోగించావు.. శెభాష్ అంటుంది జ్ఞానాంబ. అలా కాదు అత్తయ్య గారు.. మైరావతి అమ్మమ్మ గారు నన్ను అపార్థం చేసుకున్నా మీరు అర్థం చేసుకున్నారు. కన్నబాబు విషయంలో కూడా మీరు నన్ను అర్థం చేసుకున్నారు. ఈ విషయంలో కూడా నేను ఎందుకు అలా అన్నానో పెద్దమనసుతో దయచేసి అర్థం చేసుకోండి అత్తయ్య గారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జానకి. అవును అమ్మ.. జానకి గారు మీ పరువు తీసేలా ఎప్పటికీ ప్రవర్తించరు అని చెప్పి రామా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

కట్ చేస్తే లాయర్ కు ఫోన్ చేస్తుంది మల్లిక. నాకొక హెల్ప్ చేయాలి అంటుంది. విడాకులు కావాలి అంటుంది. మా అత్తయ్య గారితో నాకు విడాకులు కావాలి. నాకు మా అత్తయ్యకు పడట్లేదు. ఏం చేయాలో చెప్పండి అని అడుగుతుంది. దీంతో మీకు హైదరాబాద్ లో ఎర్రగడ్డ తెలుసా అని అడుగుతాడు లాయర్. ఎందుకు అంటే.. అక్కడున్న మెంటల్ ఆసుపత్రిలో చేరండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.

విష్ణు వచ్చి నువ్వు ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా.. పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నావు ఏంటి అంటాడు. మరోవైపు జానకి సీరియస్ గా ఐపీఎస్ కు ప్రిపేర్ అవుతూ ఉంటుంది. మధ్యలో తనకు ఏదో గుర్తుకు వస్తుంది. ఇంతలో రామా వస్తాడు. ఏమైందండి.. ఈరోజుకు చదువుకోవడం పూర్తయిందా అంటాడు.

Janaki Kalaganaledu 31 Jan Today Episode : అత్తయ్యగారికి తెలియకుండా ఐపీఎస్ చదువుతున్నానని తెలిస్తే అత్తయ్య గారు ఏం అనుకుంటారో అన్న జానకి

దీంతో ఎందుకో చదవాలనే ఇంట్రెస్ట్ రావడం లేదు అంటుంది జానకి. మీరు ఎందుకు ఇలా ఉన్నారో నాకు అర్థం అయింది. అమ్మ మిమ్మల్ని అలా అన్నదని బాధపడుతున్నారా. మీకో విషయం చెప్పనా.. ఎటువంటి అడ్డంకులు వచ్చినా మీరు ముందుకు వెళ్లాలి కానీ.. మీ సంకల్పాన్ని వదిలేస్తారా అంటాడు.

అత్తయ్య గారికి తెలియకుండా నేను చదువుకుంటున్నానని తెలిస్తే ఇంకేమైనా ఉందా చెప్పండి అంటుంది జానకి. నాకు భయంగా ఉందండి అంటుంది జానకి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను జానకి గారు అంటాడు. నేను అమ్మతో మాట్లాడుతాను. జానకి గారికి ఐపీఎస్ కల ఉంది. అర్థం చేసుకొని చదివిద్దాం అంటాను అంటాడు.

భలే ఉన్నారు రామా గారు. అలా చెప్తే ఇంకేమైనా ఉందా? గొడవలు మామూలుగా ఉండవు అంటుంది. ఏం కాదు.. నేను అమ్మతో మాట్లడుతాను.. ఒప్పిస్తాను అంటాడు రామా. మరోవైపు పోలీసులు జ్ఞానాంబ ఇంటికి వస్తారు. దీంతో మల్లిక టెన్షన్ పడుతుంది. నాకోసం ఎక్కడ వచ్చారో అని భయపడుతుంది.

కానీ.. వాళ్లు వచ్చింది జానకి కోసం. మరోవైపు రామా.. జానకి ఐపీఎస్ చదువు గురించి జ్ఞానాంబకు చెబుతాడు. జానకి గారు ఐపీఎస్ చదివితే సమాజానికి గొప్ప సేవ చేస్తారని పోలీస్ శాఖ మొత్తం కోరుకుంటోంది.. అంటాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు అంటుంది జ్ఞానాంబ.

దీంతో జానకి గారిని ఐపీఎస్ చదివిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం అంటాడు రామా. దీంతో జ్ఞానాంబ, గోవిందరాజు షాక్ అవుతారు. చాలా పట్టుదల ఉన్న మనిషి. అన్నింటికి మించి చదువు అంటే ప్రాణం అమ్మ అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది