Janaki Kalaganaledu 7 Nov Today Episode : జ్ఞానాంబ వద్దన్నా వినకుండా అఖిల్ ను అరెస్ట్ చేయించిన జానకి.. దీంతో జానకిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన రామా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janaki Kalaganaledu 7 Nov Today Episode : జ్ఞానాంబ వద్దన్నా వినకుండా అఖిల్ ను అరెస్ట్ చేయించిన జానకి.. దీంతో జానకిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన రామా

Janaki  Kalaganaledu 7 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 నవంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 426 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎవ్వరూ నీకోసం రాలేదు. నేనే కావాలని అలా చెప్పాను. జెస్సీని చాయ్ తీసుకురమ్మని చెప్పి నేనే నీతో పర్సనల్ గా మాట్లాడాలని అలా చెప్పాను అంటుంది. మాధురి ఎవరు అని అడుగుతుంది జానకి. దీంతో మాధురి ఎవరు నాకు తెలియదు అంటాడు […]

 Authored By gatla | The Telugu News | Updated on :7 November 2022,9:00 am

Janaki  Kalaganaledu 7 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 నవంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 426 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎవ్వరూ నీకోసం రాలేదు. నేనే కావాలని అలా చెప్పాను. జెస్సీని చాయ్ తీసుకురమ్మని చెప్పి నేనే నీతో పర్సనల్ గా మాట్లాడాలని అలా చెప్పాను అంటుంది. మాధురి ఎవరు అని అడుగుతుంది జానకి. దీంతో మాధురి ఎవరు నాకు తెలియదు అంటాడు అఖిల్. ఈరోజు కాలేజీలో నువ్వు మాధురితో మాట్లాడటం నేను చూశా అంటుంది జానకి. దీంతో నేను అసలు ఇవాళ కాలేజీకే రాలేదు. మాధురితోనే మాట్లాడలేదు అంటాడు అఖిల్. దీంతో ఇంతకుముందు మాధురి ఎవరో తెలియదు అన్నావు. ఇప్పుడు మాధురితో మాట్లాడలేదు అంటున్నావు. నేను మొత్తం చూశాను అఖిల్. నువ్వు మాధురిని కర్రతో కొట్టడం నేను చూశాను. తనను నేనే ఆసుపత్రికి తీసుకెళ్లాను. తను ఇప్పుడు చావుబతుకుల్లో ఉంది అని అంటుంది జానకి.

janaki kalaganaledu 7 november 2022 full episode

janaki kalaganaledu 7 november 2022 full episode

దీంతో మాధురి ఇంకా చనిపోలేదా.. తను బతికే ఉందా. ఒకవేళ తనకు స్పృహ వచ్చాక నేనే చంపబోయానని చెబుతుందా? అని అనుకుంటాడు అఖిల్. చెప్పు అఖిల్.. ఎందుకు ఇలా చేశావు. మాధురిని ఎందుకు చంపబోయావు అని అడుగుతుంది జానకి. కానీ.. అఖిల్ ఒక్క మాట కూడా మాట్లాడడు. ఇంతలో అక్కడికి జెస్సీ చాయ్ తీసుకొని వస్తుంది. అక్క.. అఖిల్ మారిపోయాడు అంటుంది. దీంతో అఖిల్ తో అన్ని విషయాలు మాట్లాడలేక తన రూమ్ లోకి వెళ్తుంది. ఈ విషయం రామా గారికి చెప్పాలా అని అనుకుంటుంది. చెప్పాలా వద్దా అని టెన్షన్ పడుతుంది. ఇంతలో రామా నిద్రలేస్తాడు. ఏంటండి.. నిద్రపోకుండా ఆలోచిస్తున్నారు. రండి.. పడుకొండి అని అంటాడు. రామాకు అయినా ఈ విషయం చెబుదామని అనుకుంటుంది. రామా గారు మీకో విషయం చెప్పాలి అంటుంది కానీ.. రామా వినడు. పడుకోండి అంటాడు. దీంతో రామాకు చెప్పలేక పడుకుంటుంది జానకి.

