Janaki Kalaganaledu 5 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 5 అక్టోబర్ 2021, మంగళవారం 142 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
జ్ఞానాంబ అదే విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. మల్లిక పిల్లలు పుట్టకుండా ట్యాబ్లెట్లు వేసుకోవడం ఏంటి.. అని తెగ ఆలోచిస్తుంటుంది జ్ఞానాంబ. ఇంతలో మల్లిక, విష్ణు ఇద్దరూ అక్కడికి వస్తారు. నువ్వు కీ ఇస్తే ఆడే బొమ్మ వాడు. ఇద్దరూ తోడుదొంగలే.. ఇంతకీ విషయం ఏంటో చెప్పు అని అడుగుతాడు జ్ఞానాంబ భర్త.
మామయ్య గారు.. ఈయన స్నేహితుడి పెళ్లంట.. తప్పకుండా వెళ్లాలట.. అందుకని.. మీ అబ్బాయి చేయి బోసిగా ఉంది. బావ గారి బ్రేస్ లెట్ ఏదైనా ఉంటే ఇస్తే వెంటనే పెళ్లికి వెళ్లి రాగానే ఇచ్చేస్తాడు.. అంటుంది మల్లిక. పెళ్లికి అందరూ మంచి మంచి నగలు వేసుకొని వస్తారు కదా.. అంటుంది. దీంతో జ్ఞానాంబ పదరా.. ఇస్తాను అంటుంది విష్ణును.
వెళ్లి బీరువా లాక్ ఓపెన్ చేసి చూస్తుంది జ్ఞానాంబ. తీరా చూస్తే.. అందులో బ్రేస్ లెట్ ఉండదు. షాక్ అవుతుంది. ఏమైంది అని అక్కడా ఇక్కడా బీరువాలో వెతుకుతుంది జ్ఞానాంబ. కానీ.. బ్రేస్ లెట్ కనిపించదు. కనిపించడం లేదు అంటుంది జ్ఞానాంబ. కనిపించకపోవడం ఏంటి.. సరిగ్గా చూడు అంటాడు తన భర్త.
లేదండి.. ఇందులోనే పెట్టాను నాకు బాగా గుర్తు ఉంది అంటుంది జ్ఞానాంబ. ఒకవేళ రామా తీసుకెళ్లాడేమో అనగానే.. లేదు బావ గారు చేతికి బ్రేస్ లెట్ ఏం పెట్టుకోలేదు అంటుంది మల్లిక.
జానకి ఫీజు కోసం రామా.. బ్రేస్ లెట్ ను అమ్మిన విషయాన్ని ఎలాగైనా జ్ఞానాంబకు చెప్పడం కోసం మల్లిక తెగ ప్రయత్నిస్తుంటుంది. వెంటనే జ్ఞానాంబ భర్త రామాకు ఫోన్ చేస్తాడు. చెప్పండి నాన్నా అంటాడు. అరేయ్ రాముడు.. మీ అమ్మ మాట్లాడుతుందట అంటాడు. రామా నువ్వు బ్రేస్ లెట్ పెట్టుకొని వెళ్లావా.. అని అడుగుతుంది జ్ఞానాంబ.
బీరువాలో నీ బ్రేస్ లెట్ లేదు నాన్నా.. నువ్వు పెట్టుకొని వెళ్లావా అని అడుగుతుంది. లేదమ్మా అని అంటాడు. ఏంటి లేదా.. బీరువాలో కూడా లేదు.. ఏమై ఉంటుంది అని అంటుంది. దీంతో ఏం చెప్పాలో తెలియక సతమతమవుతాడు రామా. ఒకసారి ఇంటికిరా అని అడుగుతుంది.
