janaki kalaganaledu 4 october 2022 full episode
Janaki Kalaganaledu 4 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 అక్టోబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 402 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి పరీక్ష బాగా రాయడంతో రామా చాలా ఆనందంగా ఉంటాడు. వెంటనే ఇంటికి వచ్చి అందరినీ పిలుస్తాడు. జ్ఞానాంబ కూడా వస్తుంది. దీంతో జానకి గారు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు.. అని అందరికీ చెబుతాడు. దీంతో అందరూ సంతోషిస్తారు. జ్ఞానాంబ కూడా సంతోషిస్తుంది. తన చదువును నిర్లక్ష్యం చేయకుండా తన ఆశయ సాధన వైపు అడుగులు వేసింది అని అంటుంది జ్ఞానాంబ. కొంత మంది ఉంటారు. పరమాన్నం వండి పెట్టినా కానీ అందులో స్వయంగా విషం కలుపుకుంటారు అని జెస్సీని ఉద్దేశించి అంటుంది జ్ఞానాంబ.
janaki kalaganaledu 4 october 2022 full episode
ఎన్ని సమకూర్చిన బాధ్యతలను విస్మరించి ఆడపిల్లల భవిష్యత్తు పాడు చేయాలని చూస్తారని అఖిల్ ను ఉద్దేశించి అంటుంది జ్ఞానాంబ. జానకి తులసి వనం లాంటిదైతే.. వాళ్లు కలుపుమొక్క అంటుంది జ్ఞానాంబ. దీంతో కోపంతో అఖిల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. జానకి ఇక నుంచి ఎలాంటి సమస్యలను తలకెత్తుకోకుండా నీ చదువు మీదనే దృష్టి పెట్టు అంటుంది జ్ఞానాంబ. దీంతో సరే అత్తయ్య గారు అంటుంది జానకి. మరోవైపు జెస్సీ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మల్లికకు చాలా కోపం వస్తుంది. జానకి ఐపీఎస్ ఎలా అవుతుందో నేను చూస్తాను అని మనసులో అనుకుంటుంది మల్లిక.
మరోవైపు అఖిల్ కోపంతో బయటికి వెళ్లి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంట్లో ఏ మంచి విషయం జరిగినా దాన్ని అడ్డుపెట్టుకొని అమ్మ నాకు క్లాస్ పీకుతూనే ఉంది. ఇదంతా ఆ జెస్సీ వల్లే.. చా అని అనుకుంటాడు అఖిల్. ఏం చేయాలి అని అనుకుంటాడు. మరోవైపు అఖిల్ ను వెతుక్కుంటూ జెస్సీ తన దగ్గరికి వస్తుంది.
అత్తయ్య గారి గురించి నాకంటే నీకే బాగా తెలుసు కదా. తప్పు చేస్తే, కోపం వస్తే ముక్కుసూటిగా మాట అంటారు కానీ.. చిన్న మంచి పని చేసినా నెత్తి మీద పెట్టుకుంటారని తెలుసు కదా. ఎప్పటిలాగే అత్తయ్య గారు నిన్ను దగ్గరికి తీసుకుంటారు అభి అని అంటుంది జెస్సీ.
నా మనసుకు తీరని గాయం చేసి ఇప్పుడు మాటలతో వెన్న పూస్తున్నావా అని అంటాడు. నన్ను మా అమ్మ అన్ని మాటలు అనడానికి కారణం నువ్వే కదా అంటాడు అఖిల్. నేనా అంటుంది జెస్సీ. నేనేం చేశా అంటుంది జెస్సీ.
దీంతో చేసిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావా అంటాడు అఖిల్. నా పరిస్థితి ఎంత దరిద్రంగా ఉందో చూడు. అయిన దానికి కాని దానికి మా అమ్మ నన్ను తిడుతోంది. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు అఖిల్.
మరోవైపు రాత్రి అయినా పడుకోకుండా రామా ఏదో లెక్కలు వేయడం చూస్తుంది జానకి. ఏంటి అని అడుగుతుంది. దీంతో మీకు పరీక్షల కోసం ఇబ్బంది లేకుండా ఎలా రాసుకోవాలా అని అన్నీ చూసుకుంటున్నాను అని అంటాడు.
తర్వాత జ్ఞానాంబతో మాట్లాడిన జానకి, మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను అంటుంది జానకి. మామూలుగా అయితే మనం బొమ్మల కొలువు పెట్టకపోయినా ఇబ్బంది ఏం లేదు కానీ.. ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరు కడుపుతో ఉన్నారు అంటుంది జానకి.
ఒక్కరికి ఇద్దరు వారసులు రాబోతున్నారు. వాళ్ల ఆరోగ్యం, ఆయుష్షు కోసం అయినా మనం బొమ్మల కొలువు పెట్టాలి. అమ్మ వారి ఆశీస్సులు ఉండాలంటే మనం ఈ వేడుక చేయాలి అత్తయ్య గారు అంటుంది జానకి.
మొన్నటిలా ఎలాంటి అవమానాలు లేకుండా చూసుకునే బాధ్యత నాది. దయచేసి కాదనకండి అత్తయ్య గారు అంటుంది జానకి. దీంతో సరే అని అంటుంది జ్ఞానాంబ. చిన్నపిల్లలను పిలిచి బొమ్మల కొలువు చేస్తావా. మిగిలిన విషయాలు నేను చూసుకుంటానుగా అని మల్లిక అనుకుంటుంది.
ఒకవేళ జానకి బొమ్మల కొలువు నిర్వహిస్తే పోలేరమ్మ మళ్లీ ఆకాశానికి ఎత్తేస్తుంది. నా విలువ ఇంకా దిగజారి పోతుంది. దీన్ని ఎలా చెడగొట్టాలి అని అనుకుంటుంది మల్లిక. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.