Bigg Boss OTT Telugu : బిగ్‌బాస్ హౌస్ లో కూడా బిందు మాధవికి ఫ్యాన్స్ పెరుగుతున్నారు
Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్బాస్ నాన్ స్టాప్ విజేతగా బిందు మాధవి నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని, మెల్ల మెల్లగా ఆమె కు లైన్ క్లియర్ అవుతుంది అంటూ బిగ్బాస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ప్రవర్తన మరియు ఆమె అందం తో బయట అభిమానులు మాత్రమే కాకుండా ఆర్మీని సొంతం చేసుకున్న బిందు మాధవి ఇప్పుడు హౌస్ లో కూడా తన మంచితనంతో తన ముక్కుసూటి తనంతో అభిమానులను సొంతం చేసుకుంది. మొదట ఆమెతో కేవలం శివ మాత్రమే ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆమె వద్ద పలువురు కంటెస్టెంట్స్ మద్దతు గా ఉంటున్నారు.
తేజు మొదలుకొని స్రవంతి, అజయ్, మహేష్ తాజాగా నట్రాజ్ మాస్టర్ కూడా ఆమెకు మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆమె స్నేహితుల జాబితాలో వారు అనడం కంటే ఆమె అభిమానుల జాబితాలో ఉన్నారు అందులో ఎలాంటి సందేహం లేదు. బిగ్బాస్ నాన్ స్టాప్ విజేత గా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక మహిళ ఈసారి నిలబడుతుంది అంటూ దాదాపుగా క్లారిటీ వచ్చింది. ఈ సమయంలో ఇంటి సభ్యుల్లో చాలా మంది ఆమె కు మద్దతుగా నిలుస్తున్న కారణంగా కచ్చితంగా ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా విజేత అవ్వడం ఖాయం అనిపిస్తుంది. బిగ్ బాస్ అనగానే ప్రేక్షకులు వివాదాలను గొడవలను కోరుకుంటారు.

bindu madhavi get fans in Bigg Boss OTT Telugu house also
బిందు మాధవి ఆ వివాదాలను గొడవలను ఇవ్వడంతో పాటు ఎంటర్టైన్మెంట్ ను మరియు తనదైన స్టాండ్ తీసుకోవడంలో.. నిర్ణయం తీసుకోవడంలో ముందుండటం లోనూ తనకు తాను సరిసాటి అని పలు సందర్భాల్లో నిరూపించుకుంది. కనుక ఆమె ఖచ్చితంగా ముందు ముందు హౌస్ లో అద్భుతమైన ఆట తీరును కనబర్చుతుంది అనే నమ్మకాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. ఇంటి సభ్యులు కూడా ఆమెకు మద్దతు తెలపడంతో కచ్చితంగా బిందు మాధవి ఇక పై తన ఆటను మరింత ఉత్సాహం తో ముందుకు తీసుకు వెళ్లే అవకాశం ఉంది బిందుమాధవి కి అసలైన పోటీ అఖిల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతను గతంలోనే విజేతగా ఇవ్వాల్సి ఉన్నా రన్నర్ గా నిలిచాడు. ఈసారి విజేతగా నిలిచిందని వచ్చాడు కానీ బిందుమాధవి అతనికి ఛాన్స్ ఇచ్చే లేదు.