మరోవైపు అఖిల్.. తన రూమ్ లో జానకికి ఈ విషయం ఎలా తెలిసింది అని అనుకొని టెన్షన్ పడతాడు. ఎలా ఈ విషయం నుంచి బయటపడాలి అని అనుకుంటాడు. మరోవైపు తెల్లవారగానే జానకి కనిపించడం లేదని జానకి గారు ఎక్కడికి వెళ్లారు అని అందరినీ అడుగుతాడు రామా.

దీంతో తెలియదు అని అందరూ అంటారు. వదిన లేదు అంటే.. మాధురి గురించి ఏదో నిర్ణయం తీసుకోవడానికే వెళ్లి ఉంటుంది అని టెన్షన్ పడతాడు అఖిల్. మరోవైపు జానకి నా గురించి అంతా తెలుసుకోవడం కోసమే వెళ్లి ఉంటుంది అని భయపడుతుంది మల్లిక.

Janaki Kalaganaledu 7 Nov Today Episode : వెక్కి వెక్కి ఏడ్చిన మాధురి అమ్మానాన్న

మరోవైపు మాధురికి ట్రీట్ మెంట్ చేస్తూ ఉంటారు. తన అమ్మానాన్నలు తన దగ్గరే కూర్చొని బాధపడుతూ ఉంటారు. మాధురి కండీషన్ ఎలా ఉంది అని అప్పుడే ఆసుపత్రికి వచ్చిన జానకి అడుగుతుంది. దీంతో కండీషన్ లో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటి వరకు స్పృహలోకి రాలేదు అని అంటాడు మాధురి నాన్న.

దీంతో ఇద్దరినీ ఓదార్చుతుంది జానకి. భగవంతుడిని ప్రార్థించడం తప్ప మనం ఏం చేయలేం అంటుంది జానకి. ఇంతలో మాధురి శ్వాస తీసుకుంటూ ఉంటుంది. తను శ్వాస గట్టిగా పీల్చి వదిలేస్తూ ఉంటుంది. దీంతో జానకి వెళ్లి డాక్టర్ ను తీసుకొస్తుంది. మీరు పక్కకు రండి అంటుంది డాక్టర్.

వాళ్లను బయటికి పంపిస్తారు. డాక్టర్లు తనను చెక్ చేస్తారు. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అంటారు. కన్యాదానం చేస్తే అదృష్టం అంటారు. కానీ.. ఈరోజుల్లో ఇలాంటి రాక్షసుల వల్ల ఆడపిల్లలను కనాలంటేనే భయమేస్తుంది అంటూ బాధపడుతుంది రాజీ. ఎంతో గారాభంగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు అంటుంది రాజి. మా ఉసురు వాడికి తగలకపోదు. వాడు, వాడి కుటుంబం ఇంతకు ఇంత అనుభవిస్తారు అని అంటుంది రాజీ.

వాడు ఎవడో కానీ.. వాడికి మా వల్ల కాకున్నా ఆ దేవుడు అయినా శిక్షిస్తాడు.. అంటాడు తన తండ్రి. ఇంతలో తను కాలేజీలో ప్రమాణం చేసిన విషయం గుర్తొస్తుంది. మరోవైపు మాధురికి సీరియస్ అవుతుంది. ఒక ఆడపిల్లను అఖిల్ చంపడానికి ట్రై చేయడం నేను చూసి కూడా అలాగే ఊరుకుంటే అది నా తప్పే అవుతుంది అని అనుకుంటుంది జానకి.

ఒక ఆడపిల్లకు న్యాయం జరగాలంటే నేను ఈ పని చేయక తప్పదు.. అని అనుకుంటుంది. ఇంతలో జ్ఞానాంబ ఇంటికి పోలీసులు వస్తారు. జానకి ఫిర్యాదు చేసిందని.. అఖిల్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. జ్ఞానాంబ చెప్పినా కూడా జానకి వినదు. అఖిల్ ను అరెస్ట్ చేయిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది