Karthika Deepam 5 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ 5 అక్టోబర్ 2021 తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 1162 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పెద్దోడా.. లైఫ్ లో అన్నింటిని ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలంటూ సౌందర్య.. కార్తీక్ కు చెబుతుంది. ఒకటో రెండో అంటే ఓకే.. ఎవ్వరైనా ఎదుర్కొంటారు. కానీ.. వరుసగా నన్ను ఇలాంటి ఘటనలు బాధపెడుతుంటే ఎలా బతికేది. నాకు ఆరోగ్యం బాగోలేదు అన్నట్టు కాదు.. ఆస్తి లేదన్నట్టు కాదు.. అన్నీ ఉన్నా.. మనశ్శాంతి లేకుండా బతుకుతున్నాను.
ఒకప్పుడు ఎవ్వరూ లేరు. ఇప్పుడు అందరూ ఉన్నారు. అయినా కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. హిమను చూశావు కదా.. నన్ను చూస్తేనే దూరంగా వెళ్లిపోతోంది. నాతో మాట్లాడటం లేదు.. అంటాడు కార్తీక్.
పెద్దోడా.. నీకు ఒక విషయం చెప్పనా? ఒకసారి దీప గురించి కూడా ఆలోచించు. దీప కూడా చాలా బాధపడుతోంది. ఓవైపు నువ్వు, మరోవైపు పిల్లలు.. తన కూడా ఎంత కాలం ఓపిక పడుతుంది చెప్పు. ప్రతి విషయాన్ని పిల్లలు గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు. పిల్లలను కూడా ధైర్యంగా ఉంచేలా చేయాలి. పిల్లలను హాస్టల్ వేసేంత పరిస్థితి కూడా లేదు. పిల్లలను స్కూల్ కు పంపిస్తే అక్కడ ఎవరో ఏదో అంటారని అదో పెద్ద సమస్య. ఇప్పుడు ఏం చేయాలి. పిల్లలను కనీసం స్కూల్ కు పంపిస్తే అయినా దీప ప్రశాంతంగా ఉంటుంది.. అంటాడు కార్తీక్. మరి నువ్వు.. అని అడిగితే నేను కూడా రేపటి నుంచి ఆసుపత్రికి వెళ్తాను. ఆపరేషన్స్ ఉన్నాయ.. అంటాడు కార్తీక్.
కట్ చేస్తే.. దీప.. తీవ్రంగా ఆలోచిస్తుంటుంది. ఒంటరిగా అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తుంటుంది. హిమ చెప్పిన విషయాన్నే గుర్తు తెచ్చుకుంటుంది. ఈ పిల్లలకు ఏమైంది. రోజురోజుకు సమాధానాలు చెప్పలేని ప్రశ్నలను సంధిస్తున్నారు. అసలు ఆ పేపర్ చూశారా? చూడలేదా? అని అనుకుంటుంది దీప.
మోనిత జైలుకు వెళ్లింది కానీ.. దాని క్రూరత్వం, రాక్షసత్వం ఇంకా ఈ ఇంటి మీద చూపిస్తూనే ఉంది. ఏం చేయాలి.. డాక్టర్ బాబు అమెరికాకు వెళ్దాం అంటున్నారు. ఇంతలోనే పిల్లలతో ఫీజు కట్టించారు. 18 నెలలు.. ఎలా.. అని వారణాసి చెప్పిన మాటలను కూడా గుర్తు తెచ్చుకుంటుంది. ఒక వేళ పిల్లో పిలగాడో పుడితే ఎలా.. అని అనుకుంటుంది.
జైలులో మోనితకు కడుపులో నొప్పి వస్తుంది. తన గదిలో కూర్చొని తెగ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో జైలులో ఉన్న పోలీసులు వచ్చి తన గది ఓపెన్ చేస్తారు. తను తీవ్రంగా ఇబ్బంది పడుతుంటుంది. మోనిత ఏమైంది అంటే.. నాకు హార్ట్ ఎటాక్ వచ్చింది ఆసుపత్రికి తీసుకెళ్లండి.. అంటుంది. వెంటనే పోలీసులు అంబులెన్స్ కు కాల్ చేస్తారు.
