Janaki Kalaganaledu 7 Nov Today Episode : జ్ఞానాంబ వద్దన్నా వినకుండా అఖిల్ ను అరెస్ట్ చేయించిన జానకి.. దీంతో జానకిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన రామా

Janaki  Kalaganaledu 7 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 నవంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 426 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎవ్వరూ నీకోసం రాలేదు. నేనే కావాలని అలా చెప్పాను. జెస్సీని చాయ్ తీసుకురమ్మని చెప్పి నేనే నీతో పర్సనల్ గా మాట్లాడాలని అలా చెప్పాను అంటుంది. మాధురి ఎవరు అని అడుగుతుంది జానకి. దీంతో మాధురి ఎవరు నాకు తెలియదు అంటాడు అఖిల్. ఈరోజు కాలేజీలో నువ్వు మాధురితో మాట్లాడటం నేను చూశా అంటుంది జానకి. దీంతో నేను అసలు ఇవాళ కాలేజీకే రాలేదు. మాధురితోనే మాట్లాడలేదు అంటాడు అఖిల్. దీంతో ఇంతకుముందు మాధురి ఎవరో తెలియదు అన్నావు. ఇప్పుడు మాధురితో మాట్లాడలేదు అంటున్నావు. నేను మొత్తం చూశాను అఖిల్. నువ్వు మాధురిని కర్రతో కొట్టడం నేను చూశాను. తనను నేనే ఆసుపత్రికి తీసుకెళ్లాను. తను ఇప్పుడు చావుబతుకుల్లో ఉంది అని అంటుంది జానకి.

janaki kalaganaledu 7 november 2022 full episode

దీంతో మాధురి ఇంకా చనిపోలేదా.. తను బతికే ఉందా. ఒకవేళ తనకు స్పృహ వచ్చాక నేనే చంపబోయానని చెబుతుందా? అని అనుకుంటాడు అఖిల్. చెప్పు అఖిల్.. ఎందుకు ఇలా చేశావు. మాధురిని ఎందుకు చంపబోయావు అని అడుగుతుంది జానకి. కానీ.. అఖిల్ ఒక్క మాట కూడా మాట్లాడడు. ఇంతలో అక్కడికి జెస్సీ చాయ్ తీసుకొని వస్తుంది. అక్క.. అఖిల్ మారిపోయాడు అంటుంది. దీంతో అఖిల్ తో అన్ని విషయాలు మాట్లాడలేక తన రూమ్ లోకి వెళ్తుంది. ఈ విషయం రామా గారికి చెప్పాలా అని అనుకుంటుంది. చెప్పాలా వద్దా అని టెన్షన్ పడుతుంది. ఇంతలో రామా నిద్రలేస్తాడు. ఏంటండి.. నిద్రపోకుండా ఆలోచిస్తున్నారు. రండి.. పడుకొండి అని అంటాడు. రామాకు అయినా ఈ విషయం చెబుదామని అనుకుంటుంది. రామా గారు మీకో విషయం చెప్పాలి అంటుంది కానీ.. రామా వినడు. పడుకోండి అంటాడు. దీంతో రామాకు చెప్పలేక పడుకుంటుంది జానకి.

మరోవైపు అఖిల్.. తన రూమ్ లో జానకికి ఈ విషయం ఎలా తెలిసింది అని అనుకొని టెన్షన్ పడతాడు. ఎలా ఈ విషయం నుంచి బయటపడాలి అని అనుకుంటాడు. మరోవైపు తెల్లవారగానే జానకి కనిపించడం లేదని జానకి గారు ఎక్కడికి వెళ్లారు అని అందరినీ అడుగుతాడు రామా.

దీంతో తెలియదు అని అందరూ అంటారు. వదిన లేదు అంటే.. మాధురి గురించి ఏదో నిర్ణయం తీసుకోవడానికే వెళ్లి ఉంటుంది అని టెన్షన్ పడతాడు అఖిల్. మరోవైపు జానకి నా గురించి అంతా తెలుసుకోవడం కోసమే వెళ్లి ఉంటుంది అని భయపడుతుంది మల్లిక.