రామా వస్తున్నాడు అని తెలిసేసరికి.. మల్లిక తెగ ఖుషీ అవుతుంటుంది. రామా కోసం వెయిట్ చేస్తుంటుంది. రామాకు ఏం చేయాలో తెలియదు. ఇంటికి వెళ్లి అమ్మకు ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తాడు. ఇంటికి వెళ్తాడు. రండి బావ గారు రండి.. మీ బ్రేస్ లెట్ ఒకసారి ఇస్తే పెళ్లికి వెళ్లి వస్తాం అని చెబుతుంది మల్లిక.
రామా.. బ్రేస్ లెట్ లేదురా అంటుంది. దీంతో రామాకు ఏం చెప్పాలో అర్థం కాదు. తెలియదు అమ్మ అంటాడు. తెలియదు అని అంత సింపుల్ గా చెబుతావేంట్రా.. అది చాలా అపురూపమైనది. బీరువాలో భద్రంగా పెట్టిన బ్రేస్ లెట్ ఏమైపోయింది అంటుంది.
అత్తయ్య గారు.. బ్రేస్ లెట్ బావ గారి దగ్గర అయినా ఉండాలి లేదా దాన్ని తాకట్టు అయినా పెట్టి ఉండాలి అని చెబుతుంది మల్లిక. దీంతో జ్ఞానాంబ సీరియస్ అవుతుంది. మల్లికను తిడుతుంది.
బావ గారు..జానకి రోజు రాజమంత్రి వెళ్తున్నారు కదా.. జానకి తన మనసులో ఉన్న కోరికను బావ గారిని అడిగి ఉండొచ్చు. భార్య కోరిక కోసం ఆ బ్రేస్ లెట్ ను తాకట్టు పెట్టి ఉండొచ్చు.. నువ్వు బాధపడతావని అలా చెప్పి ఉండొచ్చు అంటుంది మల్లిక. దీంతో రామా షాక్ అవుతాడు.
బావ గారికి అత్తయ్య గారంటే అంత ఇష్టం కదా. తన మీద ఒట్టేసి చెప్పమనండి.. అంటుంది మల్లిక. రామా నీ పుట్టిన రోజుకు ఈ అమ్మ ఇచ్చిన బహుమతి కనపడకుండా పోయిందంటే.. తను నీ మీద వేసిన నిందకు అంతకంటే ఎక్కువ బాధేస్తోంది. చెప్పు నాన్న ఆ బ్రేస్ లెట్ గురించి నీకు ఏం తెలియదని ప్రామీస్ చేయ్.. అంటుంది జ్ఞానాంబ. అప్పుడు కానీ.. విష్ణుకు మల్లిక ప్లాన్ అర్థం కాదు.
ఒట్టేసి చెప్పు.. అని జ్ఞానాంబ అనగానే.. రామా ఒట్టు వేయబోతాడు. ఇంతలో జానకి అక్కడికి వచ్చి.. నేను చెబుతాను అత్తయ్య గారు అంటుంది. అత్తయ్య గారు.. ఆ బ్రేస్ లెట్ ఇదేనా.. అని అడుగుతుంది. దీంతో జ్ఞానాంబ చూసి ఇదే ఆ బ్రేస్ లెట్ అంటుంది. ఇదేనమ్మా.. ఎక్కడ దొరికింది నీకు అని అడుగుతుంది. రూమ్ లో పడిపోయింది అని అంటుంది. ఆయన మరిచిపోయి ఉండొచ్చు అని అంటుంది. భార్య కోసం తాకట్టు పెట్టి ఉంటాడని పిచ్చి పిచ్చిగా మాట్లాడావు కదా.. ఇప్పుడు నోట్లో నుంచి మాట రావడం లేదేంటి.. అని మల్లికను ప్రశ్నిస్తుంది జ్ఞానాంబ. నా కొడుకు గురించి ఇంకోసారి ఇలా అబద్ధాలు చెప్పావో అస్సలు బాగోదు.. అని వార్నింగ్ ఇస్తుంది జ్ఞానాంబ.
ఒరేయ్ విష్ణు.. ఇదిగో తీసుకో.. జాగ్రత్త అని చెప్పి జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మనం ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది.. అని అనుకుంటుంది మల్లిక.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.