ఇంతలో తను మా హాస్పిటల్.. మా హాస్పిటల్ అంటుంది. తన హాస్పిటల్ కు తీసుకెళ్లాలట మేడమ్ అని జైలర్ తో చెబుతుంది సుకన్య. సరే.. ఏదో ఒకటి చేయండి అంటుంది. అదంతా మోనిత ప్లాన్ అని జైలుకు తెలియదు. మోనిత మరో నాటకానికి తెర లేపింది.
కట్ చేస్తే.. హిమను స్కూల్ కు పంపించడం కోసం రెడీ చేస్తుంటుంది దీప. శౌర్య.. కుంటుతూ వచ్చి అక్కడ కూర్చుంటుంది. నేను కూడా స్కూల్ కు వెళ్తాను అంటుంది శౌర్య. దెబ్బ తాకింది. నోరు మూసుకొని ఇంట్లో కూర్చో అంటుంది దీప. అమ్మ డాడీ ఎక్కడ అని అడుగుతుంది హిమ. ఏదో ఆపరేషన్ ఉందని హాస్పిటల్ కు వెళ్లాడమ్మా అంటుంది. ఎందుకమ్మా.. డాడీని పలకరిస్తావా? అని అడుగుతుంది దీప. సారీ చెబుతానమ్మా అంటుంది హిమ.
వారణాసిని పిలిచి హిమను స్కూల్ కు తీసుకెళ్లు అని చెబుతుంది దీప. అందరికీ బై చెప్పి వెళ్తుంది హిమ. అందరూ సంతోషంగా ఉంటారు.
ఆసుపత్రికి మోనితను తీసుకొస్తారు. అప్పుడే కార్తీక్ పేషెంట్లతో మాట్లాడుతూ ఉంటాడు. పేషెంట్ తల్లిదండ్రులతో మాట్లాడుతుంటాడు. ఇంతలో డాక్టర్ భారతి వచ్చి తనను చూస్తుంది. కార్తీక్.. తర్వాత మోనిత వైపు రాబోతుంటాడు. కానీ.. రాడు. పక్కనే ఉన్న తన రూమ్ కు వెళ్తాడు. వెంటనే డాక్టర్ భారతి.. ఎమర్జెన్సీలోకి తీసుకెళ్లండి అని చెబుతుంది. ఇంతలోనే హిమ ఆసుపత్రికి వెళ్తుంది. వారణాసి తనను తోలి వెళ్లిపోతాడు.
డాడీ ఎక్కడ అని అడుగుతుంది. ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లాడు అని చెబుతుంది. దీంతో కాసేపు వెయిట్ చేస్తాను అంటుంది హిమ.
ఏంటి మోనిత ఇది.. ఏంటి ఈ పనులు అని అడుగుతుంది భారతి. నాకు ఒక శారీ అరేంజ్ చేయవా? అని అడుగుతుంది మోనిత. ఏంటి మోనిత నువ్వు.. ఇలా ఎందుకు అబద్ధాలు చెప్పి ఇలా ఆసుపత్రికి వచ్చావు అంటుంది.
ఇంతలో దీప.. తనలో తానే ఆలోచిస్తుంటుంది. అసలు.. భవిష్యత్తులో ఏం జరగబోతోంది అని టెన్షన్ పడుతుంది. ఇంతలో అక్కడికి సౌందర్య వస్తుంది. ఏంటే ఏమైంది అని అడుగుతుంది. ఆ మోనిత ధైర్యం ఏంటో నాకు అర్థం కావడం లేదు అత్తయ్య. తప్పు తన వైపు ఉన్నా నన్నే బెదిరిస్తుంది. చాలా గట్టిగా అరుస్తుంది. నీ పిల్లలు నీకెంత ముఖ్యమో.. నాకు పుట్టబోయే బిడ్డ నాకూ అంతే ముఖ్యం అంటుంది.. అనగానే ఆ మోనిత ధైర్యం చూసి నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అంటుంది సౌందర్య.