Janaki Kalaganaledu 7 Nov Today Episode : వెక్కి వెక్కి ఏడ్చిన మాధురి అమ్మానాన్న

మరోవైపు మాధురికి ట్రీట్ మెంట్ చేస్తూ ఉంటారు. తన అమ్మానాన్నలు తన దగ్గరే కూర్చొని బాధపడుతూ ఉంటారు. మాధురి కండీషన్ ఎలా ఉంది అని అప్పుడే ఆసుపత్రికి వచ్చిన జానకి అడుగుతుంది. దీంతో కండీషన్ లో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటి వరకు స్పృహలోకి రాలేదు అని అంటాడు మాధురి నాన్న.

దీంతో ఇద్దరినీ ఓదార్చుతుంది జానకి. భగవంతుడిని ప్రార్థించడం తప్ప మనం ఏం చేయలేం అంటుంది జానకి. ఇంతలో మాధురి శ్వాస తీసుకుంటూ ఉంటుంది. తను శ్వాస గట్టిగా పీల్చి వదిలేస్తూ ఉంటుంది. దీంతో జానకి వెళ్లి డాక్టర్ ను తీసుకొస్తుంది. మీరు పక్కకు రండి అంటుంది డాక్టర్.

వాళ్లను బయటికి పంపిస్తారు. డాక్టర్లు తనను చెక్ చేస్తారు. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అంటారు. కన్యాదానం చేస్తే అదృష్టం అంటారు. కానీ.. ఈరోజుల్లో ఇలాంటి రాక్షసుల వల్ల ఆడపిల్లలను కనాలంటేనే భయమేస్తుంది అంటూ బాధపడుతుంది రాజీ. ఎంతో గారాభంగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు అంటుంది రాజి. మా ఉసురు వాడికి తగలకపోదు. వాడు, వాడి కుటుంబం ఇంతకు ఇంత అనుభవిస్తారు అని అంటుంది రాజీ.

వాడు ఎవడో కానీ.. వాడికి మా వల్ల కాకున్నా ఆ దేవుడు అయినా శిక్షిస్తాడు.. అంటాడు తన తండ్రి. ఇంతలో తను కాలేజీలో ప్రమాణం చేసిన విషయం గుర్తొస్తుంది. మరోవైపు మాధురికి సీరియస్ అవుతుంది. ఒక ఆడపిల్లను అఖిల్ చంపడానికి ట్రై చేయడం నేను చూసి కూడా అలాగే ఊరుకుంటే అది నా తప్పే అవుతుంది అని అనుకుంటుంది జానకి.

ఒక ఆడపిల్లకు న్యాయం జరగాలంటే నేను ఈ పని చేయక తప్పదు.. అని అనుకుంటుంది. ఇంతలో జ్ఞానాంబ ఇంటికి పోలీసులు వస్తారు. జానకి ఫిర్యాదు చేసిందని.. అఖిల్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. జ్ఞానాంబ చెప్పినా కూడా జానకి వినదు. అఖిల్ ను అరెస్ట్ చేయిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Ys Jagan : చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నాం : వైఎస్‌ జగన్

Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…

36 minutes ago

Mass Jathara : మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ మూవీ నుంచి రెండవ గీతం ‘ఓలే ఓలే’ విడుదల

Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…

1 hour ago

Flipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. భారీ డిస్కౌంట్‌తో రూ.9499కే పవరుఫుల్ ఫోన్!

Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…

3 hours ago

Sudigali Sudheer : సుధీర్‌ని ఎద‌గ‌నీయ‌కుండా చేస్తున్న సీనియ‌ర్ హీరో.. ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న ఫ్యాన్స్

Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…

4 hours ago

Rajinikanth : శ్రీదేవిని ప్రాణంగా ప్రేమించిన ర‌జ‌నీకాంత్‌.. ప్ర‌పోజ్ చేద్దామ‌నుకున్న స‌మ‌యంలో..!

Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…

5 hours ago

Harish Rao : అసెంబ్లీలో 655 పేజీల రిపోర్టు పెట్టండి.. చీల్చి చెండాడుతాం : హ‌రీశ్‌రావు

Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…

6 hours ago

Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం..!

Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…

7 hours ago

Tight Jeans : టైట్ దుస్తులు ధరించడం ఫ్యాషన్ కాదు… ఆ విష‌యంలో పెద్ద ముప్పే..!

Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…

8 hours ago