Jabardasth : రోజా కు మంత్రి పదవి వస్తే… జబర్దస్త్ కి శాస్వత జడ్జ్ ఆమె కావాలంటూ డిమాండ్?
Jabardasth : జబర్దస్త్ కామెడీ షో ప్రారంభమై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని మరికొన్ని నెలల్లో 10 సంవత్సరాల ను జరుపుకోబోతుంది. ఈ పది సంవత్సరాలలో జబర్దస్త్ జడ్జిగా రోజా కొనసాగుతూనే ఉన్నారు. మధ్య లో అనసూయ వెళ్లి పోయినా మళ్ళీ వచ్చింది. రష్మీ వచ్చినప్పటి నుండి కంటిన్యూ అవుతూనే ఉంది. మొదట్లో నాగబాబు జడ్జిగా చేసి ఆయన వెళ్ళి పోయాడు. రోజా మరో పది సంవత్సరాలు అయినా కంటిన్యూ అవుతుందని అంతా భావిస్తున్న సమయంలో త్వరలో జరగబోతున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణ లో ఆమె కు మంత్రి పదవి దక్కడం దాదాపుగా కన్ఫామ్ అయ్యింది. దాంతో రోజా మంత్రిగా జబర్దస్త్ జడ్జి కుర్చీలో కూర్చునే అవకాశం లేదంటూ తేలిపోయింది.
ఒకవేళ రోజా మంత్రిగా అయితే ఈ జబర్దస్త్ జడ్జ్ సీటు లో కచ్చితంగా ఆమె స్థానంలో ఇంద్రజను కూర్చో బెట్టాలి అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య రోజా లేని సమయంలో ఇంద్రజ జబర్దస్త్ జడ్జ్ గా వచ్చి ఎంతటి సక్సెస్ అయ్యారో అందరికీ తెలిసిందే. ఆమె తిరిగి కావాలంటూ రోజా వచ్చిన సమయంలో కూడా ప్రేక్షకులు కొందరు డిమాండ్ చేశారు. కనుక జబర్దస్త్ పర్మినెంట్ జడ్జిగా ఇంద్రజ ను ఏర్పాటు చేయాలంటూ మల్లెమాల వారికి జబర్దస్త్ అభిమానులు మరియు ఈ టీవీ ప్రేక్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రస్తుతం ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీ జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆమె నవ్వే తీరు కామెడీ ని ఆమె ఆస్వాదించే తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. జబర్దస్త్ కామెడియన్స్ కు ఎదురు లేకుండా ఆమె కామెడీ ని ఎంజాయ్ చేస్తూ.. ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఆమె కింద పడి మరీ నవ్వే విధానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అందుకే ఆమెకి జబర్దస్త్ జడ్జ్ గా పర్మినెంట్ హోదా ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఇంద్రజ జబర్దస్త్ స్టేజి పైకి రాకపోతే ఆమె అభిమానులు సోషల్ మీడియాలో మల్లెమాల వారిని టార్గెట్ చేసే అవకాశాలున్నాయి. రోజా స్థానంలో ఇంద్రజ కాకుంటే ఆమని లేదా లైలా వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. అభిమానులు మాత్రం ఇంద్రజ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.