ఎందుకు అత్తయ్య.. నా జీవితం ఇలా అయిపోయింది. ఎన్ని అని భరించాలి. పిల్లల ప్రశ్నలు ఈటెల్లా గుచ్చుకుంటున్నాయి. ఆ మోనిత రోజురోజుకూ ఏదో ఒక సమస్యను తీసుకొస్తుంది. ఎందుకు అత్తయ్య ఇదంతా ఏ జన్మలో చేసిన పాపమో ఇది. ఆ దేవుడికి ఎందుకు నామీద ఇంత కక్ష.. అనగానే పిచ్చిదానా.. ఇది దేవుడి తప్పు కదే.. నీ పతిదేవుడి తప్పు. బయట ఎన్నో గెలిచిన భర్త.. ఇంట్లో భార్యను గెలుచుకోలేకపోతాడు. తప్పంతా నా కొడుకుదే. ఇదంతా వాడి పొరపాటు వల్ల జరిగిందే కదా. పొరపాటు కాదు.. తొందరపాటు అంటే బెటర్. సమస్యను సాటి ఆడదానిగా చూస్తే ఇదంతా కార్తీక్ తోనే మొదలైంది కదా. నా కొడుకు నిన్ను అపార్థం చేసుకోకపోతే.. మీ మధ్య మూడో మనిషి మోనిత వచ్చి ఉండేది కాదు. నా కొడుకు మామూలు మగాడిలా నిన్ను అనుమానించాడు. మోనిత విషయంలో ఎన్నో సార్లు వాడికి చెప్పాలని చూశాను. వినలేదు.. మోనితతో పెళ్లి దాకా వెళ్లాడు.. ఇప్పుడు బాధపడుతున్నాడు.. అంటుంది సౌందర్య.
ఆ మోనిత వరసలే కలిపేసుకుంది.. అయిందేదో అయిపోయింది. ఆ మోనితకు శిక్ష పడిందని సంతోషిస్తే.. నాకొడుకు నిర్దోషి అని అనుకుంటే అది ఆత్మ వంచనే అవుతుంది దీప అంటుంది సౌందర్య. ఇప్పుడు ఇవన్నీ అనుకొని ఏం లాభం అత్తయ్య అనగానే.. ఇక్కడ శిక్ష నీకే ఎక్కువ పడింది అంటుంది సౌందర్య. కంటికెదురుగా నీ బాధను, కన్నీళ్లను చూస్తూ ఉండలేకపోతున్నా. ఏం చేయలేక ప్రేక్షకురాలిగా మిగిలిపోతున్నాను అంటుంది సౌందర్య. అంటే ఈ విషయంలో మీరు ఏం చేయలేరా? అని అడుగుతుంది దీప. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు నీకు ఒక్కదానికే ఉంది.. ఎవరిని నిలదీస్తావో నీ ఇష్టం అని అంటుంది సౌందర్య.
కట్ చేస్తే.. మోనిత ఇంటర్వ్యూ ఇచ్చిన పేపర్ ను శౌర్య పట్టుకొని ఉండగా.. దీప చూసి.. అత్తమ్మ పేపర్ ఇలా ఇవ్వు అంటుంది. అమ్మ.. నేను ముందే చదివేశా అంటుంది శౌర్య. దీంతో దీప షాక్ అవుతుంది. అసలు నాన్నకు నువ్వంటే ఇష్టమేనా అని అడుగుతుంది శౌర్య. నాకు అబద్ధం చెప్పినా పర్వాలేదు కనీసం హిమకు అయినా నిజం చెప్పండమ్మా అని అంటుంది శౌర్య. మరోవైపు ఆసుపత్రిలో కార్తీక్ ను కలుసుకుంటుంది మోనిత. నీలా మీ పిల్లలకు నేను అబద్ధం చెప్పలేను కార్తీక్. నా కడుపులో ఉన్న బిడ్డకు తండ్రివి నువ్వే కదా కార్తీక్ అని మోనిత.. కార్తీక్ తో చెబుతుండగానే అప్పుడే కార్తీక్ ను కలవడానికి వచ్చిన హిమ.. ఇదంతా విని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.