Janaki Kalaganaledu 31 March Today Episode : రామాకు జానకి విడాకులు? ఈ విషయం తెలిసి జ్ఞానాంబ సంతోషిస్తుందా? రామాను ఇంట్లోకి రానిస్తుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu 31 March Today Episode : రామాకు జానకి విడాకులు? ఈ విషయం తెలిసి జ్ఞానాంబ సంతోషిస్తుందా? రామాను ఇంట్లోకి రానిస్తుందా?

 Authored By gatla | The Telugu News | Updated on :31 March 2022,11:30 am

Janaki Kalaganaledu 31 March Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 31 మార్చి 2022, గురువారం ఎపిసోడ్ 269 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాత్రి పూట.. జానకి, రామా ఇద్దరూ కిందనే పడుకుంటారు. ఉదయం లేవగానే.. జానకి బయట కట్టెలపొయ్యి మీద వంట వండుతూ ఉంటుంది. అప్పుడే తన ఫ్రెండ్ జానకి వస్తుంది. జానకిని చూసి షాక్ అవుతుంది. ఏంటి ఇదంతా అంటుంది. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి అంటుంది. గుడిసె లాంటి ఈ ఇల్లు ఏంటి.. ఆ పొయ్యి ఏంటి.. అసలు నీకు ఈ అవస్థలు ఏంటి అంటుంది శ్రావణి.

janaki kalaganaledu 31 march 2022 full episode

janaki kalaganaledu 31 march 2022 full episode

కానీ.. జానకి ఏం చెప్పదు. ఏం జరిగిందో నేను ఊహించగలను. మీ అత్తయ్య ఎంతటి మూర్ఖురాలో నేను ఊహించగలను అంటుంది శ్రావణి. ప్రతి చిన్న విషయానికి ఆవిడ నిన్ను అంతలా వెనకేసుకొస్తుంటే నువ్వు ఇంకా ఇలా మాట్లాడుతున్నావేంటి అంటుంది శ్రావణి. మంచి పొజిషన్ లో ఉండాల్సిన నీకు ఈ కర్మేంటి అంటుంది. అందుకే.. నా మాట విని విడాకులు ఇచ్చేయ్ అంటుంది శ్రావణి. దీంతో పిచ్చా నీకేమైనా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా నీకు. కుటుంబం అన్నాక గొడవలు రాకుండా ఉంటాయా అని అంటుంది జానకి.

ఆ తర్వాత శ్రావణి.. యోగికి ఫోన్ చేసి.. జానకి పడే అవస్థల గురించి చెబుతుంది. మా చెల్లెలును ఇంత నరకం పెడుతోందా. నా చెల్లెలు పడిన నరకానికి వందరెట్లు ఆ జ్ఞానాంబ పడేలా చేస్తాను అని చెబుతాడు యోగి. దీంతో సరే అని ఫోన్ పెట్టేస్తుంది శ్రావణి.

మరోవైపు నీలావతి.. స్వీటు కొట్టుకు వచ్చి జ్ఞానాంబను రెచ్చగొడుతుంది. ఆ రాముడైనా తండ్రి మాట జవదాటుతాడేమో కానీ.. నా పెద్ద కొడుకు రామా అస్సలు నా మాట జవ దాటడు అని చెప్పావు కానీ.. భార్య మాటలు విని.. తల్లి కళ్లకు గంతలు కట్టాడు అంటుంది నీలావతి.

Janaki Kalaganaledu 31 March Today Episode : మళ్లీ జ్ఞానాంబను రెచ్చగొట్టిన నీలావతి

అప్పుడే జానకి.. రామాకు బాక్స్ తీసుకెళ్తూ ఉంటుంది. అక్కడ ఆగేసరికి.. నీలావతి జానకిని చూస్తుంది. ఇదిగో జానకి. నిన్నే ఇలారా అంటుంది. మీ అత్తను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించావని ఊళ్లో అందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు అంటుంది నీలావతి.

బాగా చదువుకున్న తెలివితేటలు ఉన్న నీ కోడలు కదా. వాళ్ల ఆస్తి వాళ్లకు ఇవ్వమని నీ కొడుకుతో అడిగించకుండా ఉంటుందా అని జ్ఞానాంబతో అంటుంది నీలావతి. మంచికి పోతే చెడు ఎదురు వచ్చిందని నాకెందుకు వచ్చిన గొడవ అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది నీలావతి.

మరోవైపు జ్ఞానాంబ కోసం ఎదురు చూస్తుంటుంది మల్లిక. జ్ఞానాంబ రాగానే జానకి ఫ్రెండ్ శ్రావణి ఇక్కడికి వచ్చిందని చెబుతుంది. జానకి ఆ పిల్లతో ఏమని చెప్పిందో తెలుసా అత్తయ్య. మూర్ఖపు అత్తతో వేగలేకపోతున్నాను.. అమాయకపు భర్తతో ఉండలేకపోతున్నాను. అందుకే విడాకులు ఇచ్చేస్తా అని చెప్పింది అంటుంది మల్లిక.

అన్యాయంగా నువ్వు జానకి మీద ఎందుకు నిందలు వేస్తున్నావు అంటాడు గోవిందరాజు. ఇఫ్పుడే జానకిని అడుగుతా ఆగు అంటాడు గోవిందరాజు. దీంతో అక్కర్లేదు. జానకి నిజంగానే మన రామాకు విడాకులు ఇస్తా అని ఉంటుంది. నేను ఊహించగలను అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది